వైసీపీలో తిరుగుబాటు...జగన్ కు త్వరలో భంగపాటు.



*వైసీపీలో తిరుగుబాటు...జగన్ కు త్వరలో భంగపాటు* 




*సొంత చెల్లెలు పుట్టుకపై తప్పుడు రాతలు రాయించే జగన్ మానసిక స్థితిపై ప్రజలు ఆలోచించాలి* 


*తోడబుట్టినదానిపై వ్యాఖ్యలు కన్న తల్లికి అవమానం కాదా జగన్*


*వివేకా హత్యపై సునీత అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు జగన్ సిద్ధమా?*


*వివేకా హంతకులను అరెస్టు చేసేందుకు జగన్ సిద్ధమా.?*


*బుల్లెట్...బుల్లెట్ అని ఎగిరిపడ్డ అనిల్ కు బుల్లెట్ తగిలి మూడు జిల్లాల అవతల పడ్డాడు*


*రాష్ట్రం కోసమే టీడీపీ-జనసేన పొత్తు*


*పవన్ కళ్యాన్ కు ఎప్పుడూ గౌరవముంటుంది...మా పొత్తుపై జగన్ కుట్రలు పనిచేయవు.* 


*రాజకీయ చైతన్యం ఉన్న ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 సీట్లూ గెలవబోతున్నాం.*


-*టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు*


*పార్టీలో చేరిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రశాంతి రెడ్డి దంపతులు, నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, అనుచరులు*


*వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లోక్ సభ ఎంపీగా గెలవబోతున్నారన్న చంద్రబాబు*



నెల్లూరు  (ప్రజా అమరావతి):- వైసీపీలోనే జగన్ పై తిరుగుబాటు మొదలైందని జగన్ కు త్వరలో భంగపాటు తప్పదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.  వైసీపీలో అంతా బానిసలుగా ఉండి...తాను మాత్రం రాజులా ఉండాలనేది జగన్ అభిమతని అన్నారు. జగన్ ఇష్టానుసారంగా ప్రవర్తించబట్టే నేతలు బైబై చెప్తున్నారని...కార్యకర్తలు కూడా తిరుగుబాటు చేస్తున్నారని అన్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రశాంతిరెడ్డి దంపతులు, నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ పెద్ద ఎత్తున అనుచరులతో కలిసి పార్టీలో చేరారు. వీరికి చంద్రబాబు కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ....‘‘వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అజాత శత్రవు. ప్రజాసేవకు మారుపేరు  వేమిరెడి ప్రభాకర్ రెడ్డి. రాష్ట్రానికి మంచి చేయాలి, ప్రజలకు సేవ చేయాలని ఏకైక ధ్యేయంతో ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. అందుకే మనస్ఫూర్తిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రశాంతి రెడ్డి పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. రూప్ కుమార్ యాదవ్ పార్టీలోకి రావడం కొత్త ఊపునిస్తోంది. సమర్థవంతమైన నాయకుడు, న్యాయం కోసం పోరాడిన వ్యక్తి. నెల్లూరు పార్లమెంట్ స్థానాన్ని సునాయాసంగా మనం గెలుస్తున్నాం. ఉమ్మడి నెల్లూరు జిల్లా మొత్తం ఖాళీ అవుతోంది. మనమంతా ఒక కుటుంబ సభ్యులుగా మెలగాలి. ఎవరికీ గౌరవం తగ్గకుండా తగిన స్థానం కల్పించే బాధ్యత నాది. ఎవరు చేరినా హైదరాబాద్, అమరావతిలో కండువా వేసేవాన్ని...కానీ నేనే స్వయంగా నెల్లూరుకు వచ్చి వేమిరెడ్డిని పార్టీలోకి ఆహ్వానించానంటే ఆదే ఆయనకు ఇచ్చే ప్రత్యేకత. రాజకీయాలకు వేమిరెడ్డి అవసరం..గౌరవం తెస్తారు...అందుకే బాధ్యతగా వచ్చి స్వాగతం పలుకుతున్నా. అమరజీవి పొట్టి శ్రీ రాములు పుట్టిన గడ్డ...జెజవాడ గోపాల్ రెడ్డి...సారా వ్యతిరేక ఉద్యమం నడిపిన దూబగుంట రోశమ్మ పుట్టిన జిల్లా ఈ నెల్లూరు. రాష్ట్ర రాజకీయాల్లో సింహపురి రాజకీయాలు ఎప్పుడూ ప్రత్యేకమే. ఇక్కడినేతలు ఆత్మభిమానంతో ఉంటారు. 


*మొన్నటిదాకా విశాఖను దోచిన వ్యక్తి...ఇప్పుడు నెల్లూరుకు వస్తున్నాడు*


మనం చేసే విధానం తప్పని చెప్పిన ఆనం రామనారాయణరెడ్డికి నియోజకవర్గంలో సహకరించలేదు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని కూడా వేధించి వెంటాడారు. మేకపాటి చంద్రవేఖర్ రెడ్డి నాలుగు సార్లు గెలిచినా గౌరవం లేక బయటకు వచ్చారు. ప్రజాసేవకకు అంకితమైన వారిని పార్టీలోకి స్వాగతించి గౌరవిస్తాం. అహంకారంతో రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన వ్యక్తిని ఇంటికి పంపాలి. నా కోసం, పవన్ కోసం, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోసం కాదు...5 కోట్ల ప్రజానీకం కోసం, భావితరాల కోసం అంతా ఆలోచించాలి. మనం శాశ్వతం కాదు..సమాజం, రాష్ట్రం శాశ్వతం. జగన్ మాటలు చూస్తే నాటకం..బూటకం, నవ్వుతూ గొంతుకోసే రకం. ఎన్నికల నోటిఫికేషన్ వస్తే వైసీపీ వాళ్లు భయపడే రోజు వస్తుంది. విశాఖను దోచిన వ్యక్తిని నెల్లూరు ఎంపీగా పోటీ చేయాలని పంపారు. విశాఖలో ఊడ్చేశాడు..ఇప్పుడు నెల్లూరుకు వచ్చాడు. దోచుకున్న డబ్బులతో సిద్ధం అని హోర్డింగులు పెడుతున్నారు. ఇంత విచ్చలవిడిగా ముఖ్యమంత్రులు డబ్బులు ఖర్చు చేయడాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. సిద్ధం అంటే నాకు అర్థం కాలేదు..కానీ ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. 175 స్థానాల్లో గెలుస్తాం అన్నాడు...85 అభ్యర్థులను మార్చుడు. ఎవరు ఎక్కడ పోటీ చేస్తారో తెలిదు. విజయసాయిరెడ్డి కూడా ఉంటాడో లేదో తెలీదు. 


*బుల్లెట్ అని ఎగిరిపడ్డ అనిల్ మూడు జిల్లాల అవతల ఎగిరిపడ్డాడు*


మొన్నటిదాకా నెల్లూరు నడివీధుల్లో అనిల్ కుమార్ ఎగిరి పడ్డాడు. మంత్రిగా ఉన్నప్పుడు ఒంటిమీద బట్టలు కూడా ఆగలేదు..కన్నూమిన్నూ కానరాలేదు. బదిలీలో ఒక్క తన్ను తంతే పక్క జిల్లా కాదు..3 జిల్లాల అవతల పడ్డాడు. బుల్లెట్ దిగిందా అనేవాడు..ఇప్పుడు బుల్లెట్ కరెక్ట్ గా దిగుతుంది. పల్నాడులో బుల్లుట్ దిగి తిరుగుతపాలాలలో మళ్లీ చెన్నైపోతాడు. నేడు రేపు, ఎల్లుండి అనేవి ఉంది జాగ్రత్తగా ఉండండి. ఆరుగురు ఎంపీలు పార్టీని వదిలిపెట్టారు. 10 మంది ఎమ్మెల్యేలు పారిపోయారు. ఎమ్మెల్సీలు కూడా రాజీనామాలు చేశారు. కందుకూరు సీటును 3 సార్లు మార్చారు. కనిగిరి చెత్త కందుకూరులో బంగారం అవుతుందా.? జీడినెల్లూరులో,  మంగళగరిలో 3 సార్లు మార్చారు. వైసీపీ కార్యకర్తలు రోజూ ప్లెక్సీలు వేస్తారు..సాయంత్రానికి మార్చుతారు. ఇది రాజకీయమా..? వీటిని ప్రజులు ఆమోదిస్తారా.? వైనాట్ కుప్పం అంటున్నాడు...మీకు మిగిలేది గుండుసున్నా...నేను అంటున్నా వైనాట్ పులివెందులు. జగన్ బ్లఫ్ మాస్టర్. జగన్ మీటింగ్ పెడితే స్కూళ్లకు సెలవులు ఇచ్చి..బస్సులన్నీ ఆయనకే ఇవ్వాలి. ఆర్టీసీ అధికారులు కూడా జాగ్రత్తగా ఉండాలి...40 రోజుల తర్వాత మీ కథ తేలుస్తా. చట్ట వ్యతరేకంకగా ప్రవర్తించొద్దు. డ్వాక్రా సంఘాలు, అంగన్వాడీ కార్యకర్తలను బలవంతంగా తరలిస్తున్నారు. ప్రజలు పారిపోకుండా పోలీసులతో సభల వద్ద కాపలా పెట్టించారు. హెలికాప్టర్ లో తిరిగుతూ కింద రోడ్లు బ్లాక్ చేస్తారు. చెట్లన్నీ నరికేస్తున్నాడు..ఇతన్ని ఏమనాలి.? 


*వివేకా హత్యపై సునీత అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు జగన్ సిద్ధమా?*


ఊరికో సైకోను తయారు చేసి గంజాయి ఇస్తున్నారు. సోమిరెడ్డిపైన గడ్డపారతో దాడికి ప్రయత్నించారు. గూండాలు, రాజకీయ రౌడీలను అణిచేసే శక్తి టీడీపీకి ఉంది. హు కిల్డ్ బాబాయ్...హు కిల్డ్ బాబాయ్.? నిన్న సునీతరెడ్డి అడిగింది. హంతకులు మనధమధ్యే ఉంటారు..ఏ హత్య కేసు అయినా 4, 5 రోజలులో తేలుతుంది..వివేకా కేసు ఐదేళ్లుగా ఎందుకు తేలడంలేదు అని అడుగుతోంది.? బాబాయ్ హత్యపై సమాధానం చెప్పేందుకు సిద్ధామా అని సవాల్ విసురుతున్నా. హత్యలు చేసే వ్యక్తి సీఎం అయితే ఎవరికీ రక్షణ ఉండదు. వివేకా హత్య దోషులను అరెస్టు చేసేందుకు ఎందుకు సిద్ధంగా లేవు. సునీతకు న్యాయం చేసేందుకు ఎందుకు సిద్ధంగా లేవు.? సునీతపైనా కేసులు పెట్టి వేధిస్తున్నారు. నారాసుర రక్త చరిత్ర అని సాక్షిలో రాశారు. గుండెపోటుతో చనిపోయారని విజయసాయిరెడ్డి చెప్పారు. గొడ్డలి పోటు అని తెలియగానే మళ్లీ మార్చారు. 


*తోడబుట్టిన దానిపై వ్యాఖ్యలు కన్న తల్లికి అవమానం కాదా జగన్*


మరో చెల్లి షర్మిల పరిస్థితి ఏంటో.? ఆస్తిలో వాటా ఇవ్వలేదు. వాళ్ల అన్నపై కోపంతో మనల్నీ విమర్శిస్తోంది...అయినా మేం బాధపడం. టిష్యూ పేపర్ మాదిరిగా షర్మిలను వాడుకున్నారు. సోషల్ మీడియాలో షర్మిల పుట్టుకపైనా పోస్టులు పెట్టించాడు. నీ చెల్లిని నీచంగా చిత్రీకరించావంటే నీ తల్లికి అవమానం కాదా.? రాష్ట్రంలో రవాణా రంగం దెబ్బతింది...ఓనర్లు..క్లీనర్ గా తయారయ్యారు. రంగనాయకమ్మ అనే వృద్ధురాలు ఎల్జీపాలిమర్స్ గురించి పోస్టు పెడితే హోటల్ మూయించారు. ఇతర వ్యాపారానికి అనుమతి రానివ్వకుండా చేశారు. గుంటూరు వదిలి హైదరాబాద్ వెళ్లి పూటగడుపుకుంటున్నారు. నీళ్లు అడిగిన మహిళలను పల్నాడులో ట్రాక్టర్ తో తొక్కించి చంపారు. డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగితే పిచ్చివాన్ని చేసి చంపేశారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యంను చంపి డోర్ డెలవరీ చేశారు. నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబాన్ని వేధించడంతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. టీడీపీ-జనసేన పొత్తుపెట్టుకున్నానాయి. రెండు పార్టీలు సయోధ్యకు వచ్చాయి...వైసీపీకి వచ్చిన బాధేంటి.? చాలా పార్టీలతో పొత్తులు పెట్టుకున్నాం...కానీ రాజకీయంగా ఎవరికీ ఇవ్వని గౌరవం పవన్ కళ్యాణ్, జనసేన కార్యకర్తలకు ఇస్తున్నా. రెండు పార్టీల మధ్య ఓట్లు బదిలీ జరగాలి. జనసేన పోటీ చేసేది 24 సీట్లలో కాదు...175 సీట్లలో...టీడీపీ పోటీ చేసేది 151 సీట్లలో కాదు..175 సీట్లలో. కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి చలికాచుకుంటున్నారు. ఒక్క ఛాన్స్ అన్నాడు...రాగానే పిడిగుద్దులు గుద్దాడు. ఏ వర్గమైనా రాష్ట్రంలో సంతోషంగా ఉందా.? మహిళలు, కూలీలు ఆనందంగా ఉన్నారా.? ఉద్యోగులు జీతాలు పెంచాలని అడగడం కూడా మానేశారు. 


*రాజకీయ చైతన్యం ఉన్న ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 సీట్లూ గెలవబోతున్నాం.*


నెల్లూరు జిల్లా అనగానే రాజకీయ చైతన్యం ఉంటుంది. రెడ్లు కూడా ఎక్కువగా ఉన్నారు...వైసీపీలో ఉన్న నలుగురు కూడా టీడీపీకి వచ్చారు. సిలికా శాండ్ మొత్తం దోచేశారు. వైసీపీలో నలుగురు రెడ్లే బాగుపడ్డారు. వైవీ సుబ్బారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విజయసాయిరెడ్డి మాత్రమే బాగుపడ్డారు. గౌరవంగా ఉండే వేమిరెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి మాత్రం వైసీపీలో బాగుపడలేదు. ఉమ్మడి జిల్లాలో వైసీపీకి ఒక్క సీటు కూడా రాకూడదు. 10కి 10 సీట్లు గెలవాలి. అభ్యర్థుల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటున్నా...ప్రజల్లో ఉండే వ్యక్తిని తీసుకున్నాం. మనం అభ్యర్థులను ప్రకటించాక తాడేపల్లి ప్యాలెస్ కంపిస్తోంది. పాలు, నీళ్ల మాదిరిగా టీడీపీ-జనసేన శ్రేణులు కలిసి పనిచేయాలి. డీఆర్ఐ ద్వారా అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారు. తప్పుడు పనులు చేసే అధికారులు జగన్ తో సహా జైలుకుపోతతారు. కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులను చిత్తుచిత్తుగా ఓడించాలి’’ అని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.

Comments