*మంగళగిరి మండలం పెదవడ్లపూడి గ్రామంలో నీరు అందక ఎండిన పంట పొలాలను పరిశీలించిన సిపిఐ బృందం*..
*కృష్ణ డెల్టా ఆయకట్టు ప్రాంతం నీటి కొరతతో ఇబ్బంది పడుతుందని,ఇది రాష్ట్ర ప్రభుత్వం తప్పిదమని విమర్శించిన ముప్పాళ్ళ నాగేశ్వరరావు*..
మంగళగిరి (ప్రజా అమరావతి);
*పెదవడ్లపూడి గ్రామంలో వరి పంట పొలాలు నీరు లేక బీడు భూములను గా మారిపోయిన పొలాల ఆదివారం సాయంత్రం పరిశీలించి రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్న సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు*. *అనంతరం ముప్పాళ్ళ*
*మాట్లాడుతూ*
*రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతారాహిత్యం మూలాన కృష్ణా డెల్టా కూడా ఎండిపోతుంది,అటు తూర్పు డెల్టా ఇటు పశ్చిమ డెల్టా కు కూడా ఇలాంటి పరిస్థితి రావడం నా జీవితకాలం లో గత నా 40 సంవత్సరా లలో చూడలేదు, సాగర్ కు పూర్తిస్థాయిలో శ్రీశైలం తొనికేసలాడుతూ నీటి నిల్వలు గత సంవత్సరం కాలంలో ఉన్నప్పుడు ఆ నీటిని నిల్వ ఎలా చేసుకోవాలి వర్షా బావ పరిస్థితి వస్తే పంటలను ఎలా కాపాడుకోవాలి సాగునీటిని ఎలా రిజర్వ్ చేసుకోవాలి అనేటువంటి జ్ఞానం ఈ ముఖ్యమంత్రి గాని ఇరిగేషన్ మంత్రికి గాని కనీసం లేకపోవడమే ఈనాడు పరిస్థితికి అది రాయలసీమైనా కోస్తా ఆంధ్ర అయినా లేదు ఉత్తరాంధ్ర అయినా ఈ నీటి ఎద్దడికి కారణమని స్పష్టం అవుతూ ఉంది 8200 క్యూసెక్కులు డిజైన్ డిశ్చార్జి బకింగ్ నామ్ కాలవకుంటే 4500 ,4600 ఇచ్చి నీళ్లు ఇవ్వండి అంటే ఏఈ ,డి ఈ లు ఉరేసుకునే పరిస్థితి వచ్చింది. రైతులకు సమాధానం చెప్పలేక ఇళ్లల్లో తలుపులేసుకుని పడుకునే పరిస్థితి వచ్చింది మేము ఏం చేయాలా ఏఈ ఇల్లు ముట్టడి చెయ్యాలా లేక డి ఈ ఇల్లు ముట్టడి చెయ్యాలా లేక అంబటి రాంబాబు ముఖ్యమంత్రి ప్యాలెస్ ముట్టడి చేయాలా జ్ఞానం ఉన్నటువంటి అన్నం తింటున్న ఎమ్మెల్యేలు మంత్రులు ఈ కాలం మీదకు వచ్చి ఈ పంట పొలాల పరిస్థితి చూసి రైతులకు ఓదార్పు ఇవ్వాలి కదా కనీసం లక్ష వందల కోట్లు మీరు రకరకాలుగా* *కొల్లగొడుతున్నారు పదులకోట్లు విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారు నేను చెప్తున్నాను మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డి మామూలు నాటకాలు కట్టిపెట్టి మీ సొంత డబ్బులు ఉన్నాయి కదా ఉదారంగా అందరికీ ఇస్తున్నారు కదా మొత్తం ఆయిల్ ఇంజిన్ లోకి కావాల్సిన ఆయిల్ ఇచ్చి ఇంజన్లు పెట్టిచ్చి పంటను కాపాడటానికి తక్షణ చర్యలు తీసుకోమని చెప్పి ముప్పాళ్ళ డిమాండ్ చేశారు*. *అలాగే ఈ రేవేంద్రపాడు దగ్గర ఉన్నటువంటి కూలిపోయే వంతెన అది ఎవరో ఒకరు లారీలో బస్సు కూలిపోయి మనుషులు చనిపోతే తప్ప ఆ వంతెన రిపేర్ చేయలేరా 10 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్నావు రేవేంద్రపాడు వంతెన స్థితి మీకు కనబడటం లేదా కమ్యూనిస్టు పార్టీ 12 సంవత్సరముల క్రితం సంతకాలు చేయించి మీ గవర్నమెంట్ కు ఇంజనీర్లకు కలెక్టర్లకు ఉత్తరములు ఇచ్చింది దీన్ని బాగు చేయండి* *కూలిపోయే వరకు ఉండొద్దు అని త్వరతగతిన ఆ వంతెన ముందు లాకులతో కూడిన వంతెన కట్టి ఆధునిక వంతెన ఆ లాకులు దించితే హై లెవెల్ ఛానల్ కు నీళ్లు వచ్చేటట్లు ఒక శాశ్వత పరిష్కారాన్ని చూపాలి, టిడిపి గవర్నమెంట్ లో లిఫ్ట్ పెడితే 10 కోట్ల స్కీం, 90 లక్షలు ఇంజనీర్లకు ఇవ్వాలి*. *గాడిదలు కాస్తున్నారా? నువ్వు పెద్ద ఫోజులు పెడుతున్నావ్ కదా ఎమ్మెల్యే అని 90 లక్షలు నీకు పలుకుబడి ఉంది కదా ముఖ్యమంత్రి దగ్గర ఎంత కావాలి ఇస్తే అంత తెస్తాను అని చెప్తున్నా కదా 90 లక్షలు ఇచ్చి ఆ లిఫ్ట్ ను పూర్తి చేపిస్తే 26 వేల ఎకరాల్లో ఉన్నటువంటి రైతులకు దౌర్భాగ్యం దుస్థితి ఇలాంటి పరిస్థితి పట్టేది కాదు కదా స్పందించు సమాధానం చెప్పు వెంటనే ఆ లిఫ్టును సరి చేసి ఆయిల్ మోటార్లతో ఈ భూములను తడిపి కాపాడమని చెప్పి ముప్పాళ్ళ డిమాండ్ చేశారు*
*సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ మాట్లాడుతూ ఈ పెదవడ్లపూడి హై లెవెల్ వ ఛానల్ ప్రాంతానికి వచ్చి రైతు సంఘం అందరం కలిసి ఈ రోజున రైతు గోడుని విని ప్రభుత్వం దృష్టికి తీసుకుని వచ్చి అసలకే నష్టపోతున్నటువంటి రైతు ప్రతి సంవత్సరం నష్టపోతున్నటువంటి రైతు ఆ నష్టాల నుంచి కొంతమేరన్న నష్టపోకుండా ఉండాలంటే తక్షణమే హై లెవెల్ ఛానల్ కి నీరు వదలాలి ఈ పెదవడ్లపూడి ప్రాంతానికి సంబంధించిన పొలాలలో కౌలు 12 బస్తాలు అట్లాగే కౌలుతో పాటు పెట్టుబడే ఇప్పటికీ పాతికవేలు 30 వేలుకు పైన అవుతావుంది చూస్తే భూములన్ని నెరలిచ్చి ఉన్నాయి ప్రభుత్వ అధికారులకు చెప్పినప్పటికీ ఏమాత్రం పట్టనట్టుగా దాటవేసే ధోరణి తోటి వ్యవహరిస్తున్నారు తప్ప ఇంకొక రకంగా లేదు అందుకని సిపిఐగా అడుగుతున్నాం రైతులకు తక్షణమే ఈ ప్రాంతానికి నీరు వదలక పోతే కోట్లాను కోట్ల రూపాయలు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మొత్తం రైతులు నష్టపోయి వాళ్లు ఆత్మహత్యలు చేసుకునే ప్రమాదం ఉందని ఈ ప్రభుత్వానికి తెలియచేస్తూ తక్షణమే నీటిని విడుదల చేయాలని జంగాల డిమాండ్ చేశారు. పంట పొలాలను పరిశీలించిన వారిలో కవులు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమలయ్య, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గుజ్జల ఈశ్వరయ్య, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య, రైతు సంఘం నియోజకవర్గ అధ్యక్షులు ముసునూరు సుహాస్, రైతు సంఘం నియోజకవర్గ కార్యదర్శి యార్లగడ్డ వెంకటేశ్వర్రావు జవ్వాది సాంబశివరావు, చిట్టి బొమ్మ శ్రీనివాసరావు, పొన్నెకంటి రాధాకృష్ణ, ప్రసాద్ ,శ్రీరాములు గోహార్ జానీ, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment