నెల్లూరు. మే.15 (ప్రజా అమరావతి);
జగనన్నకు చెబుదాం (స్పందన) కార్యక్రమంలో ప్రజల నుండీ వచ్చే అర్జీలను నిబంధనల ప్రకారం నిర్ణీత సమయం లోగా పరిష్కరించాల
ని జిల్లా కలెక్టర్ ఎం. హారి నారాయణన్ అధికారులను ఆదేశించారు. తిక్కన ప్రాంగణం లో కలెక్టర్ ఎం. హరి నారాయణన్, జాయింట్ కలెక్టర్ రోనంకి కూర్మనాథ్,డి. అర్ ఒ. వెంకట నారాయణమ్మ, సోమవారం ప్రజాల నుండి విజ్ఞప్తులు స్వీకరించారు. అర్జీ దారుల సమస్యలను సావదానంగా వింటూ అర్జీలను సంభందిత అధికారులకు ఇచ్చి నిబంధనల ప్రకారం నిర్ణీత గడువు లోగా పరీష్క రించాలాని ఆదేశాలు ఇస్తున్నారు.
వేసవిని దృష్టిలో పెట్టుకొని అర్జీ దారులకోసం తిక్కన ప్రాంగణం లో కూర్చోవడానికి వీలుగా కుర్చీలు ఏర్పాటు చేయించారు. అనారోగ్యంతో ఒక మహిళ వీల్చైర్ లో కలెక్టర్ కు విజ్ఞాపన ఇవ్వడానికి రాగా కలెక్టర్ గమనించి ఆమె వద్దకే వెళ్లి అర్జీ తీసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్రింది స్థాయి లో అధికారులతో సమన్వయం చేసుకుని పరిష్కరించాలన్నారు. ప్రజల నుండి విజ్ఞప్తులు వచ్చినపుడు విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.స్పందన లో వచ్చే ప్రజా సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి అవసరమైతే వ్యక్తి గతంగా తనిఖీ చేసి పరిష్క రించాలన్నారు. ఒకే సమస్య కోసం ఎక్కువ మంది గ్రూపుగా రాకుండా ఇద్దరూ లేదా ముగ్గురు వచ్చి స్పందన కార్యక్రమంలో అర్జీలు ఇచ్చి మిగిలినవారికి కూడా అవకాశం కల్పించి సహక రించాలని కలెక్టర్ కోరారు.
ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఎ పి.డి, ZP. సి ఇ ఒ, డి ఇ ఒ, డి. పి. ఒ, జిల్లా రిజస్ట్రార్, డి. ఎం. హెచ్ ఒ, డి సి హెచ్ యస్ .,డి సి ఒ, మెప్మ పిడి, డి యస్ ఒ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment