మచిలీపట్నం : మే 08 (ప్రజా అమరావతి);
*లింగ నిర్ధారణకు పాల్పడితే కేసులు !!*
*-- జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు*
లింగ నిష్పత్తిలో అసమానతలను తొలగించి సమాజంలో ఆడపిల్లల శాతాన్ని పెంచేందుకు అందరూ కృషి చేయాలని, లింగ వివక్ష చూపే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు అదికారులను ఆదేశించారు.
సోమవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ బంగ్లాలో పీసీ పీఎన్డీటీ (గర్భస్థ శిశు నిర్ధారణ పరీక్షల నిర్మూలన), డిస్ట్రిక్ట్ లెవెల్ మల్టీ మెంబర్ అప్రాప్రియేట్ అథారిటీ (డీఎల్ ఎంఎంఏఏ) జిల్లా స్థాయి కమిటీ పై వైద్య ఆరోగ్యశాఖ, ఐసిడిఎస్, విద్యాశాఖ పోలీస్ అధికారులతో కలెక్టర్ పి.రాజాబాబు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, లింగ నిష్పత్తిలో అసమానతను తొలగించి సమాజంలో ఆడపిల్లల శాతాన్ని పెంచాలన్నారు. గర్భస్థ శిశు నిర్ధారణ పరీక్షలు నిర్వహించేవారిపై చట్టపరమైన శిక్షలు అమలు చేయాలన్నారు.ప్రైవేట్ ఆస్పత్రుల్లో, స్కానింగ్ సెంటర్లలో లింగ నిర్ధారణ పరీక్షలు జరగకుండా తనిఖీలు నిర్వహించాలన్నారు. ప్రైవేటు ఆస్ప త్రుల్లో డెలివరీ అయిన పిల్లల బర్త్ సర్టిఫికెట్ వారి తల్లిదండ్రులకు త్వరగా అందించేలా చూడాలన్నారు. జిల్లాలో ఆరోగ్యకరమైన లింగ నిష్పత్తిని తీసుకురావాలన్నారు. జిల్లాలో జరుగుతున్న అబార్షన్లపై ఎప్పటికప్పుడు వైద్యాధికారులు సమాచారాన్ని సేకరించాలన్నారు. బాల్య వివాహాలపై నిఘా ఉంచాలన్నారు. ఇందుకోసం మహిళా పోలీసు, అంగన్వాడీ కార్యకర్తలు ఏఎన్‌ఎం సమన్వయంతో పని చేయాలన్నారు. పీసీ పీఎన్డీటీ యాక్ట్ పై విద్యాశాఖ విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. స్వచ్ఛంద సంస్థలు ఇందులో భాగస్వామ్యులై పనిచేయాలని ఆయన వారికి సూచించారు.
ఈ సమావేశంలో ఆరవ అదనపు జిల్లా జడ్జి ఎస్ చిన్నబాబు, జిల్లా ఎస్పీ పి. జాషువా, జిల్లా వైద్యశాఖాధికారి డాక్టర్ జి. గీతా బాయ్, గైనకాలజిస్ట్ డాక్టర్ లక్ష్మీ కుమారి, రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమ జిల్లా కో- ఆర్డినేటర్ డాక్టర్ కె. రత్నగిరి, ఏవో సాంబిరెడ్డి, హెల్త్ ఎడ్యుకేటర్ రాజేంద్ర, మానిటరింగ్ కన్సల్టెంట్ పీ మస్తానమ్మ , ఎన్జీవో కరెడ్ల సుశీల తదితరులు పాల్గొన్నారు
addComments
Post a Comment