రోబరీ కేసుతో సహా 10కేసుల్లో నిందితుడి అరెస్టు

 *రోబరీ కేసుతో సహా 10కేసుల్లో నిందితుడి అరెస్టు


*

*- విజయనగరం 1వ పట్టణ సిఐ బి. వెంకటరావు*

విజయనగరం (ప్రజా అమరావతి);

విజయనగరం పట్టణంలో రోబరీకి పాల్పడిన నిందితుడిని అరెస్టు చేసినట్లుగా విజయనగరం 1వ పట్టణ

పోలీసు స్టేషనులో మార్చి 8న ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను 1వ పట్టణ సిఐ బి.వెంకటరావు

వెల్లడించారు.


ఈ సందర్భంగా 1వ పట్టణ సిఐ బి. వెంకటరావు మాట్లాడుతూ - విశాఖపట్నం పెదవాల్తేరుకు చెందిన

నిందితుడు కర్రి శివరామ కృష్ణ (38సం.లు) ఓ.ఎల్. ఎక్స్ లో వచ్చిన ప్రకటనలను చూసి, వాటిని కొనుగోలు చేసేందుక

గాను వారి వద్దకు వెళ్ళి, వారికి మాయమాటలు చెప్పి, ఆయా వస్తువులను బలవంతంగా వారి వద్ద నుండి తీసుకొని

పోవడం చేస్తుండేవాడన్నారు. ఈ తరహాలో సదరు వ్యక్తి హైదరాబాద్ సిటీ కమీషనరేట్ పరిధిలో 18 నేరాలకు

పాల్పడ్డాడన్నారు. అదే విధంగా విజయనగరం జిల్లా గుర్ల మండలం గరికివలసకు చెందిన ఫిర్యాది కోరాడ సత్యం అనే

వ్యక్తి తన వద్దగల లాప్టాప్ ను అమ్మేందుకుగాను ఓ.ఎల్.ఎక్స్.లో ప్రకటన ఇవ్వగా, వాటిని కొనుగోలు చేసేందుకుగాను

మార్చి 4న నిందితుడు ఎపి 31 బిక్యూ 3753 మోటారు సైకిలుపై విజయనగరం ఆర్ అండ్ బి ప్రాంతంకు చేరుకొని,

ఫిర్యాదిని కలవాల్సిందిగా కోరినాడు. ఫిర్యాది తన లాప్టాప్్ను అమ్మేందుకుగాను లాప్టాప్ తీసుకొని విజయనగరం

పట్టణంలోనిఆర్ అండ్ బి ప్రాంతంకు చేరగా, నిందితుడు లాప్ టాపన్ను పరిశీలించి, ఫిర్యాదిని మభ్యపెట్టి, తీసుకొని

వెళ్ళిపోయేందుకు ప్రయత్నించగా, ఫిర్యాది అడ్డుకొనేందుకు ప్రయత్నించినాడు. నిందితుడు కర్రి శివరామకృష్ణ ఫిర్యాది

కోరాడ సత్యం (21)పై దౌర్జన్యం చేసి, కత్తితో బెదిరించి, చాతీపై గుద్ది, లాప్ టాప్ను బలవంతంగా తీసుకొని పరారీ

అయిపోయాడు. ఈ సంఘటనపై ఫిర్యాది 1వ పట్టణ పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు

చేసి, దర్యాప్తు ప్రారంభించారు. సిఐ బి.వెంకటరావు ఆధ్వర్యంలో ఎస్ఐ వి. అశోక్ కుమార్, హెడ్ కానిస్టేబులు

ఎం. అచ్చిరాజు, కానిస్టేబుళ్ళు పి. శివశంకర్, టి. శ్రీనివాసరావు, ఎస్. అజయ్ కుమార్లు దర్యాప్తు బృందం నిందితుడిని

అదుపులోకి తీసుకొని, విచారణ చేసి, నిందితుడు ఇదే తరమాలో విశాఖపట్నం సిటీలో 4, పార్వతీపురం పట్టణంలో

ఒకటి, విజయనగరం 1వ పట్టణ పోలీసు స్టేషను పరిధిలో 5 నేరాలకు పాల్పడినట్లుగా గుర్తించారు. నిందితుడి వద్ద

ఆయా కేసుల్లో 2 లాప్ టాప్లు, రెండు మొబైల్ ఫోన్లు, ఆరు మోటారు సైకిళ్ళును రికవరీ చేసామని 1వ పట్టణ సిఐ

బి. వెంకటరావు తెలిపారు.


విజయనగరం 1వ పట్టణ పోలీసు స్టేషనులో నిర్వహించిన మీడియా సమావేశంలో సిఐ బి. వెంకటరావు,

ఎస్ఐలు వి. అశోక్ కుమార్, భాస్కరరావు మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.



Comments