నెల్లూరు, మే 8 (ప్రజా అమరావతి):
స్పందన అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి, సత్వరమే పరిష్కరించాల
ని జిల్లా కలెక్టర్ ఎం హరి నారాయణన్ అధికారులను ఆదేశించారు.
సోమవారం ఉదయం నగరంలోని కలెక్టరేట్ తిక్కన ప్రాంగణంలో జాయింట్ కలెక్టర్ కూర్మనాథ్, డిఆర్ఓ వెంకటనారాయణమ్మతో కలిసి స్పందన కార్యక్రమం నిర్వహించి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్పందన కార్యక్రమంలో ప్రజల నుండీ వచ్చే అర్జీలను నిబంధనల ప్రకారం నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. క్రింది స్థాయిలో అధికారులతో సమన్వయం చేసుకుని పరిష్కరించాలన్నారు. ప్రజల నుండి విజ్ఞప్తులు వచ్చినపుడు విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.స్పందన లో వచ్చే ప్రజా సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి అవసరమైతే వ్యక్తి గతంగా తనిఖీ చేసి పరిష్కరించాలన్నారు. ఒకే సమస్య కోసం ఎక్కువ మంది గ్రూపుగా రాకుండా ఇద్దరూ లేదా ముగ్గురు వచ్చి స్పందన కార్యక్రమంలో అర్జీలు ఇవ్వవచ్చన్నారు. ఒకే సామాజిక సమస్యపై ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు కూడా ఎక్కువ మంది కాకుండా కొద్ది మంది మాత్రమే వచ్చి అర్జీ ఇచ్చి అధికారులకు సహకరించి మిగిలిన అర్జీదారులకు కూడా అవకాశం కల్పించాలని కలెక్టర్ కోరారు. అలాగే మంగళవారం ఉదయం ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారని, కలెక్టరేట్లో తిక్కన ప్రాంగణంలో వర్చువల్ గా పాల్గొనేందుకు అధికారులందరూ హాజరుకావాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ, మెప్మా, హౌసింగ్ పిడిలు కె. సాంబశివారెడ్డి, రవీంద్ర, వెంకట దాస్, డిఎంహెచ్వో పెంచలయ్య, డిపిఓ సుస్మిత, డీఈవో గంగాభవాని, సర్వే రికార్డుల ఏడి హనుమాన్ ప్రసాద్, బీసీ సంక్షేమ అధికారి వెంకటయ్య, జిల్లా ఉద్యాన అధికారి సుబ్బారెడ్డి, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి నిర్మలాదేవి తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment