పోలవరం (ప్రజా అమరావతి);
*మూడు గంటలపాటు పోలవరం ప్రాజెక్ట్ వద్ద చంద్రబాబు నాయుడు పర్యటన*
*ప్రాజెక్ట్ వద్ద సీఎం జగన్ కు సెల్ఫీ ఛాలెంజ్ విసిరి, ఎంతపనులు చేశారో చెప్పాలని సవాల్*
*నేటి ప్రాజెక్ట్ దుస్థితి పై చంద్రబాబు నాయుడు అవేదన*
*అడుగడుగునా ప్రభుత్వ నిర్లక్ష్యం పై ఆగ్రహం*
*తప్పుడు నిర్ణయాలతో పోలవరాన్ని నాశనం చేసిన జగన్ ను చరిత్ర క్షమించదు*
*రాష్ట్ర జీవనాడికి జీవం లేకుండా చేశారు
*
*ప్రాజెక్ట్ ఎత్తు 41.15 మీటర్లు అనే చర్చ ఎందుకు వస్తుంది?*
*194 టీఎంసీలు ఉండాల్సిన ప్రాజెక్ట్ లో 60...70 టీంఎసీలు నిల్వచేస్తే ఎవరికి ఉపయోగం?*
*నిర్వాసితులకు జగన్ చేసిన హామీలు ఎప్పుడు నెరవేరుస్తారు?*
*జరిగిన నష్టాన్ని ప్రభుత్వం ఎంత దాస్తే, ప్రాజెక్టుకు అంతనష్టం*
మీడియా సమావేశం లో చంద్రబాబు నాయుడు:-
• పోలవరం రాష్ట్రానికి లైఫ్ లైన్.. ఇది దెబ్బతింటే వీళ్లకు బాధ్యత లేదా? బాధ్యతారాహిత్యంతో రాష్ట్రానికి జీవంలేకుండా చేశారు. జరిగింది దాచి పెట్టి అబద్ధాలు చెప్పకండి.. వాస్తవాలు చెప్పండి. మీరు ఎంత దాస్తే అంత నష్టం జరుగుతుంది తప్ప ఎవరికీ ఉపయోగంలేదు. సముద్రంలోకి పోయే వృథా నీటిని ఒడిసిపట్టి, రాష్ట్రమంతా పారించి పైర్లకు జీవం పోయాలని భావిస్తే, ప్రాజెక్టునే నిర్జీవంగా మార్చారు.
• వీళ్లు వచ్చాక 22లక్షల క్యూసెక్కుల వరద వస్తే, దాన్ని నియంత్రించలేక నీటిని నిర్మాణాలపైకి వదిలేశారు. సుడిగుండంలా ఏర్పడిన నీటి ప్రవాహా నికి డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నది. మొత్తం నీటి ప్రవాహమే మారిపోయిం ది.
• దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ కొత్తది నిర్మిస్తారా? రిపేర్లు చేస్తారా? రిపేర్ చేయాలంటే 85 మీటర్ల లోతుకి వెళ్లాలని బావర్ కంపెనీ చెబుతుంది. అక్కడి నుంచి మీరు సక్రమంగా చేస్తారో లేదో తెలియదు..మీరు చేసేదానికి మేం గ్యారంటీ ఇవ్వలేమంటున్నారు. అంటే రూ.400 కోట్లతో చేసిన నిర్మా ణానికి గ్యారంటీ లేకుండా చేశారు. కొత్తడయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి కేంద్రం ఒప్పుకోవాలి. అలానే కాంట్రాక్ట్ సంస్థ ముందుకురావాలి. అది అవు తుందని వీళ్లు చెప్పగలరా?
• ఇప్పుడు జరిగిన నష్టంతో 41.15 మీటర్ల ఎత్తులో కట్టినా, 45.74 మీటర్ల ఎత్తులో కట్టినా ఉపయోగంలేదు. ముఖ్యమంత్రి ఎక్కడో ఉండి కూనిరాగా లు తీయడం కాదు. తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్న ముఖ్యమంత్రి 60,. 70 టీఎంసీలు మాత్రమే నిల్వచేస్తానంటున్నాడు. ఎవరికి ఉపయో గం? 194 టీఎంసీల సామర్థ్యాన్ని అంతతగ్గిస్తే రాష్ట్రానికి ఏం ఉపయోగం?
జగన్ రెడ్డి తప్పిదాలు.. చేతగానితనం...పిచ్చిచేష్టలతో ప్రాజెక్ట్ నాశనమైంది
ఇది చాలా సున్నితమైన ప్రాజెక్ట్. మొత్తం పైన అంతా అడవులే. అడవుల్లో పడే వర్షపునీరు అంతా ఇక్కడికే చేరుతుంది. అలాం టి ప్రాజెక్టుని ఇలాచేస్తే ఉభయగోదావరి జిల్లాల పరిస్థితి ఏమిటి? ఇప్పుడు తాత్కాలికంగా తనపై పడిన ముద్ర నుంచి తప్పించుకోవచ్చు.
• నువ్వు చేసిన తప్పిదాలు, నీ చేతగానితనం, నీ పిచ్చిచేష్టలతో ప్రాజెక్ట్ నాశనమైంది. నిన్నటివరకు పోలవరం వరం అనుకుంటే ఇలాచేసి శాపంగా మార్చాడు. ప్రాజెక్ట్ చూడటానికి వస్తే అధికారులు చూపించడంలేదు. నాకు ప్రాజెక్ట్ నిర్మాణంపై పూర్తి అవగాహన ఉంది.
• నంగనాచిగా మాట్లాడి తప్పించుకునే ప్రయత్నం చేయవద్దండి. 41.15 మీటర్లకు ఎత్తు తగ్గించాలనే ఆలోచన ఈ ముఖ్యమంత్రికి ఎందుకు వచ్చింది? ప్రాజెక్ట్ నిర్మాణానికి కేంద్రమే డబ్బులివ్వాలి. నాలుగేళ్లు అయ్యింది.. నిర్వాసితులకు ఎన్నిఇళ్లు కట్టారు... ఎంత పరిహారం ఇచ్చారు? ఎంత భూమి సేకరించి, ఎంత మందికి ఆర్ అండ్ ఆర్ ఇచ్చారు. ఈరోజు నేను వస్తున్నానని తెలిసి హాడావిడిగా కొంతమందికి ఆర్ అండ్ ఆర్ ఇచ్చారు.
• నేను యుద్ధభేరి ఎందుకు ప్రకటించానో అర్థంచేసుకోండి. ఇదంతా చూశాక మీరే అర్థంచేసుకోవాలి.
ఎకరాకు రూ.19 లక్షలు ఇస్తానన్నాడు.. ఇప్పుడు దానిపై మాట్లాడడు.
• ల్యాండ్ అక్విజేషన్, ఆర్ అండ్ ఆర్, ఇళ్ల నిర్మాణానికే రఫ్ గా రూ.26వేల కోట్ల ఖర్చు అవుతుంది. మరి రూ.20 వేలకోట్లతో ఎలా పూర్తవుతుంది? ఎకరాకు 19లక్షల పరిహారం ఇస్తానన్నప్పుడు ఎంత అవుతుందో తెలియ దా? ఇతను చేసినదానికి బాధితులు ఏడుస్తున్నారు.
• వారంతా ముక్తకంఠంతో ఒకటే అంటున్నారు.. 41.15 మీటర్లకు ఇక్కడుం డే వారు ఎవరూ ఒప్పుకోవడంలేదు. అన్ని ఊళ్లకు వెళ్లి వాళ్లనే అడుగుదాం .. ముఖ్యమంత్రిని రమ్మనండి.
• ఈ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం.. అసమర్థ, దద్దమ్మ ప్రభుత్వం. రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికే వీళ్లకు నచ్చినట్టు చేశారు. విభజనచట్టంలో పెట్టిన ప్రాజెక్టుని పూర్తిచేయలేకపోయారు. ప్రాజెక్ట్ ప్రాంతంలో ఎవరూలేరు. పవర్ ప్రాజెక్ట్ వద్ద కొంతమంది ఉంటే, కింద కొందరున్నారు. ఎక్కడా ఎలాంటి పనులు జరగడంలేదు.
• మేం పనులు మొదలుపెట్టినప్పుడు కూడా చాలా చేశారు. నిర్వాసితుల్ని రెచ్చగొట్టారు. వాళ్ల మనుషులతో కోర్టుల్లో కేసులు వేయించారు. అయినా మొండిగా అన్నిఅడ్డంకులు అధిగమించి మొత్తం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని 72 శాతం పూర్తిచేశాం.
ప్రాజెక్ట్ పరిస్థితి చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయి.
• ఇప్పుడు ఇక్కడి పరిస్థితి చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయి. ప్రతి ఎకరాకు నీళ్లివ్వాలి.. రాష్ట్రం బాగుండాలనే తపనతో పనులు చేపట్టిన నేను, ఈ క్షణంలో నిస్సహాయుడిగా మిగిలిపోయాను. ఏంచెప్పినా ఒక నాయకుడి గా కచ్చితంగా చెప్పాలి. కమిట్ మెంట్ తో చెప్పాలి.
• నాకు మోరల్ రెస్పాన్స్ బులిటీ ఉంది కాబట్టే తెలంగాణలోని 7 ముంపు మండలాలను ఏపీలో కలపాలని పట్టుబట్టాను. భవిష్యత్ లో పోలవరం జిల్లా ఏర్పాటుచేసి, ముంపు బాధితుల్ని అన్నివిధాలా ఆదుకుంటాం.
• ఈ ప్రభుత్వం ఒక అనిశ్చిత పరిస్థితి సృష్టించింది. వదరనీటిని నియంత్రించ డానికి ఏంచేయాలో తెలియని స్థితిలో ఉన్నారు. వరదనీటికి దెబ్బతిన్నది డయాఫ్రమ్ వాల్ అయితే.. అప్పర్ కాపర్ డ్యామ్ దెబ్బతిన్నది అనడం బుద్ధి లేకుండా మాట్లాడటమే. చేతగాకపోతే దద్దమ్మలని ఒప్పుకోవాలి.
• 2019 మే లో అధికారంలోకి వచ్చారు.. 2020 సెప్టెంబర్లో వరద వచ్చింది. సంవత్సరం మూడునెలలు ఏంచేశారు.. పనులు చేయకుండా కథలు చెప్పారు. ఇప్పుడూ చెబుతున్నారు.
• వినేవాళ్లకు అయితే చెప్పొచ్చు. మూర్ఖులకు ఏం చెబుతాం. ఇప్పుడు మాట్లాడిన దానికి సమాధానం చెప్పకుండా రేపు ఊరికే రంకెలేస్తారు” అని ప్రభుత్వం పై మండిపడ్డారు
addComments
Post a Comment