ప్రభుత్వ ప్రాధాన్యత భవనాల నిర్మాణం పనులు వేగవంతం చేయాలి
పంచాయతీరాజ్ శాఖ ఇంజనీర్లు నిరంతరం క్షేత్ర స్థాయిలో పర్యటించాలి
సెప్టెంబర్ 15వ తేదీ నాటికి వివిధ ప్రభుత్వ భవన నిర్మాణం పనులు పూర్తి చేయాలి
జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు
పుట్టపర్తి, జూన్21 (ప్రజా అమరావతి): ప్రభుత్వ ప్రాధాన్యత భవనాల నిర్మాణం పనులు సెప్టెంబర్ 15 నాటికి పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు పంచాయతీ శాఖ ఇంజనీర్లను ఆదేశించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలు నందు పంచాయతీరాజ్ శాఖ ఇంజనీర్లతో జిల్లాలోవివిధ ప్రభుత్వ ప్రాధాన్యత భవన నిర్మాణం పనులు పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో డిఆర్ఓ కొండయ్య, పంచాయతీరాజ్ శాఖ సూపర్డెంట్ ఇంజనీర్ గోపాల్ రెడ్డి, ఈ ఈ మురళీమోహన్ సంబంధిత ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పంచాయతీరాజ్ శాఖ ఇంజనీర్లు జవాబు దారితనంతో పని చేయాలని ఆదేశించారు. ప్రాధాన్యత భవనాలైన రైతు భరోసా కేంద్రాలు, వెల్నెస్ సెంటర్లో, గ్రామ సచివాలయం భవన నిర్మాణం పనులు శర వేగంగా నిర్మాణం పనులు పూర్తిచేయాలని అధికారుల ను ఆదేశించారు. అసిస్టెంట్ ఇంజనీర్ ప్రతిరోజు మండలాలలో తిరగాలని తెలిపారు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు క్షేత్రస్థాయిలో భవన నిర్మాణం పనులు ఎలా పూర్తి చేయుచున్నారు పరిశీలించాలని తెలిపారు, ప్రభుత్వ ప్రాధాన్యత భవన నిర్మాణం పనులు పనిచేసే పంచాయతీరాజ్ శాఖ ఇంజనీర్లు సమన్వయంతో పనిచేసి మంచి ఫలితాలు సాధించాలని తెలిపారు. వారానికి ఒకసారి సూపర్డెంట్ ఇంజనీర్ క్షేత్రస్థాయిలో నిర్మాణం పనులు ఎలా జరుగుతున్నాయో పరిశీలించాలని తెలిపారు, ఉదయము సాయంత్రం సమయాలలో రోజుకు ఒక గంట సంబంధిత ఇంజనీర్లు DEE లు/ AEE లు ప్రభుత్వ ప్రాధాన్యత భవన నిర్మాణం పనులు పై చర్చించుకోవాలని తెలిపారు. నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించాలని తెలిపారు. నిర్మాణం పనులకు సంబంధించిన బిల్లులన్నీ అప్లోడ్ చేయాలని ఇంజనీర్లను ఆదేశించారు. ప్రతి బిల్డింగ్ ఎలా నిర్మాణం పనులు చేపట్టాలో అందుకు అవసరమైన మౌలిక వసతులు కల్పనపై ప్రణాళికలు తయారు చేసుకోవాలని తెలిపారు. మండలాలలోనూ డివిజన్ స్థాయిలలోనూ సంబంధిత ఇంజనీర్లు సమీక్ష సమావేశాలు నిర్వహించుకోవాలని ఆదేశించారు. ప్రతి 15 రోజులకు ఒకసారి ప్రభుత్వ ప్రాధాన్యత భవన నిర్మాణం పనులపై సంబంధిత ఇంజనీర్లను ఆరా తీయడం జరుగుతుంది. ప్రభుత్వ ప్రాధాన్యత భవన నిర్మాణం పనుల్లో వెనకబడిన ఇంజనీర్లపై కఠినమైన చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. రైతు భరోసా కేంద్రాలు 245 నిర్మాణాలు ,వెల్నెస్ సెంటర్లు 269, గ్రామ సచివాలయం భవనాలునిర్మాణం పనులు 305 పూర్తి కావలసి ఉన్నది. ప్రాధాన్యత భవనాల నిర్మాణాలు వేగవంతం చేసిసెప్టెంబర్ 15 తేదీల్లోపు పూర్తి చేసి అందుబాటులో తీసుకురావాలని ఇంజనీర్లనుఆదేశించారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం, కదిరి, పెనుగొండ, మడకశిర, పుట్టపర్తి, హిందూపురం, రాప్తాడు డివిజన్ కు సంబంధించిన డి ఈ ఈ లు, లో కన్నా, మధుసూదన్, వెంకటరమణ ,పద్మావతి, శ్రీనివాసులు, హరికృష్ణ, ఏ ఏ ఈలు, శశి కుమార్, నాగరాజు, గుప్త, తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment