*బీసీలపై జగన్ రెడ్డి ఊచకోత – కానీ వారికి రక్షణగా తెలుగుదేశం
*
*- టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు*
అమరావతి (ప్రజా అమరావతి);
తెదెపా కేంద్ర కార్యాలయంలో *“బీసీల వెన్ను విరుస్తున్న జగన్”* పుస్తకాన్ని ఆవిష్కరించిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..
1982లో తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఒక స్వర్ణ యుగం ప్రారంభమైంది. బలహీన వర్గాల ప్రజలకు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అవకాశాలను తెలుగుదేశం పార్టీ కల్పించింది. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా నిరంతరం బలహీన వర్గాల వారకి అండగా ఉన్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ బలహీన వర్గాల పార్టీ. అందుకే వారంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుంచి నేటి జగన్ రెడ్డి వరకు కోపం. వైఎస్ కుటుంబం ఉక్కు పాదంతో బలహీన వర్గాల ప్రజలను అనిచివేస్తుంది.
బలహీన వర్గానికి చెందిన జింకా వెంకట నరసయ్యను చంపి అతనికి సంబంధించిన మైన్స్‌ను స్వాధీనం చేసుకొని ఆర్థికంగా బలపడి, వారి పునాదులపైన పుట్టిన కుటుంబమే వైఎస్ కుటుంబం. భూటకపు మాటలు చెప్పి అధికరంలోకి వచ్చిన వెంటనే బలహీన వర్గాలపై ఊచకోత ప్రారంభించాడు జగన్ రెడ్డి. 74 మంది బలహీన వర్గాల వారు హత్య కావించబడ్డారు. నాతో కావించి దాదాపు 800 మందిపైగా బలహీన వర్గాల వారిపై అక్రమ కేసులు బనాయించారు. 3000 మందిపై దాడి చేసి ఇబ్బందులు పెడుతున్నాడు. జగన్ రెడ్డి అరాచకాలు, అక్రమాలు, దోపిడీలను మేము ప్రశ్నింస్తుంటే మాపై అక్రమ కేసులు పెడుతున్నారు. తెలుగుదేశం పార్టీలో బలంగా ఉన్న బలహీన వర్గాల వారిపై ఇబ్బడిముబ్బడుగా తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతన్నాడని ప్రజలు గమనించాలి.
బలహీన వర్గాల వారిని ఆర్థికంగా మెరుగుపరచాలని నాడు అధునాత పనిముట్లు కొన్నాము. అందులో కొన్ని పంపిణీ చేసాము ఎన్నికల కోడ్ వల్ల కొన్ని చేయలేకపోయాము.. మిగిలిన పనిముట్లను బలహీన వర్గాలకు పంచటానికి మనసు రాని జగన్ రెడ్డి ఏం ముఖం పెట్టుకొని నా బీసీలు అంటున్నావు?
బీసీలకు రిజర్వేషన్ లేని ఆంధ్రరాష్ట్రంలో 24% రిజర్వేషన్‌ను ఎన్టీఆర్ గారు కల్పిస్తే దానికి ఇంకో 10% పెంచి 34% రిజర్వేషన్‌ను చంద్రబాబు కల్పించాడు. కాని జగన్ రెడ్డి బీసీలకు 10% రిజర్వేషన్‌ను తగ్గించటంతో 16వెల రాజకీయ పదవులను కోల్పోవలసి వచ్చింది. 36 రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్న రాష్ట్రంలో నియోజకవర్గానికి ఒకటి చొప్పున మొత్తం 175 రెసిడెన్షియల్ స్కూల్స్‌కు ఒకే జీవోతో మంజూరు చేసింది చంద్రబాబు ప్రభుత్వం. స్టడీ సర్కిల్స్ పెట్టాం, బలహీన వర్గాల విద్యార్దులను విదేశీ విద్యకు పంపించాం. బీసీ కార్పోరేషన్‌ను నేనే పెట్టాను అన్నట్లుగా జగన్ రెడ్డి మాట్లాడటం, జగన్ రెడ్డికి వైకాపా బీసీ నాయకులు భజనలు చేయటం చూస్తుంటే నాకు ఆవేదన కలుగుతుంది. బీసీలకు ఆర్థిక పరిపుష్టికై ఫెడరేషన్లు పెట్టి నిధులు డిపాజిట్ చేస్తే వాటిని కూడా జగన్ రెడ్డి దోపిడి చేశాడు. టోల్ ఫీలు కట్టకుండా ఉండటానికి కార్లకు పెద్ద బోర్డులు తగిలించుకొని కార్పొరేషన్ చైర్మన్‌లు తిరుగటం తప్పా ప్రజలకు న్యాయం చేసిందే లేదు. రూ.5 కోట్లు ఖర్చు పెట్టి అన్ని జిల్లాల హెడ్ క్వార్టర్ లో బీసీలకు భవనాలు మంజూరు చేసాను. వాటిలో ఒక్కటి కూడా కట్టలేదు.
టీడీపీ హయాంలో టీటీడీ ఈవో కాని చైర్మన్ కానీ బలహీన వర్గానికి చెందిన వారు ఉండేవారు. ప్రతీ రంగంలో బీసీలకు చంద్రబాబు గారు పెద్ద పీట వేశారు. కానీ అన్ని పదవులు నీ సొంత వర్గానికి చెందిన వారికి కట్టబెట్టావు. కోర్టు వద్దన్నా కూడా సలహాదారులుగా నీ సొంత వర్గాల వారినే పెట్టుకున్నావు. పేరుకే బీసీ మంత్రులు కానీ ఒక్క కానిస్టేబుల్‌ని కూడా ట్రాన్స్‌ఫర్ చెయించుకునే హక్కు లేదు. రాష్ట్రాన్ని ఐదు ముక్కలుగా చేసి నీ ఇంట్లో వారికి పంచావు. బలహీన వర్గాలకు రక్షణగా ఉండాలని తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్‌లో చట్టం తీసుకువచ్చాం. బీసీల ఓట్లును తొలగించటానికే వాలంటీర్ల ద్వారా జనగణన చేస్తున్నాడు. ఈ ప్రభుత్వం వెంటిలేటర్ మీద ఉంది. బీసీలకు ఎప్పుడూ మేము అండగా ఉంటాము.
addComments
Post a Comment