కాంగ్రెస్ గూటికి ఎమ్మెల్యే ఆర్కే.

 *కాంగ్రెస్ గూటికి ఎమ్మెల్యే ఆర్కే


*


*పార్టీ కండువా వేసి కాంగ్రెస్ లోకి ఆహ్వానించిన షర్మిల*


*మంగళగిరి లో వై సి పి గడ్డు కాలమేనా?*


మంగళగిరి (ప్రజా అమరావతి);

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే( కాంగ్రెస్ గూటికి చేరారు. ఆదివారం విజయవాడలో పిసిసి అధ్యక్షురాలు వై ఎస్ షర్మిల ఎమ్మెల్యే ఆర్కే కు కాంగ్రెస్ పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. డిశంబర్  11న ఎమ్మెల్యే పదవికి వై ఎస్ ఆర్ సిపి కి రాజీనామా చేశారు. కొద్దిరోజుల తర్వాత  ప్రెస్ మీట్ పెట్టి తాను షర్మిల తో నడుస్తానని అన్నారు. మంగళగిరి నియోజకవర్గానికి 1,200 కోట్లు కేటాయిస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కనీసం 125 కోట్లు కూడా కేటాయించలేదని విమర్శించారు. అదే తన రాజీనామా కు కారణమన్నారు.


*ఓటమి ఎరుగని నేతగా...*


 ఆళ్ల రామకృష్ణారెడ్డి 2014,2019 ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి 2 పర్యాయాలు ఎమ్మెల్యే గా  గెలుపొందారు. 2019లో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి ఐటీ శాఖ మాజీ మంత్రి నారా లోకేష్ పై పోటీ చేసి గెలుపొందారు ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై కేసులు వేసి ఇరకాటంలో పెట్టారు. భూసేకరణకు వ్యతిరేకంగా రైతుల తరఫున పోరాటం చేశారు. మంగళగిరి నియోజకవర్గాన్ని గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేసి తనకంటూ మార్కును సంపాదించుకున్నారు.. లోకేష్ వంటి నేతను ఓడించినప్పటికీ ఆర్కే కు మంత్రి పదవి ఇవ్వలేదు. దీంతో ఆయన నిరుత్సాహానికి గురయ్యారు. మరోవైపు నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించకపోవడం, రానున్న ఎన్నికల్లో ఆర్కే కు అసెంబ్లీ సీటు లేకపోవడంతో ఆర్కెను మరింత నిరుత్సాహానికి గురి చేసింది.ఈ  నేపథ్యంలో ఎమ్మెల్యే పదవికి, వైసీపీకి రాజీనామా చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన రానున్న ఎన్నికల్లో మంగళగిరి నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఆయన పోటీ చేస్తారని అందరు భావిస్తున్నారు. ఆర్కే మంగళగిరి నుంచి వెళ్లిపోవడం వైఎస్ఆర్సిపి కి రాజీనామా చేయడం ఆ పార్టీకి మంగళగిరి లో తీవ్ర నష్టాన్ని మిగుల్చుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Comments