అమరావతి (ప్రజా అమరావతి);
*రాజధాని విధ్వంసంతో ప్రజలఆశల్ని, రాష్ట్రప్రగతిని చిదిమేసిన వ్యక్తిగా జగన్ చరిత్రలో నిలిచిపోతాడు.*
• అమరావతి కేసులవిచారణను సుప్రీంకోర్టు డిసెంబర్ కు వాయిదావేయడంపై ముఖ్యమంత్రి వైఖరేంటి?
• రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని హైకోర్టుచెప్పినా వినకుండా మూర్ఖత్వంతో సుప్రీంకోర్టుకు వెళ్లి జగన్ ఏం సాధించాడు?
• బెయిల్ పై వచ్చిన వ్యక్తి ముఖ్యమంత్రిపీఠంపై ఉంటే ఏం జరుగుతుందో చెప్పడానికి రాజధాని విధ్వంసమే పెద్ద ఉదాహరణ.
• ముఖ్యమంత్రిగా సంపాదించిన లక్షలకోట్లు, తండ్రి అధికారంతో కొట్టేసిన వేలకోట్లను కాపాడుకోవడానికే జగన్ రాజధానిపై ప్రజల్లో విషబీజాలు నాటాడు.
ప్రజారాజధాని అమరావతిపై ముఖ్యమంత్రికి ఎందుకంత కక్షకార్పణ్యం, ఈర్ష్యాద్వేషాలో ఆయనే సమాధానంచెప్పాలని, బెయిల్ పై బయటతిరుగుతున్నవ్యక్తి, ప్రజల్ని పాలించే స్థానంలోకి వచ్చాక రాష్ట్రానికి రాజధానిలేకుండా పోయిందని, న్యాయస్థానాల తీర్పుల్ని ధిక్కరిస్తూ, జగన్మోహన్ రెడ్డి రాజధానిపై విషంకక్కడం బాధాకరమని టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆవేదన వ్యక్తంచేశారు.
మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లా డాతు.
“ రాజధాని అమరావతికి సంబంధించిన పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు డిసెంబర్ కు వాయిదా వేశాక ముఖ్యమంత్రి ఏమనుకుంటున్నాడో తెలియదుగానీ, యావత్ తెలుగుజాతి మాత్రం సిగ్గుపడుతోంది. రాష్ట్రానికి రాజధాని లేకపోవడం ఎంత అవమాన కరమో ముఖ్యమంత్రి ఆలోచించాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్రరాజధానిగా అమ రావతిని స్వాగతించిన జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి అయ్యాక మూడురాజధానుల పేరుతో అటుప్రజల్ని, ఇటు రాష్ట్రాన్ని దశాదిశా లేనిస్థితికి తీసుకెళ్లాడు.
*రాజధానికి భూములిచ్చిన రైతుల్ని రోడ్డునపడేసిన జగన్, ప్రశాంతంగా ఉండే ప్రాంతంలో చిచ్చుపెట్టడానికే పేదలకు ఇళ్లస్థలాలని కొత్తనాటకం మొదలెట్టాడు.*
రాజధాని నిర్మాణం కోసం 33వేలకు ఎకరాలకు పైగా భూములిచ్చిన రైతులపై కేసులు పెట్టి వేధించడం, ఎస్సీఎస్టీ రైతులపై అట్రాసిటీ కేసులుపెట్టడం జగన్మోహన్ రెడ్డికే చెల్లిం ది. 1302రోజులనుంచి రాజధానిరైతులు తమకు న్యాయంచేయాలని నిరసనదీక్షలు, ధర్నాలచేస్తున్నా ముఖ్యమంత్రి ఏనాడూ వారిముఖం చూసిందిలేదు. వారి దీక్షలు, పోరాటాల్ని అవహేళనచేస్తూ, డబ్బులిచ్చి తనపార్టీవారితో ఉత్తుత్తి ఉద్యమాలు చేయించాడు. ప్రభుత్వం రైతులతో చేసుకున్న ఒప్పందంప్రకారం వారికి ఇవ్వాల్సిన ప్లాట్లు, కౌలు ఇవ్వకుండా జగన్ వారిపై కక్షసాధింపులకు పాల్పడుతున్నాడు. రాజధానిని విచ్ఛి న్నం చేయడానికి, ఆప్రాంతంలోని ప్రజలమధ్య చిచ్చుపెట్టడానికే జగన్ రాజధానిలో పేదలకు ఇళ్లస్థలాల పంపిణీ అనే కొత్తనాటకం మొదలుపెట్టాడు. టీడీపీప్రభుత్వం రాజధానిలో పేదల నివాసానికి కేటాయించిన ప్రదేశంలోకాకుండా, ఎలక్ట్రానిక్ సిటీ నిర్మించాలనుకున్నచోట ఇళ్లస్థలాలు ఇవ్వాల నుకోవడం ముఖ్యమంత్రి మూర్ఖత్వంకాదా? ప్రశాంతంగా ఉండేరాజధానిలో చిచ్చుపెట్టడానికే జగన్ ఇళ్లస్థలాల పంపిణీ అంటున్నాడుతప్ప నిజంగా పేదలకు న్యాయంచేయడానికి కాదు.
*రాజధానిలోని నిర్మాణసామగ్రి, ఇసుక, మట్టి, ఇనుమును దోచేస్తుంటే, అమరావతిని నాశనంచేయాలన్న తనఆలోచనల్ని తనపార్టీవారు అమలుచేస్తున్నారని జగన్ ఆనందించాడు.*
రాజధాని నిర్మాణంలోభాగంగా టీడీపీప్రభుత్వం 80శాతం నిర్మాణాలు పూర్తిచేసింది. రోడ్లు, ఇతరమౌలికవసతుల కల్పనకు సంబంధించిన పనుల్ని వేగంగా జరిగేలాచేసిం ది. జగన్ ముఖ్యమంత్రి కాగానే చంద్రబాబునాయుడి హాయాంలో జరిగిన పనులన్నీ ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. ఆఖరికి వైసీపీవాళ్లు రాజధానిలోని రోడ్లను తవ్వి, మట్టి, గ్రావెల్, ఇసుక, ఇనుము వంటి వాటిని అమ్ముకుంటున్నా ముఖ్యమంత్రి ఏనా డూ స్పందించలేదు. ప్రజలఆస్తుల్ని ధ్వంసంచేస్తున్నా, ప్రభుత్వసంపదను తనపార్టీ వారు కొల్లగొడుతున్నా జగన్మోహన్ రెడ్డి స్పందించలేదు. అమరావతిని నాశనంచేయా లనుకున్న తనఆలోచనల్ని తనపార్టీవారు అమలుచేస్తున్నారన్న ఆనందంతోనే రాజధానిలో జరిగే విధ్వంసాలపై ముఖ్యమంత్రి స్పందించలేదు. భవిష్యత్ లో సుప్రీంకోర్టు తీర్పు రాజధాని రైతులకు అనుకూలంగా వస్తే, ఇళ్లస్థలాలుపొందిన పేదల పరిస్థితి ఏమిటని ముఖ్యమంత్రి ఎందుకు ఆలోచించడు? పరిణితితోకూడిన ఆలోచన లే చేయని ముఖ్యమంత్రి పాలన ఎలా ఉంటుందో ఇప్పటికే ప్రజలకు అర్థమైంది. రాష్ట్ర ప్రగతిపై, ప్రజలపై, రాజధానిపై ముఖ్యమంత్రికి ఎలాంటి ఆలోచనాలేదు. విధ్వంసంతో కూడిన విఘాతపు ఆలోచనలుతప్ప, జగన్ కు మరోఆలోచన లేదు.
టీడీపీ హాయాంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని, రూ.6లక్షలకోట్ల అవినీతి జరిగింద ని దుష్ప్రచారంచేసిన జగన్మోహన్ రెడ్డి తాను అధికారంలోకి వచ్చాక ఏం నిరూపించా డు? ముఖ్యమంత్రిస్థానంలో ఉండి తానుచేస్తున్న అవినీతిని, తండ్రిఅధికారంలో ఉన్న ప్పుడు కొట్టేసిన లక్షకోట్లను కాపాడుకోవడానికే ప్రజలమనసుల్లో విషబీజాలు నాటా డు. రాజధాని అమరావతికి సంబంధించి రాష్ట్రహైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చినా, కేవలం మొండితనం, మూర్ఖత్వంతోనే జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్లింది. అమరా వతిపై హైకోర్టుఇచ్చిన తీర్పుని శిరసావహించకుండా సుప్రీం తలుపుతట్టినప్పుడే జగన్ దోపిడీఆలోచనలు అర్థమయ్యాయి. అమరావతి ముసుగులో భూములిచ్చిన రైతులతో పాటు, రాష్ట్రప్రజల్ని జగన్ నిలువునామోసగించాడు. ప్రజలఆశలు, యువతభవిష్యత్ ను తన దుర్మార్గపు ఆలోచనలతో చిదిమేశాడు. బెయిల్ పై తిరుగుతూ, దుర్మార్గపు ఆలోచనలతో జగన్ సాగిస్తున్న అరాచకపాలనకు ప్రజలు స్వస్తిచెప్పే రోజు దగ్గర్లోనే ఉంది.” అని ఆలపాటి హెచ్చరించారు.
addComments
Post a Comment