*- భీమిలిలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే రావి*
*- వేపాడకు ప్రథమ ప్రాధాన్యత ఓటు వేయాలని పిలుపు*
భీమిలి /విశాఖ మార్చి 1 (ప్రజా అమరావతి): ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా భీమిలి నియోజకవర్గంలో కృష్ణాజిల్లా గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరావు బుధవారం విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. చంద్రబాబు ఆదేశాల మేరకు భీమిలి నియోజకవర్గం పరిశీలకునిగా నియమితులైన రావి టిడిపి ఇన్చార్జి కోరాడ రాజబాబు, ఇతర ముఖ్య నేతలతో కలిసి ఉత్తరాంధ్ర పట్టబద్రులను కలిశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరావుకు ప్రధమ ప్రాధాన్యత ఓటును వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. వేపాడ సామాన్య కుటుంబం నుండి వచ్చారని తెలిపారు. గత నాలుగేళ్లుగా ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై వేపాడకు స్పష్టమైన అవగాహన ఉందని చెప్పారు. వేపాడను గెలిపిస్తే శాసనమండలిలో ఉపాధ్యాయులు, నిరుద్యోగ పట్టభద్రులు, ఉద్యోగుల వాణిని వినిపించడం జరుగుతుందన్నారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి వేపాడను గెలిపించాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తూ ఓటర్లను ఆకట్టుకునేలా మాజీ ఎమ్మెల్యే రావి ప్రసంగాలు కొనసాగాయి.
ఇదిలా ఉండగా రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు గణనీయంగా తగ్గిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. యువత ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు కూడా రావడం లేదన్నారు. ఉత్తరాంధ్ర పట్టబద్దుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వేపాడను గెలిపించడం ద్వారా 2024 సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి విజయానికి నాంది పలకాలని ఉత్తరాంధ్ర పట్టభద్రులకు విజ్ఞప్తి చేశారు. మొత్తం మీద భీమిలి నియోజకవర్గంలో పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం పార్టీ ముందుండేలా మాజీ ఎమ్మెల్యే రావి తీవ్రంగా కృషి చేస్తున్నారు.
addComments
Post a Comment