నాడు - నేడు కింద అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలి.

 *నాడు - నేడు కింద అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలి*



*: జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు*


తాడిమర్రి (శ్రీ సత్యసాయి జిల్లా), మే 19 (ప్రజా అమరావతి):


తాడిమర్రి మండలంలోని చిన్నదరి జిల్లా పరిషత్ హై స్కూల్ లో నాడు - నేడు కింద అభివృద్ధి పనులను జూలై 5వ తేదీ లోపు వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు ఆదేశించారు. శుక్రవారం తాడిమర్రి మండల కేంద్రంలోని విద్యాశాఖ కార్యాలయాన్ని, మండలంలోని చిన్నదరి గ్రామం జిల్లా పరిషత్ హై స్కూల్ లో నాడు - నేడు కింద చేపట్టిన అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.


ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చిన్నదరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నాడు - నేడు కింద అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. పాఠశాలలో మరుగుదొడ్ల పనులు పూర్తికాగా, మిగిలిన అన్ని రకాల అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ తాడిమర్రి మండల కేంద్రంలోని విద్యాశాఖ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా 2023 -24 సంవత్సరానికి సంబంధించి వచ్చిన టెస్ట్ బుక్ లను పరిశీలించి, ఎంత స్టాక్ వచ్చింది అనే వివరాలను జిల్లా కలెక్టర్ ఆరా తీశారు. ఇప్పటికే పాఠశాలకు బెల్ట్లు చేరుకోగా నాణ్యత పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డిఈఓ మీనాక్షి, ఎంఈఓ కృష్ణమోహన్, తహసీల్దార్, ఎంపిడిఓ, పీఆర్ ఏఈ, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.



Comments