యోగాలో ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించిన దివ్యాంగ విద్యార్థులు.

 



*యోగాలో ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించిన దివ్యాంగ విద్యార్థులు


*

సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో ప్రపంచ యోగా దినోత్సవం

అభినందించిన విద్యాశాఖా ఉన్నతాధికారులు


విశాఖపట్నం (ప్రజా అమరావతి): సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ సహకారంతో బుధవారం విశాఖపట్నంలోని ఆంధ్రావిశ్వవిద్యాలయంలో 500 మంది దివ్యాంగ విద్యార్థినీ విద్యార్థులతో ఘనంగా ప్రపంచ యోగా దినోత్సవం జరిగింది.  ఈ మెగా కార్యక్రమం ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదైంది.  ఈ కార్యక్రమానికి విశాఖపట్నం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. మల్లికార్జున ,  ఆంధ్రా యూనివర్సిటీ  వీసీ శ్రీ ఎన్ వి. జి. డి ప్రసాద్ ,  సమగ్ర శిక్ష రాష్ట్ర అదనపు పథక సంచాలకులు డాక్టర్ కె.వి శ్రీనివాసులు రెడ్డి ,  రాష్ట్ర సహిత విద్య కో ఆర్డినేటర్ శ్రీమతి ఎన్.కె. అన్నపూర్ణ , విశాఖపట్నం జిల్లా విద్యాశాఖాధికారిణి చంద్రకళ , అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల నుంచి దివ్యాంగ విద్యార్థులు,  ప్రత్యేక ఉపాధ్యాయులు పాల్గొన్నారు.  ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్  రాష్ట్ర కో ఆర్డినేటర్ శ్రీ కోరుకొండ వెంకటేశ్వరరావు  చేతులు మీదుగా అవార్డు ఏఎస్పీడీ డా. కె.వి.శ్రీనివాసులు రెడ్డి  అందుకున్నారు.

ఈ సందర్భంగా విశాఖపట్నం జిల్లా కలెక్టర్ శ్రీ మల్లికార్జున  మాట్లాడుతూ సమగ్ర శిక్షా  దివ్యాంగులతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు.   ఆంధ్ర యూనివర్సిటీ వీసీ  ప్రసంగిస్తూ మానవ జీవితంలో యోగా చాలా ప్రాముఖ్యత సంతరించుకుందని, దివ్యాంగులకు యోగా ద్వారా వారి జీవనశైలిలో మంచి మార్పులు తీసుకురావచ్చని వ్యక్తపరిచారు. 

అనంతరం  రాష్ట్ర సమగ్ర శిక్ష అదనపు రాష్ట్ర పథక సంచాలకులు డాక్టర్ శ్రీనివాసులు రెడ్డి  మాట్లాడుతూ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో దివ్యాంగుల అభివృద్ధికి వివిధ కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు.  అందులో భాగంగానే దివ్యాంగులకు ఉచితంగా ఉపకరణాలు, అలవెన్సులు, బోధనోపకరణ సామాగ్రి వంటివి అందిస్తున్నామన్నారు.  

*అభినందించిన విద్యాశాఖా ఉన్నతాధికారులు*

సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో జరిగిన  ఇలాంటి బృహత్తర కార్యక్రమానికి ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కడం ఆనందదాయకమని  పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ ప్రవీణ్ ప్రకాష్ , పాఠశాల విద్యాశాఖ కమీషనర్ శ్రీ ఎస్.సురేష్ కుమార్  సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు శ్రీ బి.శ్రీనివాసరావు  అభినందించారు. 



Comments