తిరుమల శ్రీ వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న ఆం.ప్ర రాష్ట్ర గవర్నర్.

 


*తిరుమల శ్రీ వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న ఆం.ప్ర రాష్ట్ర గవర్నర్


*


తిరుమల, అక్టోబర్ 22 (ప్రజా అమరావతి): ఆదివారం ఉదయం తిరుమల రచన అతిథి గృహం నుండి కుటుంబ సమేతంగా బయలుదేరి  శ్రీవారి ఆలయం  చేరుకున్న గౌ. ఆం.ప్ర గవర్నర్ ఎస్.  అబ్దుల్ నజీర్ గారికి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, టీటీడీ ఈవో ఎ.వి ధర్మారెడ్డి స్వాగతం పలకగా శ్రీవారి ఆలయం చేరుకున్న వీరికి వేదపండితులు ఇస్తేకఫాల్ స్వాగతం పలకగా ముందుగా ధ్వజస్తంభం వద్ద మొక్కులు  తీర్చుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయక మండపం వద్ద వేద పండితులు వేద మంత్రాలతో గవర్నర్ వారికి ఆశీర్వచనం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ గవర్నర్ గారికి వెంకటేశ్వర స్వామి వారి చిత్ర పటాన్ని అందచేశారు. అనంతరం గవర్నర్ గారు మధ్యాహ్నం 12.15 కి రేణిగుంట విమానాశ్రయం కు బయల్దేరి వెళ్లారు.


ఈ కార్యక్రమంలో వీరి వెంట టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, టీటీడీ సివిఎస్ఓ నరసింహ కిషోర్ తదితరులు ఉన్నారు.


Comments