భారత ప్రభుత్వం
యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ
నెహ్రూ యువ కేంద్రం : విజయవాడ : ఎన్టీఆర్ జిల్లా. ఎపి
జిల్లా స్థాయి నైబర్ హూడ్ యూత్ పార్లమెంట్
విజయవాడ (ప్రజా అమరావతి);
"యువత దేశ నిర్మాణం కోసం తమను తాము అంకితం చేసుకోవాలి
" : శ్రీ సాయి వెంపటి , ఏ డి, రీజినల్ న్యూస్ యూనిట్ ఆకాశవాణి విజయవాడ
భారత ప్రభుత్వం, యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ, నెహ్రూ యువ కేంద్రం, విజయవాడ వారిచే నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు 13-03-24న ఉదయం 10.00 గంటల నుండి స్థానిక V. R. సిద్దార్థ ఇంజనీరింగ్ కాలేజీ ఆడిటోరియంలో జిల్లా స్థాయి నైబర్‌హుడ్ యూత్ పార్లమెంట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. యువత. యూత్ స్కిల్స్, బేటీ బచావో బేటీ పడావో, వంటి ఫ్లాగ్‌షిప్ కార్యక్రమాల కింద కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అందించే వివిధ పథకాల అమలు, దరఖాస్తులు మరియు ప్రయోజనాలు , ఆరోగ్యం, స్టార్టప్ ఇండియా, ముద్ర, పీఎంఈజీపీ, ఇన్‌క్రెడిబుల్ ఇండియా, డిజిటల్ ఇండియాలో విద్య, సైన్స్ అండ్ టెక్నాలజీ, రాజకీయాల్లో యువత పాత్ర, స్వచ్ఛ భారత్ ఆయుష్మాన్ భారత్‌పై జిల్లా స్థాయి నైబర్‌హుడ్ యూత్ పార్లమెంట్‌లో సుదీర్ఘంగా చర్చించారు.
శ్రీ సుంకర రాము జిల్లా యువజన అధికారి, నెహ్రూ యువకేంద్రం, విజయవాడ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీ సాయి వెంపటి , ఏ డి, రీజినల్ న్యూస్ యూనిట్ ఆకాశవాణి విజయవాడ మాట్లాడారు. యువత దేశ నిర్మాణం కోసం తమను తాము అంకితం చేసుకోవాలని, నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవడంతోపాటు రాజకీయాల్లో కూడా రాణించాలి. రాజకీయాల్లో ప్రజాస్వామ్య పరిరక్షణకు దేశ నిర్మాణానికి యువశక్తిని ఉపయోగిస్తే దేశం ప్రపంచంలోనే అగ్రగామిగా నిలవగలదన్నారు. యువత ప్రజా సమస్యలపై నిమగ్నమయ్యేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. మేర పెహలా ఓట్ దేశ్ కే లియే నినాదం తో ప్రతీ యువత ఓటర్ గా నమోదు అవ్వాలి అని కోరారు. జిల్లా యువజన అధికారి సుంకర రాము మాట్లాడుతూ యువత తమ అభిప్రాయాలను ధైర్యంగా, నిలకడగా తెలియజేయాలని, తద్వారా దేశ వ్యాప్తంగా తమ గళం వినిపించే రోజున చట్టసభల్లో తమ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని, అందుకోసం అందరి అభిప్రాయాలను నిష్పక్షపాతంగా వినిపించాలన్నారు. దేశవ్యాప్తంగా యువత కోసం నెహ్రూ యువకేంద్ర సంఘటన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పలు కార్యక్రమాల గురించి వివరించారు.ఇంజనీరింగ్ కళాశాల డీన్ శ్రీ పాండురంగ రావు మాట్లాడుతూ.. యువత మానసిక వికాసాన్ని పెంపొందించడంతోపాటు వారి జీవన నైపుణ్యాలను పెంపొందించేందుకు తీసుకుంటున్న పలు కార్యక్రమాలకు అనుగుణంగా ఇలాంటి కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. యువత ఇటువంటి కంటెంట్‌తో ఎంతో ప్రయోజనం పొందవచ్చు అని అన్నారు .శ్రీ S. శ్రీనివాస్ నైపుణ్యభివృద్ధి సంస్థ అధికారి, భవిరి శంకరనాధ్ సెక్రటరీ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ, శ్రీ రాఘవ శర్మ, ఏపీ స్టెప్ సొసైటీ Dr. K. నరేంద్ర NSS ప్రోగ్రాం ఆఫీసర్, Dr. నీలాంబరం , Dr. K రఘువీర్ Dr P రమేష్ కుమార్, Dr. M జయరాజాన్ రిసోర్స్ పర్సన్‌లుగా
ప్రసంగించారు. అనంతరం విద్యార్థులు అధికార, ప్రతిపక్షం సభ్యులు గా మాక్ పార్లమెంట్ నిర్వహించి తీర్మానం అందజేశారు. శ్రి కృష్ణదేవరాయ యూత్ ఆర్గనైజేషన్ భీమాల వినోద్ కుమార్ సంచాలకులు గా వ్యవహారించారు మరియు ఈ సందర్భంగా అతిథులను శాలువాలు మరియు జ్ఞాపికలతో సత్కరించారు.జిల్లా స్థాయి నైబర్‌హుడ్ యూత్ పార్లమెంట్‌కు హాజరైన వారందరికీ సర్టిఫికేట్‌లను అందజేశారు. జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో యువజన, యువజన సంఘాలు హాజరయ్యారు
addComments
Post a Comment