ముస్లిం సంఘాల ప్రతినిధులు విన్నవించిన పలు అంశాలపై సానుకూలంగా స్పందించిన సీఎం.



*ముస్లిం సంఘాల ప్రతినిధులతో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమావేశం*.


*ముస్లింలకు మన ప్రభుత్వంలో ఇచ్చిన పదవులు మరే ప్రభుత్వంలోనూ ఇవ్వలేదు*.


*శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌, డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో పాటు కార్పొరేషన్ల  చైర్మన్లు, డైరెక్టర్లుగా పెద్ద ఎత్తున అవకాశం కల్పించాం : సీఎం శ్రీ వైయస్‌.జగన్‌*.


అమరావతి (ప్రజా అమరావతి);

*రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి హాజరైన ముస్లిం సంఘాల ప్రతినిధులతో సమావేశమైన సీఎం*.


*తమ సమస్యలను ముఖ్యమంత్రికి వివరించిన ముస్లిం సంఘాల ప్రతినిధులు*.


వక్ఫ్‌ బోర్డు ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్న విషయాన్ని సీఎం దృష్టికి తీసుకొచ్చిన ముస్లిం సంఘాల ప్రతినిధులు.


వక్ఫ్‌ బోర్డు ఆస్తుల పరిరక్షణ, మదరసాలలో విద్యా వాలంటీర్లకు జీతాలు చెల్లింపు, ముస్లింల అభ్యన్నతికి సలహాదారు నియామకం వంటి అంశాలను విన్నవించుకున్న ముస్లిం పెద్దలు.


ముస్లిం సంఘాల ప్రతినిధులు విన్నవించిన పలు అంశాలపై సానుకూలంగా స్పందించిన సీఎం.


కడపలో అసంపూర్తిగా ఉన్న హజ్‌హౌస్‌ నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని సీఏం అదేశం.

విజయవాడలో హజ్‌హౌస్‌ నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేసిన ముస్లిం సంఘాలు. 

హజ్‌హౌస్‌ నిర్మాణం కోసం అవసరమైన భూమి కేటాయించాలని అధికారులకు ఆదేశం. 

వక్ఫ్‌ బోర్డు ఆస్తుల రక్షణకై తగిన చర్యలు తీసుకునే దిశగా కార్యాచరణకు హామీ ఇచ్చిన సీఎం.

అన్ని మతాల భూముల ఆస్తులు పరిరక్షణకు జిల్లా స్ధాయిలో ప్రత్యేక కమిటీ నియమించాలని సీఎం ఆదేశం.

జిల్లా స్ధాయిలో ఈ కమిటీల ఏర్పాటుకు నిర్ణయం.

కలెక్టర్‌ ఆధ్వర్యంలో జేసీ, ఏఎస్పీలతో ఒక కమిటీ వేసి... జిల్లాస్ధాయిలో ఒక సమన్వయకమిటీ ఏర్పాటు చేయాలన్న సీఎం.

గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఖాజీల పదవీ కాలం మూడేళ్లుగా నిర్ణయించిందని సీఎం దృష్టికి తీసుకొచ్చిన ముస్లిం సంఘాల పెద్దలు.

ఖాజీల రెన్యువల్‌ కోసం చాలా ఇబ్బందులు పడుతున్నామని నివేదించిన ముస్లిం సంఘాల పెద్దలు.

ఖాజీల పదవీకాలాన్ని పెంచడంతో పాటు రెన్యూవల్‌ ప్రాసెస్‌ను సులభతరం చేయాలని విజ్ఞప్తి.

ఖాజీల పదవీకాలాన్ని మూడేళ్ల నుంచి పదేళ్లకు పెంచడానికి సీఎం ఆదేశం.

గ్రామ, వార్డు సచివాలయ స్ధాయిలో సులభతరమైన రెన్యువల్‌ విధానాన్ని ప్రవేశపెట్టాలని అధికారులకు ఆదేశం.

మదరసాలలో పనిచేస్తున్న విద్యావాలంటీర్ల జీతాలు సమస్యను తక్షణమే పరిష్కరించాలనిఅధికారులకు సీఎం ఆదేశం.

ఉర్ధూ పాఠశాలల్లో వచ్చే విద్యాసంవత్సరం నాటికి బైలింగువల్‌ టెక్ట్స్‌బుక్స్‌లో భాగంగా ఇంగ్లిషుతోపాటు ఉర్ధూలో కూడా ఉండేలా చర్యలు. 

కర్నూలు ఉర్ధూ విశ్వవిద్యాలయం భవన నిర్మాణ పనులను పూర్తిచేయాలన్న సీఎం.

సయ్యద్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలన్న ముస్లిం మతపెద్దల విజ్ఞప్తి, కార్పొరేషన్‌ ఏర్పాటుకు సీఎం ఆమోదం.


*ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే..*:


ఇక్కడికి వచ్చిన మీ అందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు.  భగవంతుడి దయ వలన, మీ అందరి ఆశీర్వాదం, మీ సహాయ సహకారాలతోనే ఈ ప్రభుత్వం ఏర్పడింది. ఇది మనందరి ప్రభుత్వం అన్న విషయాన్ని మనసులో పెట్టుకొండి. ప్రభుత్వం నుంచి మీకు ఏ రకంగా మరింత సహాయం చేయాలన్నదానిపై మీ సలహాలు తీసుకోవడానికే ఇవాళ మిమ్నల్ని పిలిచాం. 

మీరు చెప్పిన అన్ని అంశాలను యుద్ధ ప్రాతిపదికిన పరిష్కరిస్తాం. 

మీరు చెప్పిన సమస్యలను పరిష్కరించడంతో పాటు అవసరమైన నిధులును కూడా 

కేటాయిస్తాం. 

అన్ని సమస్యలకు సానుకూలమైన పరిష్కారం ఈ సమావేశం ద్వారా లభిస్తుంది. ఈ దఫా మన లక్ష్యం 175 కి 175 స్ధానాలు గెలవడం. కచ్చితంగా దాన్ని సాధిస్తాం. ప్రతి ఇంటికి, ప్రతి గడపకూ మంచి చేశాం. దేవుడి దయతో ఇదంతా చేయగలిగాం. ఇక్కడికి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.

Comments