*చెల్లెలు పుట్టుకను ప్రశ్నించి తల్లిని అపవాదు చేసిన పార్టీ వైసీపీ*
*రూపాయి నెత్తిన పెట్టి వేలం వేస్తే...ఒక్క పైసాకు అమ్ముడుపోని వ్యక్తి జగన్*
*ఈ ఎన్నికల్లో వైసీపీకి శవయాత్రకు నిర్వహించేదుకు ప్రజలు సిద్దంగా ఉన్నారు*
*వైసీపీని భూ స్ధాపితం చేసేవరకు నేను, పవన్ పోరాటం చేస్తాం*
*దగాకోరు ప్రభుత్వం పోయి ప్రజా ప్రభుత్వం రావాలి*
*బొత్స కుటుంబం విజయనగరం జిల్లాను దోచేసింది*
*వైసీపీ నేతలు దోచిందంతా కక్కిస్తా*
*విజయనగరం ప్రజా గళం సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు*
విజయనగరం (ప్రజా అమరావతి: జగన్ మీటింగ్ లు వెల వెల, మన మీటింగ్ లు కళ కల, టీడీపీ, బేజేపీ జనసేన కాంబినేషన్ సూపర్ హిట్. కూటమి అభ్యర్దులు నామినేషన్ ర్యాలీలు విజయయాత్రను తలపిస్తుంటే...వైసీపీ అభ్యర్దుల నామినేషను ర్యాలీలు జనాలు లేక వెళవెళబోతున్నాయి. జగన్ 2014లో తండ్రి శవంతో వచ్చాడు, 2019లో బాబాయి శవంతో వచ్చాడు. ఇప్పుడు గులకరాయి డ్రామాతో వస్తున్నాడు. ఈ ఎన్నికల్లో వైసీపీకి శవయాత్రకు నిర్వహించేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారు. విజయనగరం కోట సాక్షిగా చెబుతున్నాం. కూటమి అధికారంలోకి రాబోతోంది, ప్రమాణ స్వీకారం తేదీ కూడా త్వరలో చెబుతాం.ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది, వైసీపీకి డిపాజిట్లు గల్లంతే. పవన్ నిస్వార్ధంతో రాష్ట్రం కోసం ముందుకొచ్చారు. పవన్ తో జగన్ కి పోలికా? రూపాయి నెత్తిన పెట్టి వేలం వేస్తే...ఒక్క పైసాకు అమ్ముడుపోని వ్యక్తి జగన్. అరాచక, దోపిడి విధ్వంస ప్రభుత్వం ఇది, వైసీపీని భూ స్ధాపితం చేసేవరకు పోరాటం చేస్తాం.
*అశోక్ గజపతిరాజును అవమానించిన జగన్ మూల్యం చెల్లించక తప్పదు*
అశోక్ గజపతి రాజు నీతి నిజాయితీకి మారుపేరు. ప్రజా సేవకు తమ సొంత ఆస్తులు ఇచ్చి ట్రస్ట్ ల ద్వారా సేవ చేస్తున్నారు. అలాంటి వారికి కనీస గౌరవం లేకుండా అవమానించారు. సింహాచలం ట్రస్ట్ బోర్డు పై ఏ ప్రభుత్వం జోక్యం చేసుకోలేదు. దాని నుంచి తొలగించారు. మాన్సాస్ ట్రస్ట్ పై అవినీతి ఆరోపణలు చేశారు. పోగాలం దాపురిస్తే ఇలానే వ్యవహరిస్తారు. అశోక్ గజపతిరాజును వేధించిన జగన్ ముందు రోజుల్లో మూల్యం చెల్లించక తప్పదు.
*దగాకోరు ప్రభుత్వం పోయి ప్రజా ప్రభుత్వం రావాలి*
ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలన్న లక్ష్యంతోనే మూడు పార్టీల పొత్తు. సంక్షేమం, అభివృద్ది, ప్రజాస్వామ్య పరిరక్షణే మా ధ్వేయం. ఉత్తరాంధ్ర ద్రోహి జగన్ రెడ్డి, నేను ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టుల కోసం 5 ఏళ్లలో రూ. 2 వేల కోట్లు ఖర్చు పెట్టా. జగన్ ఎంత ఖర్చు చేశారో చెప్పగలరా? వంశధార నాగవలి అనుసంధానికి శ్రీకారం చుట్టాం, పోలవరం పూర్తి చేసి నధుల అనుసంధానం చేయాలనుకున్నాం. కానీ నేడు ఒక్క ప్రాజెక్టు పూర్తి చేశారా? యువత ఇంటికొకరు బయటొకొచ్చి కూటమి గెలుపు కోసం పనిచేయండి, మీ భవిష్య్తత్తును బంగారు భవిష్యత్తు చేస్తా... మేం అధికారంలోకి రాగానే నిత్యవసర ధరలు తగ్గిస్తాం. పేదలకు మేలు చేస్తాం. జగన్ మీ జీవితాల్ని నాశనం చేశాడు. మీ జీవితాల్లో వెలుగులు తీసుకొచ్చి..బంగారు మయం చేస్తాం. దగాకోరు ప్రభుత్వం పోయి ప్రజా ప్రభుత్వం రావాలి, జగన్ చెప్పినట్టు ఇది క్లాస్ వార్ కాదు క్యాష్ వార్ . డబ్బులన్నీ జగన్ అండ్ కో దగ్గరే ఉన్నాయి, పేదలు నిరుపేదలుగా మారిపోయారు. వైసీపీ నేతలు దోచిందంతా కక్కిస్తా.
*సూపర్ సిక్స్*
ఆడబిడ్డ నిధి కింద మహిళలకు నెలకూ. 1500 ఇస్తాం, తల్లికి వందనం కింద ఎంత మంది పిల్లలున్నా..ఒక్కొక్కరికి ఏడాదికి రూ. 15 వేలిస్తాం. ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత సౌకర్యం కల్పిస్తాం. డ్రాక్రా మహిళలకు రూ. 10 లక్షల వరకు వడ్డీలేని రుణం అందిస్తాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సమన్వయంతో మహిళల్ని లక్షాధికారుల్ని చేస్తాం. జగన్ ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ అన్నాడు...ఇచ్చాడా? మెగా డీఎస్సీ అన్నాడు..ఇచ్చాడా? కూటమి అధికారంలోకి రాగానే మొదటి సంతకం డీఎస్సీపైనే పెడతా. ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తాం. బోగాపురం ఎయిర్ పోర్ట్ కడతాం. ఐటీకి ఫ్రాధాన్యత ఇస్తాం. వర్క్ ప్రమ్ హోం విధానం తెస్తాం. నెలకు నిరుద్యోగ భృతి రూ. 3 వేలిస్తాం. అన్నదాత కింద రైతుకు ఏడాదికి రూ. 20 వేలిస్తాం. జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం. కరెంట్ చార్జీలు పెంచకుండా నాణ్యమైన కరెంట్ అందిస్తాం. కరెంట్ కోతలతో నేడు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జగన్ పాలనలో రాష్ట్రం అన్ని విధాల నాశనమైంది, రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెడతా.
*జగన్ అహంకారి, సైకో*
జగన్ అహంకారి, సైకో.. నన్ను, చంద్రబాబుని జగన్ అవమానిస్తున్నాడు. మా ఇంట్లో ఆడవాళ్లను, పవన్ ఇంట్లో ఆడవాళ్లను బజారుకి లాగే బజారు రౌడీలు వైసీపీ నేతలు. ఇవి చూసినపుడు కోపం వస్తుంది, కానీ మీపై బాధ్యత మాకు గుర్తొస్తోంది. మీ కోసమే పనిచేస్తున్నాం. మీ ఓటే వజ్రాయుధం, దాంతో జగన్ లాంటి దుర్మార్గులను చిత్తు చిత్తుగా ఓడించి భూ స్ధాపితం చేస్తామని శపధం చేయాలి. అహంకారికి అధికారం, డబ్బు వచ్చేసరికి పోలీసు బలంతో అరాచకాలు చేస్తున్నాడు. కిమ్ సోదరుడు జగన్ రెడ్డి, ఎవరూ నవ్వినా, ఎవరి దగ్గర డబ్బులన్నా జగన్ సహించడడు, అందర్ని వేధించడం, భయబ్రాంతుకలు గురి చేయటం, అందర్నీ దోచుకోవటం జగన్ నైజం. మా పోరాటం రాష్ట్రం కోసమే. మాకు మీ సహకారం కావాలి. అధితి గజపతిరాజు సేవాభాంతో ముందుకొచ్చింది, నీతినిజాయితీ గల్గిన అదితి గజపతిరాజుని విజయనగరంలో భారీ మెజార్టీతో గెలిపించాలి. సాధారణ కార్యకర్త అప్పల నాయుడుని విజయనగరం ఎంపీగా పెట్టాం. అది మా ఆలోచన విదానం, కానీ సైకో జగన్ డబ్బులున్న వారికి అతనికి ఊడిగం చేసేవాళ్లకు ఎంపీ టిక్కెట్లు ఇచ్చారు.
*బొత్స కుటుంబం విజయనగరం జిల్లాను దోచేసింది*
బొత్స కుటుంబం జిల్లాను దోచేసింది, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రి పదవులు అన్నీ వారికే...కానీ మేం సాధారణ కార్యకర్తలను తెచ్చి సమర్ధవంతమైన నాయకులుగా తయారు చేస్తున్నాం. ఇక్కడ ఎమ్మెల్యే వీరభద్ర స్వామి...బొత్స కుటుంబం దోచుకోక మిగిలించి ఇతను దోచేస్తున్నాడు. అపార్టు మెంట్లు కట్టాలన్నా, లే అవుట్లు వేయాలన్నా ఇతనికి కప్పం కట్టాలి. ఉత్తరాంధ్రపై విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి పెత్తనం ఏంటి? విశాఖలో రూ. 40 వేల కోట్ల ఆస్తులు కొట్టేశారు. ఈ ప్రాంతానికి చెందిన అశోక్ గజపతి రాజు, ఎర్న్రన్నాయుడుని కేంద్ర మంత్రులుగా చేసిన ఘనత టీడీపీదే.
*టీడీపీ అధికారంలోకి రాగానే*
మాన్సాస్ ట్రస్ట్ కింద నడిచే మహరాజా కాలేజీని ప్రవేట్ పరం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని ప్రవేట్ పరం కానివ్వం. మహారాజ ఆసుపత్రి పేరు మార్చారు, దానికి మళ్లీ అదే పెడతాం. ప్రతి ఇంటికి కుళాయి సురక్షిత నీరందిస్తాం. 4 వేల టిడ్కో ఇళ్లు కట్టాం,వాటిని మీకు ఉచితంగా ఇస్తాం, పేదలకు రెండు నుంచి మూడు సెంట్ల వరకు ఉచితంగా భూమి ఇచ్చి ఇళ్లు కట్టిస్తాం. ఫించన్ రూ. 4 వేలకు పెంచుతాం. పెంచిన ఫించన్ ఏప్రిల్ నెల నుంచే ఇస్తాం. వికలాంగులకు రూ. 6 వేలు ఫించన్ ఇస్తాం. ఇవన్నీ ఎలా చేస్తారని అడుగుతున్నారు, చేసే సత్తా నాకుంది, బీజేపీ, పవన్ సహకారంతో చేసి చూపిస్తా... ప్రపంచంలో, దేశంలో భారతీయులు, తెలుగువారు నెం.గా ఉండాలన్నదే మోదీ లక్ష్యం నాలక్ష్యం. పేదరికం లేని రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దుతాం. నేను 14 ఏళ్లలో ముఖ్యమంత్రిగా ఏం చేశానో..వచ్చే 5 ఏళ్లలో అంతకంటే నాలుగు రెట్లు అభివృద్ది చేస్తా.
*నెత్తిన రూపాయి పెడితే పైసాకు అమ్ముడుపోని వ్యక్తి జగన్*
నెత్తిన రూపాయి పెడితే జగన్ పైసాకు అమ్ముడుపోడు, జగన్ ని భరించలేక వైయస్ బెంగుళూరు తరిమేశాడు. ఎన్నికల ముందు తల్లిని వాడుకున్నాడు, పార్టీ గౌరవాధ్యక్ష పదవి ఇచ్చారు, కానీ ఇప్పుడు పరిస్ధితి ఏంటి? తల్లికి అన్నం పెట్టని వాడు ఆడబిడ్డలకు అన్నం పెడతాడా? తండ్రి ఆస్తిలో చెల్లికి చిల్లి గవ్వఇవ్వని వ్యక్తి జగన్. చెల్లెలు పుట్టుకను ప్రశ్నించి తల్లిని అపవాదు చేసిన పార్టీ వైసీపీ. ఇంత నీచులు ఎవరైనా ఉంటారా? సీబీఎన్ బ్రాండ్...హైదరాబాద్ ఐటెక్ సిటీ...ఔటర్ రింగ్ రోడ్డు, ఎయిర్ పోర్ట్, కియా మోటార్స్ ఇవన్నీ నా బ్రాండ్, జగన్ బ్రాండ్ గంజాయి, డ్రగ్స్. రాష్ట్రానికి ఎవరూ చేయని నష్టం చేసిన దుర్మార్గుడు జగన్ . ఇలాంటి వారు రాజకీయాలకు అర్హులా? సిగ్గులేకుండా 90 శాతం హామీలు అమలు చేశానంటున్నాడు. వారంలో రద్దు అన్న సీపీఎస్ రద్దు చేశాడా? మద్య పాన నిషేదం చేస్తేనే ఓట్లడుగుతానన్నాడు చేశాడా? కరెంట్ చార్జీలు పెంచని చెప్పి పెంచాడా లేదా? రూ. 10 ఇచ్చి రూ. 100 దోచుకుంటున్నాడు. మన ఆస్తుల్ని కబ్జా చేస్తున్నారు... రేపు జరిగే ఎన్నికల్లో కౌరవ వద తప్పదు. మీ కోసం మేము ఎలాంటి పోరాటానికైనా సిద్దంగా ఉన్నాం. పవన్ పై కేసులు పెట్టారు, ఆయన ఎవరి కోసం కేసులు పెట్టించుకోవాలి, చిరంజీవిని, రాజమౌళిని జగన్ ఇంటికి పిలిపించుకుని కనీస మర్యాద ఇవ్వకుండా అవమానించారు. వైసీపీ అరాచకాలపై ప్రశ్నిస్తే...మీ సినిమాలు ఆడనివ్వం కేసులు పెడతామంటూ బెదిరిస్తారా? అరాచక పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. రేపు ఎన్నికల్లో జగన్ మీకు 5 వేలిస్తాడు, మద్యం బాటిల్లు ఇస్తాడు వాటికి ప్రభావితం కావొద్దు... ఎన్డీయే కూటమి గెలిస్తే అభివృద్ది. కూటమి గెలవాలి రాష్ట్రం, దేశం అభివృద్ది చెందాలి. కూటమి 175 ఎమ్మెల్యే 25 ఎంపీ సీట్లు గెలవాలి. జగన్ ఇంకా సిగ్గులేకుండా 175 కి 175 గెలుస్తానంటూ మైండ్ గేమ్ ఆడుతున్నాడు... అందుకే నేనంటున్నా...వైనాట్ పులివెందుల...పులివెందుల ప్రజానీకంలో మార్పు వచ్చి జగన్ ని చిత్తు చిత్తుగా ఓడించి ప్రపంచానికి ఓ సందేశం ఇవ్వాలని చంద్రబాబు నాయుడు అన్నారు.
addComments
Post a Comment