గుండాల క్షేత్రం నిర్మించే అవకాశం రావడం అదృష్టం : ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్

 



అమరావతి (ప్రజా అమరావతి);


*గుండాల క్షేత్రం నిర్మించే అవకాశం రావడం అదృష్టం : ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్*


*గుండెల నిండా సంతోషం నింపేలా గుండాల రహదారి*


500 ఏళ్ల క్రితం రాయల హయాంలో ఎలా ఉండేదో అదే స్థాయిలో ఆలయ పునరుద్ధరణ


ఎవరి చేతుల మీదుగా ఆలయ నిర్మాణం జరగాలో భగవంతుడి నిర్ణయం


ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతుల మీదుగా ఆలయాల నిర్మాణం ఓ వరం


నాటి రాయి, నాటి చెక్కడం పనిలాగే అచ్చుగుద్దినట్లు నిర్మిస్తాం


సంవత్సరంలోగా క్షేత్రం, టీటీడీ కల్యాణ మండపం పూర్తి


ఏపీలో రూ.5 కోట్లతో నిర్మించిన రెండో కల్యాణ మండపం డోన్ మండలం గుండాలలో


మొదటిది ముఖ్యమంత్రి  స్వగ్రామమైన  పులివెందులలో


చుట్టుపక్కల మండలాల ప్రజలు కూడా శుభకార్యాలు, ఆలయ దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు


ఆలయం చుట్టూ అతిథి గృహాలు, గుడిలో నిద్రచేసుకునే వీలుగా సౌకర్యాలకు ప్రతిపాదన


మూడు సంవత్సరాల్లోనే ప్రజలకు అభివృద్ధి అంటే ఏంటో చూపగలిగాం


ఐ.టీ.ఐ కాలేజీతో పాటు హాస్టల్ వెసులుబాటున్నది ఒక్క డోన్ లోనే,  డోన్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ కూడా


డోన్ నియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రి, డోన్ లో బీసీ మగపిల్లలకు హాస్టల్, బేతంచెర్లలో ఆడపిల్లలకు హాస్టల్


రూ.330 కోట్లతో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుతో ఇంటింటికి తాగునీరు


68 చెరువులు నింపే కార్యక్రమం , 30 అడుగలకే నీరందించేలా ఏర్పాట్లు


హాజరైన టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, జెడ్పీటీసీ పాపిరెడ్డి, మీట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీరాములు, జిల్లా కలెక్టర్ తదితరులు



Comments