*అధికారంలోకి వచ్చిన యేడాదిలో కుప్పంకు హంద్రీనీవా నీళ్లు*
*జగన్ లాంటి సెట్టింగుల సీఎం వస్తాడని సినిమా డైరెక్టర్లు కూడా ఊహించలేదు*
*ట్యాంకర్ లో నీళ్లు తెచ్చి కాలువలో పోసి...బటన్ నొక్కి జగన్ వెళ్లిపోయాడు*
*జగన్ ఇచ్చిన జీవోలు, నొక్కిన బటన్లు అన్నీ డమ్మీలే*
*వైసీపీ డ్రామా కంపెనీ...త్వరలో మూతబడుతుంది*
*హెలికాప్టర్ లో వస్తే చెట్లన్నీ నరికేశాడు...రోడ్ల మీద వస్తే ఇళ్లు పీకేస్తాడేమో.?*
*అధికారంలోకి వచ్చాక రెస్కోను కొనసాగిస్తాం*
*-టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు*
*కుప్పంలోని రాజుపేట వద్ద హంద్రీనీవా బ్రాంచ్ కెనాల్ పరిశీలించిన చంద్రబాబు*
కుప్పం (ప్రజా అమరావతి):- ట్యాంకర్ లో నీళ్లు తెచ్చి పోసి సినిమా సెట్టింగ్ లాగా గేటు పెట్టి జగన్ బటన్ నొక్కి వెళ్లిపోయారు. బటన్ నొక్కినా నీళ్లు నీళ్లు రాలేదు.
• తెచ్చిపోసిన నీళ్లు తెల్లారేసరికి ఇంకిపోయాయి. అద్దెకు తెచ్చిన గేట్లను సాయంత్రానికే అధికారులు వచ్చి ఎత్తుకెళ్లారు. ఇలాంటి సెట్టింగుల సీఎం వస్తాడని డైరెక్టర్లు, నిర్మాతలు కూడా అనుకోలేదు.
• కుప్పం భూమిపై నడిస్తే అరిగిపోతాడని రెండు హెలిప్యాడ్ లు ఏర్పాటు చేసి తిరిగాడు. ఆర్టీసీ బస్సులు, స్కూల్ బస్సులున్నీ పెట్టి జనాన్ని తరలించారు. ఇలాంటి ఘనకార్యాలు చేసిన నువ్వు...నన్ను ఓడిస్తావా.?.
• ప్రజలు ఛీ కొడతారన్న ఇంగితజ్ణానం కూడా లేకుండా నీళ్ల తెచ్చానంటూ డ్రామాలాడారు. ఐదేళ్లుగా నడిపిన వైసీపీ డ్రామా కంపెనీని శాశ్వతంగా మూసేయబోతున్నారు. రోడ్డు మార్గం ద్వారా పర్యటనకు మళ్లీ కుప్పం వస్తానని చెప్తున్నాడు...ఏం మొహం పెట్టుకుని వస్తావు.?
• హెలికాప్టర్ లో వస్తే చెట్లు నరికించేశాడు...రోడ్ల మీద వస్తే ఇళ్లు పీకేస్తాడేమో.? నిర్లక్ష్యం ఉండవచ్చు కానీ...కక్ష కట్టి నిర్లక్ష్యం వహించడం సమంజసం కాదు.
• నీకు కొన్ని ఓట్లు వేసిన పాపానికి ఇలా చేయడం దుర్మార్గం. జరగని అరాచకం రాష్ట్రంలో ఏమన్నా ఉందా?
• ఉత్తుత్తి బటన్ నొక్కి నీళ్లు వదిలారు...కనీసం మట్టి పెళ్లలు కూడా తడవలేదు.
• రాష్ట్రంలో రికార్డులు తారుమారు చేస్తున్నారు. పట్టాదారు పాసుపుస్తకాలు, సర్టిఫికేట్లపై జగన్ ఫోటో పెట్టుకున్నారు.
• ప్రజాకోర్టులో జగన్ ను శిక్షించాలి. ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారు. వలంటీర్లు సేకరించిన ప్రజల వ్యక్తిగత సమాచారం వలంటీర్లు, ఐప్యాక్ వద్ద ఉంది..వలంటీర్ల వద్ద ఉన్న ఫోనులు కూడా వెనక్కి తీసుకోవాలి.
• కుప్పంలో మెడికల్ కాలేజీతో పాటు అన్నీ అభివృద్ధి చేశా...పులివెందులను కూడా అభివృద్ధి చేశాను. గతంలోనూ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కుప్పంలో ఇజ్రాయేల్ టెక్నాలజీ నిలిపిపేశారు. ఇప్పుడు జగన్ వచ్చాక మొత్తం నాశనం చేశాడు. సంపదను కొల్లగొట్టారు.
• కుప్పంలో నీతి, నిజాయితీ ఉంది. నేను ఏ ఎన్నికలకు రాకుండా వాళ్లే నామినేషన్ వేయించి గెలిపించారు. గుండిశెట్టిపల్లెలో బసవేశ్వరస్వామి మాన్యం భూమిని కొట్టేయాలని చూస్తున్నారు.
• జె.బ్రాండ్స్ వచ్చాయని చెప్పినప్పుడు కాదని నిరూపించకుండా మాపై దాడులకు దిగారు. గంజాయి వచ్చిందని చెప్తే మా కార్యాలయంపై దాడి చేశారు. డ్రగ్స్ పై కనీసం స్పందించలేదు.
• నేర సామ్రాజ్యానికి విజయసాయిరెడ్డి వరల్డ్ ఫిగర్. తప్పులు చేసి ఎదుటివారిని నిందిస్తున్నారు. ప్రజలు తిరగబాటు చేయనంత వరకూ వీళ్లు అరాచకాలు చేస్తూనే ఉంటారు.
• రాష్ట్ర బ్రాండ్ ను దెబ్బతీశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే హంద్రీనీవా పూర్తి చేసి యేడాదిలో నీళ్లు కుప్పంకు ఇస్తాం.
• జగన్ కు ఓటేస్తే ఎవరి కుటుంబానికి వారు అన్యాయం చేసినట్లే. జగన్ ఇచ్చిన జీవోలు, నొక్కిన బటన్లు అన్నీ డమ్మీలే. ఇంత విధ్వంసాన్ని నా జీవితంలో చూడలేదు..అన్నీ సరిచేస్తాం. రెస్కోను కొనసాగిస్తాం.
addComments
Post a Comment