చిన్నారుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం మనందరి బాధ్యత.

 చిన్నారుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం మనందరి బాధ్యత.*


         :- జిల్లా కలెక్టర్ పి. బసంత కుమార్


  పుట్టపర్తి, మార్చి 9 (ప్రజా అమరావతి):- భవిష్యత్ తరాల పిల్లల ఆరోగ్యం కోసం రెండు రోజుల పాటు నిర్వహించే జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం కార్యక్రమంలో అందరూ భాగ్యస్వాములై విజయవంతం చేయాలని, చిన్నారుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం మనందరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ పి.  బసంత కుమార్ పేర్కొన్నారు

గురువారం కలెక్టరేట్ లోని    కలెక్టర్ ఛాంబర్ నందు DMHO  ఆధ్వర్యంలో నులి పురుగుల నివారణ దినోత్సవ జిల్లా కోఆర్డినేషన్ సమావేశం జిల్లా కలెక్టర్   బసంత కుమార్ గారు నిర్వహించారు.


    ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని  మార్చి  14, 18 తేదీలలో పెద్దఎత్తున నిర్వహిస్తున్నామని, అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ జూనియర్ కళాశాలలు, ఐటిఐ, పాలిటెక్నిక్, అంగన్వాడీ కేంద్రాల్లో 1-19 సంవత్సరాల వయసు లోపు ఉన్న పిల్లలందరికీ నులి పురుగుల నివారణ నిర్మూలన ఆల్బెండజోల్ 400 మి. గ్రా మాత్రలను మధ్యాహ్న భోజన అనంతరం ఉపాధ్యాయుల సమక్షంలో పిల్లల చేత చప్పరించి మింగించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాలలో ఉన్న 1-2 సంవత్సరాల వయస్సు పిల్లలందరికీ అర్ధ మాత్రను 3-5 సంవత్సరాల వయస్సు పిల్లలందరికీ ఒక మాత్రను ఇచ్చేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యా సంస్థలు, సర్వ శిక్ష అభియాన్ పిఓ, ఐసిడిఎస్, డిఆర్డీఏ, మున్సిపల్ శాఖ కమిషనర్లు, అన్ని సంక్షేమ శాఖలు భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలో, ప్రభుత్వ మరియు ప్రైవేట్ జూనియర్ కళాశాలలో మరియు ఐటిఐ, పాలిటెక్నిక్ కళాశాలలకు సంబంధించి ఎంతమంది విద్యార్థులు ఉన్నారో సంబంధించిన నివేదికను  శనివారం నాటికి సిద్ధం చేయాలని,  అధికారులను ఆదేశించారు. మార్చి నెల 13 తేదీ  నాటికి ఆల్బెండజోల్ 400 మి. గ్రా మాత్రలు కూడ చేరే విధంగా చర్యలు తీసుకోవాలని డిఎమ్ హెచ్ఓ ను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.  ఆయా మండలాల ఎంపీడీవోలు, మండల విద్యాశాఖ అధికారులు మెడికల్ ఆఫీసర్లు, ఆశ వర్కర్లు,  ఏఎన్ఎంయూలు, అందరూ అధికారులు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు.జిల్లా అధికారులందరూ కూడ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించి  ఈ మాత్రలను సేవించడం వల్ల రక్తహీనతను నిర్మూలించబడడం,  పోషకాహార ఉపయోగితను, వ్యాధినిరోధ శక్తిని మెరుగు పరచడంతో పాటు చదువు పై ఏకాగ్రత, నేర్చుకోగల  సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుందని ఇంకా ఏవైనా ప్రయోజనాలు ఉంటే పిల్లలకు తెలియచేయాలని జిల్లా అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఆరోగ్యవంతమైన నవ - యువ సమాజం కోసం నేటి చిన్నారుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం మన అందరి బాధ్యతని గుర్తు చేశారు.  డిఎంహెచ్ ఆధ్వర్యంలో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా ఈనెల 13వ తేదీన  

జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమానికి  ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ కృష్ణారెడ్డి, డిఇఓ మీనాక్షి,  ప్రోగ్రాం ఆఫీసర్ కుళాయి స్వామి,  శ్రీమతి నివేదిత, డిఆర్డిఏ పిడి నరసయ్య, బీసీ, ఎస్సీ, ఎస్టి, సంక్షేమ అధికారులు   నిర్మలజ్యోతి, శివ రంగ ప్రసాద్, మోహన్ రావు, పుట్టపర్తి మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డి, ఐసిడిఎస్ పెనుగొండ అధికారిని తదితరులు పాల్గొన్నారు.

 

Comments