పెండింగ్ లో ఉన్న సర్వే అర్జీలు పరిష్కార దిశగా కార్యచరణ - ఎమ్మెల్యే ఆర్కే.

 *పెండింగ్ లో ఉన్న సర్వే అర్జీలు పరిష్కార దిశగా కార్యచరణ - ఎమ్మెల్యే ఆర్కే


*

మంగళగిరి (ప్రజా అమరావతి);

మంగళగిరి - తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని పెండింగ్ లో ఉన్న సర్వే అర్జీలు సకాలంలో పరిష్కార దిశగా కార్యచరణ రూపొందించినట్లు ఎమ్మెల్యే ఆర్కే  తెలిపారు.


మంగళగిరి నగరంలోని మున్సిపల్ కార్యాలయంలో  తహసిల్దార్లు, టౌన్ ప్లానింగ్, గ్రామ సర్వేయర్లు, మండల సర్వేలతో  జరిగిన సమీక్ష సమావేశంలో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు గారు, ఎమ్మెల్యే ఆర్కే  పాల్గొన్నారు.


ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ  మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సామాన్య, ప్రజలు రైతులు దరఖాస్తు చేసుకున్న సర్వే అర్జీలు పెండింగ్ లో ఉండడంతో ఇబ్బందులు పడుతున్నట్లు గుర్తించామన్నారు.


రాష్ట్ర వ్యాప్తంగా సర్వే జరుగుతున్న నేపథ్యంలో  అర్బన్ పరిధిలో సర్వేయర్ పోస్ట్ ఖాళీగా ఉండడంతో సుమారు 200 అర్జీలు పెండింగ్ లో ఉన్నాయని, దీనిపై కమిషనర్ ల్యాండ్ సర్వే సిద్ధార్థ జైన్ గారిని కలిసి  సర్వేయర్ను నియమించాలని కోవడం జరిగిందని, దీనిపై సానుకూలంగా స్పందించిన కమిషనర్ గారు వెంటనే బాపట్ల నుండి సర్వేర్ ను కేటాయించడం జరిగిందన్నారు.


పెండింగ్లో ఉన్న దరఖాస్తులను  సెప్టెంబర్ 5 నాటికి పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుని దానికి అనుగుణంగా  అధికారులు పనిచేస్తారని స్పష్టం చేశారు.


 పెండింగ్ అర్జీలు సకాలంలో పరిష్కరించి అర్జిదారులకు  సర్వే సర్టిఫికెట్లు అందించాలని  అధికారులకు సూచించారు.


అలాగే రైతుల నుండి అర్జీలు నిర్ణీత కాలవ్యవధి లో పరిశీలించి సర్వే సర్టిఫికెట్లు అందించేలా టౌన్ ప్లానింగ్, రెవెన్యూ అధికారులు  పనిచేయాలని సూచించారు.


మండల పరిధిలో పనిచేస్తున్న సర్వేర్లు అర్బన్ పరిధిలో కూడా ఇన్చార్జిలుగా పని పనిచేసేలా  గౌరవ కలెక్టర్ గారు ఉత్తర్వులు జారీ చేస్తారని ఇక మీదట ఎక్కడ  ఇబ్బందులు తలెత్తకుండా సకాలంలో అర్జీలు పరిష్కరించి సర్వే సర్టిఫికెట్లు అందజేస్తారని స్పష్టం చేశారు.

Comments