ఈనెల 27నుండి 29 వరకూ ఢిల్లీలో 3వ జాతీయ చీఫ్ సెక్రటరీల సమావేశం:కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ.

 ఈనెల 27నుండి 29 వరకూ ఢిల్లీలో 3వ జాతీయ చీఫ్ సెక్రటరీల సమావేశం:కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ.



విజయవాడ,14 డిశంబరు (ప్రజా అమరావతి): ఈనెల 27 నుండి 29 వరకూ మూడు రోజుల పాటు ఢిల్లీలో 3వ జాతీయ చీఫ్ సెక్రటరీల సమావేశం జరుగనుందని కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ (Rajiv Gauba) వెల్లడించారు. ఈ విషయమై గురువారం ఢిల్లీ నుండి ఆయన వివిధ రాష్ట్రాల సిఎస్ లు,కేంద్రపాలిత ప్రాంతాల అడ్మినిస్ట్రేటర్లతో వీడియో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ మాట్లాడుతూ వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి,ఆయా రాష్ట్రాలు చేపట్టిన వినూత్న పధకాలను,కార్యక్రమాలను ఈసమావేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడి నేరుగా సిఎస్ లతో మాట్లాడతారని అన్నారు. ఈమూడు రోజులు సిఎస్ లు సమావేశంలో వివిధ అజెండా అంశాల తోపాటు సైబర్ సెక్యురిటీ,యాస్పిరేషనల్ జిల్లాలు,వికసిత భారత్ వంటి సబ్ థీమాటిక్ అంశాల పైన చర్చించడం జరుగుతుందని పేర్కొన్నారు.కావున రానున్న చీఫ్ సెక్రటరీల సమావేశానికి సంబంధించి రాష్ట్రాల వారీ చర్చించాల్సిన అంశాలపై వెంటనే నివేదికలు పంపాలని కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ సిఎస్ లకు చెప్పారు.



విజయవాడ సిఎస్ క్యాంపు కార్యాలయం నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్. జవహర్ రెడ్డి వీడియో సమావేశంలో పాల్గొన్నారు.అదే విధంగా సెర్ప్ సిఇఓ ఇంతియాజ్,రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్,ఇంధన,ప్లానింగ్ తదితర విభాగాల అధికారులు పాల్గొన్నారు.



Comments