డోన్ లో 'ఐడీటీఆర్' ప్రాజెక్టును పరిశీలించిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్






*డోన్ లో 'ఐడీటీఆర్' ప్రాజెక్టును పరిశీలించిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్


*


డోన్, నంద్యాల జిల్లా, డిసెంబర్, 12 (ప్రజా అమరావతి); ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ డోన్ పట్టణంలోని ఐడీటీఆర్ ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించారు. రూ.19 కోట్లతో చేపడతున్న అంతర్జాతీయ డ్రైవింగ్ శిక్షణ, పరిశోధన సంస్థ అందుబాటులోకి వస్తే యువతకు కనీసం రూ.30వేలతో మంచి ఉద్యోగాలు కల్పించవచ్చన్నారు. జనవరి మొదటి వారంలోగా ఆఫీస్ భవనం పూర్తి చేయాలని కాంట్రాక్టర్ కు ఆర్థిక మంత్రి ఆదేశాలిచ్చారు. రాళ్లను పేల్చే దశలో ఉన్న కీలక పనులు కూడా సత్వరమే పూర్తి చేయాలన్నారు. ట్రాక్ సహా కీలక పనులను పూర్తి చేయడం కోసం మానవ వనరులను పెంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి పాల్గొన్నారు.



Comments