విశాఖపట్నం జనవరి 29 (ప్రజా అమరావతి);
38వ యాన్యువల్ డీఏఈ స్పోర్ట్స్ & కల్చరల్ మీట్ 2023-24 - బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభం
విశాఖపట్నంలోని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్) 38వ యాన్యువల్ డీఏఈ స్పోర్ట్స్ & కల్చరల్ మీట్ 2023-24లో భాగంగా, అను విహార్‌లోని (బార్క్ టౌన్‌షిప్) జీసీఎస్ పాఠశాలలో బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ జరుగుతోంది. ఈ రోజు (జనవరి 29, 2024) ప్రారంభమైన పోటీలు ఫిబ్రవరి 02, 2024 వరకు జరుగుతాయి.
'డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ'కి (డీఏఈ) దేశవ్యాప్తంగా ఉన్న అన్ని విభాగాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 8 జట్లు (అజంత, ద్వారక, ఎల్లోరా, గోల్కొండ, పుష్కర్, రామేశ్వరం, కోణార్క్, నాగార్జున) బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో పాల్గొంటున్నాయి.
ఆంధ్ర రాష్ట్ర బాల్ బ్యాడ్మింటన్ సంఘం గౌరవ కార్యదర్శి శ్రీ ఆర్ వెంకటరావు బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథి హాజరయ్యారు. విశాఖపట్నం జిల్లా బాల్ బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడు శ్రీ డీఆర్‌జీఎస్‌ఎస్‌ఎన్‌ఆర్ ప్రభుజే; శాస్త్రవేత్త & విశాఖపట్నం బార్క్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ ఎం.శ్రీనివాసరావు; ఆర్గనైజింగ్ కమిటీ ఎస్/హెచ్ & ఛైర్మన్ డా.ఎం.వి. సూర్యనారాయణ గౌరవ అతిథులుగా పాల్గొన్నారు.
క్రీడాకారులందరికీ స్వాగతం పలికిన ముఖ్య అతిథి శ్రీ ఆర్ వెంకటరావు, క్రీడాస్ఫూర్తితో ఆడాలని ప్రోత్సహించారు. బాల్ బ్యాడ్మింటన్ ఆటతో తనకున్న అనుబంధాన్ని వారితో పంచుకున్నారు. గోల్కొండ, ద్వారక జట్ల మధ్య ప్రారంభ మ్యాచ్‌ను శ్రీ ఎం. శ్రీనివాసరావు ప్రారంభించారు. సాగర తీరం విశాఖలో క్రీడాకారులు ఆహ్లాదకరంగా గడపాలని డా. ఎం.వి. సూర్యనారాయణ సూచించారు.
addComments
Post a Comment