గ్రామీణ ప్రాంతాలలోని పేద మహిళల జీవితాలలో నిలకడ కలిగిన అభివృద్ధి చూసేందుకు వై.యస్.ఆర్ చేయూత, వై.యస్.ఆర్ ఆసరా కార్యక్రమాల ద్వారా ముందుకు తీసుకు వెళ్లడం జరుగుతుంది


 


విజయవాడ (ప్రజా అమరావతి);


గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ (SERP).


               గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (SERP) ఆధ్వర్యంలో  గ్రామీణ ప్రాంతాలలోని పేద మహిళల జీవితాలలో నిలకడ కలిగిన అభివృద్ధి చూసేందుకు వై.యస్.ఆర్ చేయూత, వై.యస్.ఆర్ ఆసరా కార్యక్రమాల ద్వారా ముందుకు తీసుకు వెళ్లడం జరుగుతుందని గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ ముఖ్య కార్యనిర్వాహక అభివృద్ధి అధికారి ఇంతియాజ్ అహ్మద్ అన్నారు. 

              గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (SERP) కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (SERP) ముఖ్య కార్యనిర్వాహక అభివృద్ధి అధికారి ఇంతియాజ్ అహ్మద్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ప్రభుత్వ పరిపాలనా విధానము మరింత పారదర్శకంగా మరియు సమర్ధవంతంగా నడిపేందుకు ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలను తీసుకోవటం జరిగిందన్నారు. వివిధ రంగాలలోని ఈ విప్లవాత్మక మార్పులకు ముఖ్యమైన కారణం ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ.వై.యస్.జగన్మోహన్ రెడ్డి  అన్ని రంగాలలో ఆర్ధిక పరిపుష్టికి ఈ విప్లవాత్మక మార్పులు దోహద పడ్డాయి.


  వై.యస్.ఆర్  చేయూత పధకం ద్వారా 45 సం. నుండీ 60 సం. ల మద్య వయసు ఉన్న మహిళలు ఈ పధకానికి అర్హులు, 4 సం.రాలలో రూ. 75000 ఈ పధకం ద్వారా అందిస్తారని తెలపారు. ఈ పథకం ద్వారా మొదటి విడత మొత్తం రూ.4,500కోట్లు 24 లక్షల ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల మహిళల వ్యక్తిగత ఖాతాలలోకి నేరుగా జమ చేయడం జరిగింది. వై.యస్.ఆర్  చేయూత రెండవ విడత లబ్ది రూ.4679.46 కోట్లు ను 24.95 లక్షల మంది ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల మహిళల వ్యక్తిగత ఖాతాలలోకి నేరుగా జమ చేయడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా వై.యస్.ఆర్. చేయూత ద్వారా మూడవ విడత లబ్ది రూ.4949.44 కోట్లను 26.39 లక్షల మందిక ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల మహిళల వ్యక్తిగత ఖాతాలలోకి నేరుగా జమ చేశామన్నారు. చేయూత పధకం ద్వారా ఈ మూడు సంవత్సరాలలో మొత్తం రూ.14129.11 కోట్ల రూపాయలను లబ్ది చేకూర్చడం జరిగింది. ప్రభుత్వం ఇచ్చిన మూడు విడతల  చేయూత  లబ్ధి తో పాటు వివిధ జీవనోపాధులు పెంపొందించుకోనెందుకు బ్యాంకులు, స్త్రీనిధి మరియు SHG ల నుంచి సుమారు రూ. 3738.09 కోట్లు ఆర్థిక చేయూతను ఇప్పటి వరకు అందించడం జరిగిందని చెప్పారు. 


  వై.యస్.ఆర్ చేయూత పధకం ద్వారా దేశంలో ఎక్కడా లేని విధంగా బలహీన వర్గాలు, మైనార్టీలకు చెందిన దాదాపు 26 లక్షల మంది  మహిళలకు 4 ఏళ్లలో రూ.18,000 కోట్ల లబ్ది చేకూరనుందని వివరించారు. ఈ చేయూత లబ్ది ద్వారా మహిళలు సుస్థిర జీవనోపాధులను ఏర్పాటుచేసుకోని వారి సామర్థ్యాలను పెంచడంతో పాటు మార్కెటింగ్, సాంకేతికపరమైన సహకారాన్ని అందించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.


  వై.యస్.ఆర్  ఆసరా కార్యక్రమం ద్వారా  స్వయం సహాయక సంఘాలలో ఉన్న మహిళల అర్థిక ఇబ్బందులను గౌరవ ముఖ్యమంత్రి  తన 3,648 కిలో మీటర్ల సుదీర్ఘమైన  “పాదయాత్ర”లో కళ్ళారా చూసి, చలించి ఎన్నికల రోజు వరకూ అనగా తేది. 11.04.2019 నాటికి వారి పొదుపు సంఘాల బ్యాంకు ఋణాల మొత్తం సొమ్మును 4 దఫాలుగా నేరుగా సంఘం పొదుపు ఖాతా ద్వారా వారికి చేరే ఏర్పాటు చేశామన్నారు. దానిలో బాగంగా మొదటి విడత సెప్టెంబర్ 11, 2020 నాడు రూ.6,318.76 కోట్లను మన మహిళా సంఘాల పొదుపు ఖాతాలలో జమచేయడం జరిగందని, మరలా  కరోన కష్టకాలంలో, రాష్ట్ర అర్థిక పరిస్థితి బాగాలేనప్పటికి ఇచ్చిన మాట ప్రకారం వై.యస్.ఆర్ ఆసరా రెండవ విడత మొత్తంను 7.97 లక్షల మహిళా సంఘాలలోని 78.76 లక్షల లబ్ది చేకూరేలా రూ.6,439.52 కోట్లు నేరుగా  మహిళా సంఘాల పొదుపు ఖాతాలలో జమ చేశామని తెలిపారు. .


*మహిళలను వ్యాపార వేత్తలుగా తీర్చిదిద్దటం*:


  మహిళల జీవితాల్లో మరిన్ని కాంతులు తీసుకురావాలని, వారికుటుంబంలో సుస్థిరమైన ఆదాయం రావాలని, వారికీ వారుగా సృష్టించుకునే వ్యాపార మరియు జీవనోపాధి అవకాశాలకు ఈ డబ్బును ఉపయోగించుకుని  అర్థికంగా అభివృద్ది చెందుతూ లక్షాధికారులు కావాలనే మంచి ఆలోచనతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. 


  మహిళలు వారి కాళ్ళ మీద నిలబడేటట్టుగా చేయుటకు,జీవనోపాధిని మెరుగు పర్చుకొనే విధంగా, గతఏడాది అమూల్, హిందూస్తాన్ యూని లివర్, ఐ.టి.సి., ప్రోక్టర్ అండ్ గ్యాంబల్, అజియో - రిలయన్స్,గ్రామీణ వికాస కేంద్రం,టేనేజర్, మహేంద్ర&ఖేతి, కల్గుడి, వంటి  బహుళ జాతి సంస్థలతో మరియు మరియు బ్యాంకులతో ఒప్పందాలు చేసుకొని మహిళలకు వ్యాపార మార్గాలు చూపించి ఆసరా, చేయూత వంటి పథకాలతో మహిళలకు సుస్థిరమైన అర్థిక అభివృద్ధికి బాటలు వేసేలా ప్రభుత్వం ఒప్పందాలు చేసుకున్నట్లు తెలిపారు. 


వీటిలో భాగంగా ఈ రోజు అనగా ది.17.03.2023 న Heifer International తో  భాగస్వామ్య ఒప్పందం చేసుకోవడం జరిగిందని చెప్పారు. Heifer International, India  గ్రామీణ ప్రాంతాలలోని పేద మహిళలు వ్యవసాయ ఆధారిత వృత్తులలో ఆధారపడిన వారికి సహాయ సహకారాలు అందించి ఆర్ధికం గా వారు నిలదొక్కుకునేటట్లు చేస్తుందన్నారు. పాడి పశువులు, కోళ్ళ పెంపకం, చిన్న  జీవాలు  పెంపకం దారులకు శిక్షణ మరియు మెరుగైన మార్కెటింగ్ సౌకర్యాలను కల్పిస్తుందని వివరించారు. 


  ఈ కార్యక్రమములో  Heifer International ప్రతినిధులు Smt.Surita Sandosham, Sri.Terry Wyer, Smt.Elia Maker, Sri.Mahendra Lohani, Smt.Rina Soni, Sri.Pranjit Talukdar,Sri.Shyam Kumar Katta మరియు SERP డైరెక్టర్ శ్రీమతి. విజయకుమారి , అడిషనల్ డైరెక్టర్ శ్రీమతి.మహిత , DGM M. కేశవ కుమార్  మరియు సిబ్బంది పాల్గొన్నారు .

Comments