తాడేపల్లి (ప్రజా అమరావతి);
*సాంకేతిక విద్యను అందించటమే మా లక్ష్యం
*
*ఈ ఏడాది నుంచి కే.ఈ.ఎస్ లో కో- ఎడ్యుకేషన్ క్లాసులు ప్రారంభం*
*కే.ఈ.ఎస్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ కె.పద్మజా వాణి*
ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రాంతాల నుంచి వచ్చే బాలికలకు సాంకేతిక విద్యను అందించడమే కేఈఎస్ పాలిటెక్నిక్ కళాశాల లక్ష్యమని ఆ కళాశాల ప్రిన్సిపాల్ కె.పద్మజాావాణి పేర్కొన్నారు.శుక్రవారం తాడేపల్లి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కె.పద్మజావాణి మాట్లాడుతూ
తమ కళాశాలలో చదివిన విద్యార్థులు దేశ విదేశాలలో మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారని చెప్పారు.క్రమశిక్షణ, మెరుగైన విద్యను అదించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని
తెలిపారు.కోస్తా జిల్లాలో మొట్టమొదటగా స్థాపించిన ఉమెన్స్ కళాశాల కే.ఈ.ఎస్ పాలిటెక్నిక్ కళాశాల అని, గతంలో విజయవాడ పీడబ్ల్యూడీ గ్రౌండ్ మైదానంలో ఉన్న కళాశాలనువడ్డేశ్వరంలోకి మార్చామని,అంతే కాకుండా ఇక్కడ ఉన్న విద్యార్థులు దూర ప్రాంతాలకు వెళ్లి పాలిటెక్నిక్ చదవాల్సి వస్తోందని, దీనిని దృష్టిలో ఉంచుకుని ఎంటిఎంసి పరిధిలోని తాడేపల్లి వడ్డేశ్వరంలో విద్యార్థులకు ఈ కళాశాలఎంతగానోఉపయోగపడుుతందని అన్నారు.అంతే కాకుండా ఇప్పటి వరకూ బాలికలకు మాత్రమే నిర్వహించిన ఈ కళాశాలను ఇప్పుడు కో- ఎడ్యుకేషన్ నిర్వహించేందుకు స్టేట్ టెక్నికల్ బోర్డు నుంచి అనుమతులు వచ్చాయని తెలిపారు. ఈ ఏడాది నుంచి కో ఎడ్యుకేషన్ తరగతులుప్రారంభిస్తున్నామని ప్రిన్సిపాల్ పద్మజా వాణి తెలిపారు. వైస్ ప్రి న్సిపాల్ ఎం. శ్రీనివాసరావు మాట్లాడుతూ 40 ఏళ్ల క్రితం బాలికలకు ఒక ప్రత్యేకమైన కళాశాల ఉండాలనే ఉద్దేశంతో ఒకసంస్థను స్థాపించి కే.ఈ.ఎస్ పాలిటెక్నిక్ కళాశాలను స్థాపించారని అన్నారు. చుట్టుపక్కల పాలిటెక్నిక్ కళాశాలలు లేవని చాలామంది కో-ఎడ్యుకేషన్ పెడితే బాగుంటుందని తమ దృష్టికి తెచ్చారనిఅన్నారు.చుట్టుపక్కల గ్రామాల్లోని విద్యార్థులకు ఈ పాల్ టెక్నికల్ విద్య ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఆ ఫీస్ సూపర్నెంట్ కె. రాజ్యలక్ష్మి మాట్లాడుతూ సీఎస్ఈ, ఈసీఈ కోర్సులు తమ కళాశాలలో ఉన్నాయని తెలిపారు. పాలిటెక్నిక్ చదివిన వాళ్లు బీటెక్ లో సెకండర్ ఇయర్ లో చేరవచ్చన్నారు. మా వద్ద చదువుకున్న విద్యార్థులు సింగపూర్, లండన్,అమెరికాలో ఉద్యోగాల్లో స్థిరపడ్డారని అన్నారు. పాలిటెక్నిక్ లో ఎవరైనా చేరాలనుకునేవారు తమ కళాశాల నుంచే వెబ్ కౌన్సెలింగ్ పెడతామని అన్నారు.ఈ కార్యక్రమంలో కళాశాల అకౌంటెంట్ పి. చంద్రశేఖరరావు, తదితరులు పా ల్గొన్నారు.
addComments
Post a Comment