*డిజిటల్ వాడకంపై ఉపాధ్యాయులకు, విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలి*
• పాఠశాల విద్యాశాఖ కమీషనర్ శ్రీ ఎస్.సురేష్ కుమార్ .
• స్వచ్చంద సంస్థల ప్రతినిధులతో సమావేశం
విజయవాడ (ప్రజా అమరావతి);
ఈ సాంకేతికయుగంలో డిజిటల్ వాడకానికి ఎంతో ప్రాధాన్యత ఉందని, వాటిని సరైన రీతిలో వాడితే ఎలాంటి హాని జరగదని, సైబర్ మోసాలకు గురికారని, స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్ వంటి డిజిటల్ పరికరాలు, సోషల్ మీడియా వాడకం గురించి, వాటి వల్ల కలిగే ప్రయోజనాలు, దుష్ప్రయోజనాల గురించి అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు, ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ కమీషనర్ శ్రీ ఎస్.సురేష్ కుమార్ అన్నారు.
గురువారం సమగ్ర శిక్షా రాష్ట్ర కార్యాలయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్), వాలంటరీ హెల్త్ అసోషియేషన్ ఆఫ్ ఇండియా (VHAI) స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఆ సంస్థలు రూపకల్పన చేసిన మాడ్యూళ్లు, పోస్టర్లు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా పాఠశాల విద్యాశాఖ కమీషనర్ శ్రీ ఎస్.సురేష్ కుమార్ మాట్లాడుతూ.. సోషల్ మీడియా అతిగా వాడటం వల్ల, ఫేక్ న్యూస్ ప్రభావం వల్ల సైబర్ నేరాలకు గురయ్యే అవకాశాలు ఉన్నాయని, అదే అలవాటుతో అతిగా డిజిటల్ వాడకం వల్ల విద్యార్థుల సమయం దుర్వినియోగం కావడమే కాకుండా, అది ఒక వ్యసనంలా మారే అవకాశం ఉందని, తద్వారా ఆరోగ్య సమస్యలు ఎదురవ్వడం వంటి విషయాలపై ప్రతినిధులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్య డైరెక్టర్ శ్రీమతి పి.పార్వతి, Dr Tran Minh Nhu Nguyen (ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత ప్రతినిధి), Sophia Lonappan (WHO, నేషనల్ ప్రొగ్రామ్ ఆఫీసర్), భావన బి.ముఖోపాధ్యాయ్ (చీఫ్ ఎగ్జిక్యూటీవ్, VHA), డా. నాన్సీ ప్రీత్ కౌర్ (నేషనల్ ప్రొగ్రామ్ ఆఫీసర్, VHAI), AP VHAI ప్రెసిండెంట్ జేవీ మోహన్ రావు, జనరల్ సెక్రటరీ షేక్ ఇస్మాయిల్, స్టేట్ కో ఆర్డినేటర్ ఆర్. మన్మోహన్ తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment