రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి):
*జిల్లాలో 990 పాఠశాలల్లో 1,21,730 మందికి జేవికే కిట్ల పంపిణీ*
జూన్ 12 సోమవారం స్కూల్స్ ప్రారంభించే రోజున పంపిణీ చర్యలు
*జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత*
జూన్ 12, 2023న పాఠశాలలు పునఃప్రారంభం కానున్న దృష్ట్యా "
జగనన్న విద్యా కానుక" కిట్లు ఆయా పాఠశాలలు చేరేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. మాధవీలత, జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ శనివారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.
జిల్లా వ్యాప్తంగా ఉన్న 990 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 1,21,730 మంది విద్యార్థిని , విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్స్ పంపిణీ చర్యలు తీసుకోవడం జరిగిందనీ జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 712 ప్రాథమిక పాఠశాలల్లో, 82 ఉప్పర్ ప్రైమరీ పాఠశాలల్లో , 201 ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న 59370 బాలురకు, 62360 బాలికలకు జె.వి.కే కిట్స్ పంపిణీ కి సిద్దంగా ఉన్నామని కలెక్టర్ మాధవీలత తెలిపారు. కిట్ లో ఒక జత యూనిఫారం, బూట్లు, సాక్స్ లతో పాటు నోట్‌బుక్‌లు, వర్క్‌బుక్‌లు, ఒక నిఘంటువు, ఒక బెల్ట్ మరియు ఒక బ్యాగ్ అందించడం జరుగుతుందన్నారు. జిల్లాలో విద్యార్థులకు అందచేస్తున్న జే వి కె. కిట్ల కోసం సుమారు రూ.30 కోట్లకు పైగా నిధులు ప్రభుత్వం చెల్లించి కిట్లు పంపిణీ చేయడం జరుగుతోందని అన్నారు.
జూన్ 12 సోమవారం పాఠశాలలు ప్రారంభం అవుతున్న దృష్ట్యా అన్ని మండల ప్రత్యేక అధికారులు, మండల అభివృద్ధి అధికారులు, తహశీల్దార్లు మండలాల్లోని పాఠశాలలను సందర్శించి, ధృవీకరించాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇవ్వడం జరిగిందని ఆమేరకు తనిఖీకి చేపట్టినట్లు జెసి ఎన్ .తేజ్ భరత్ పేర్కొన్నారు. ఆయా పాఠశాలలు సందర్శన లో జేవికే స్టాక్ లభ్యత మరియు పాఠశాలల ప్రారంభానికి తరగతి గదుల సంసిద్ధత, ఇతర మౌలిక సదుపాయాలు పై నివేదిక అందచెయ్యడం జరిగిందన్నారు.
జిల్లా విద్యా అధికారి ఎస్. అబ్రహం మాట్లాడుతూ నాణ్యమైన విద్యను అందించే సామర్థ్యం కలిగి ఉండడమే కాకుండా, స్కూల్స్ తెరిచే రోజున జగనన్న విద్యా కానుక కిట్స్ పంపిణీ చేయడం కోసం మండల స్థాయి స్టాక్ పాయింట్ నుంచి ఆయా స్కూల్స్ కు తరలించే ఏర్పాట్లు ను ఆయా మండల విద్యా అధికారులు చూడడం జరిగిందన్నారు. ఒకొక్క జేవికే కిట్ రూ.2500 లను వెచ్చించి అత్యంత నాణ్యత పరిణామాలతో కూడి పంపిణీకి చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఆయా స్కూల్స్ ప్రధానోపాధ్యాయులు తొలి రోజే పంపిణీకి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించడం జరిగిందన్నారు.
జిల్లాలో మండలాల వారీగా ప్రాథమిక, ప్రాధమికొన్నత, ఉన్నత పాఠశాలల్లో విద్యనభ్యశిస్తున్న విద్యార్థిని, విద్యార్థుల వివరాలు...
మండలాలు వారీగా అందచెయ్యనున్న జే.వి.కే. కీట్స్ అందుకోనున్న విద్యార్థుల వివరాలు:
అనపర్తి మండలంలో ప్రాథమిక పాఠశాలలు..34, ప్రాధమికొన్నత పాఠశాలలు లేవు, ఉన్నత పాఠశాలలు.10 మొత్తం 44 ఇందులో బాలురు 2626 మంది, బాలికలు 2169 మంది మొత్తం..4795 మంది వున్నారు.
బిక్కవోలు మండలంలో ప్రాథమిక పాఠశాలలు..30, ప్రాధమికొన్నత పాఠశాలలు 1, ఉన్నత పాఠశాలలు.. 8, మొత్తం 39, ఇందులో బాలురు 2081 మంది, బాలికలు 2185 మంది మొత్తం .4266 మంది వున్నారు.
చాగల్లు మండలంలో ప్రాథమిక పాఠశాలలు..30, ప్రాధమికొన్నత పాఠశాలలు 2, ఉన్నత పాఠశాలలు.. 7, మొత్తం 39, ఇందులో బాలురు 2140 మంది, బాలికలు 2186 మంది మొత్తం 4326 మంది వున్నారు.
దేవరపల్లి మండలంలో ప్రాథమిక పాఠశాలలు..34, ప్రాధమికొన్నత పాఠశాలలు 2, ఉన్నత పాఠశాలలు.. 9, మొత్తం 45, ఇందులో బాలురు 2819 మంది, బాలికలు 3152 మంది మొత్తం..5971 మంది వున్నారు.
గోకవరం మండలంలో ప్రాథమిక పాఠశాలలు..34, ప్రాధమికొన్నత పాఠశాలలు 11, ఉన్నత పాఠశాలలు.. 8, మొత్తం 53, ఇందులో బాలురు 3584 మంది, బాలికలు 3504 మంది మొత్తం..7088 మంది వున్నారు.
గోపాలపురం మండలంలో ప్రాథమిక పాఠశాలలు..37, ప్రాధమికొన్నత పాఠశాలలు 5, ఉన్నత పాఠశాలలు..11 , మొత్తం 53, ఇందులో బాలురు 2864 మంది, బాలికలు 3178 మంది మొత్తం..6042 మంది వున్నారు.
కడియం మండలంలో ప్రాథమిక పాఠశాలలు..40, ప్రాధమికొన్నత పాఠశాలలు..2, ఉన్నత పాఠశాలలు..9, మొత్తం 51, ఇందులో బాలురు 2847 మంది, బాలికలు 2864 మంది మొత్తం..5711 మంది వున్నారు.
కోరుకొండ మండలంలో ప్రాథమిక పాఠశాలలు..35, ప్రాధమికొన్నత పాఠశాలలు 6, ఉన్నత పాఠశాలలు.. 14 , మొత్తం 55, ఇందులో బాలురు 3558 మంది, బాలికలు 3742 మంది మొత్తం..7300 మంది వున్నారు.
కొవ్వూరు మండలంలో ప్రాథమిక పాఠశాలలు..36, ప్రాధమికొన్నత పాఠశాలలు 6, ఉన్నత పాఠశాలలు..14, మొత్తం 56, ఇందులో బాలురు 3320 మంది, బాలికలు 3593 మంది మొత్తం..6913 మంది వున్నారు.
నల్లజర్ల మండలంలో ప్రాథమిక పాఠశాలలు..41, ప్రాధమికొన్నత పాఠశాలలు 4, ఉన్నత పాఠశాలలు.. 9, మొత్తం 54, ఇందులో బాలురు 2964 మంది, బాలికలు 3020 మంది మొత్తం..5984 మంది వున్నారు.
నిడదవోలు మండలంలో ప్రాథమిక పాఠశాలలు..51, ప్రాధమికొన్నత పాఠశాలలు 8, ఉన్నత పాఠశాలలు.. 11 , మొత్తం 70, ఇందులో బాలురు 3074 మంది, బాలికలు 3635 మంది మొత్తం..6709 మంది వున్నారు.
పెరవలి మండలంలో ప్రాథమిక పాఠశాలలు..39, ప్రాధమికొన్నత పాఠశాలలు 2, ఉన్నత పాఠశాలలు.. 7, మొత్తం 48, ఇందులో బాలురు 2013 మంది, బాలికలు 1934 మంది మొత్తం..3947 మంది వున్నారు.
రాజమహేంద్రవరం- రూరల్ మండలంలో ప్రాథమిక పాఠశాలలు..39, ప్రాధమికొన్నత పాఠశాలలు 5, ఉన్నత పాఠశాలలు..15, మొత్తం 59, ఇందులో బాలురు 4715 మంది, బాలికలు 5945 మంది మొత్తం..10660 మంది వున్నారు.
రాజమహేంద్రవరం- (అర్బన్) మండలంలో ప్రాథమిక పాఠశాలలు..60, ప్రాధమికొన్నత పాఠశాలలు 7, ఉన్నత పాఠశాలలు.. 24 , మొత్తం 86, ఇందులో బాలురు 8556 మంది, బాలికలు 8676 మంది మొత్తం..17232 మంది వున్నారు.
రాజానగరం మండలంలో ప్రాథమిక పాఠశాలలు..39, ప్రాధమికొన్నత పాఠశాలలు 8, ఉన్నత పాఠశాలలు.. 14 , మొత్తం 61, ఇందులో బాలురు 3561 మంది, బాలికలు 3721 మంది మొత్తం..7282 మంది వున్నారు.
రంగంపేట మండలంలో ప్రాథమిక పాఠశాలలు..34, ప్రాధమికొన్నత పాఠశాలలు 4, ఉన్నత పాఠశాలలు.. 10 , మొత్తం 48, ఇందులో బాలురు 2235 మంది, బాలికలు 2418 మంది మొత్తం..4653 మంది వున్నారు.
సీతానగరం మండలంలో ప్రాథమిక పాఠశాలలు..43, ప్రాధమికొన్నత పాఠశాలలు 7, ఉన్నత పాఠశాలలు.. 7 , మొత్తం 57, ఇందులో బాలురు 2438 మంది, బాలికలు 2566 మంది మొత్తం..5004 మంది వున్నారు.
తాళ్లపూడి మండలంలో ప్రాథమిక పాఠశాలలు..24, ప్రాధమికొన్నత పాఠశాలలు 2, ఉన్నత పాఠశాలలు.. 6 , మొత్తం 32, ఇందులో బాలురు 1925 మంది, బాలికలు 1829 మంది మొత్తం..3754 మంది వున్నారు.
ఉండ్రాజవరం మండలంలో ప్రాథమిక పాఠశాలలు..22, ప్రాధమికొన్నత పాఠశాలలు లేవు, ఉన్నత పాఠశాలలు..8, మొత్తం 40, ఇందులో బాలురు 2050 మంది, బాలికలు 2043 మంది మొత్తం..4093 మంది వున్నారు.
జిల్లా లో మొత్తం ప్రాథమిక పాఠశాలలు..712, ప్రాధమికొన్నత పాఠశాలలు 82, ఉన్నత పాఠశాలలు.. 201, మొత్తం 990, ఇందులో మొత్తం బాలురు 59370 మంది, మొత్తం బాలికలు 62360 మంది మొత్తం..121730 మంది వున్నారు.
addComments
Post a Comment