పోలవరం ప్రాజెక్టుపై సిఎస్ సమీక్ష.
విజయవాడ,11 మార్చి (ప్రజా అమరావతి): పోలవరం ప్రాజెక్టుపై శనివారం విజయవాడలోని సిఎస్ క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.ముఖ్యంగా డయాఫ్రమ్ వాల్ ఎంత మేర దెబ్బతిన్నది దానిని ఎప్పటి లోగా పునర్నిర్మాణం చేయగలరు వంటి వివరాలు అడిగి తెలుసుకున్నారు.అదే విధంగా ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు ప్రగతి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అంతేగాక ఇప్పటి వరకు అమలు చేసిన ఆర్ ఆండ్ ఆర్ ప్యాకేజీ ఇంకా అమలు చేయాల్సిన ప్యాకేజీ వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఇంకా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి వివిధ అంశాలపై సిఎస్ జవహర్ రెడ్డి సమీక్షించారు.
జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ మాట్లాడుతూ దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ ను మూడు మాసాల్లో పునర్నిర్మాణం చేయాలని కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసినట్టు వివరించారు.
ఈసమావేశంలో ఆర్ అండ్ ఆర్ కమీషనర్ శ్రీధర్, పోలవరం చీఫ్ ఇంజనీర్ సుధాకర్ బాబు, ఎస్ ఇ నర్సింహమూర్తి పాల్గొన్నారు.
addComments
Post a Comment