మన్నూరు పోలీస్ స్టేషన్ ని జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు ఐ.పి.ఎస్ బుధవారం ఆకస్మిక తనిఖీ


 అన్నమయ్య జిల్లా (ప్రజా అమరావతి);


 అన్నమయ్య జిల్లాలోని మన్నూరు పోలీస్ స్టేషన్ ని జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు ఐ.పి.ఎస్  బుధవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించి  పరిసరాలు పరిశీలించారు.


పోలీస్ స్టేషన్ ఆవరణంను  పరిశుభ్రంగా ఉంచుకోవాలని పోలీస్  సిబ్బందికి సూచనలు చేశారు..


దొంగతనాలు అరికట్టేందుకు గస్తీ ముమ్మరం చేయాలని ఆదేశించారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారుల సమన్వయంతో నాటుసారా, అక్రమ మద్యం, ఇసుక అక్రమ రవాణాపై దాడులు ముమ్మరం చేయాలని ఆదేశించారు.


 ట్రాఫిక్, రోడ్డు ప్రమాదాల నియంత్రణ కు చర్యలు తీసుకోవాలని, వాహనదారులకు, ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.


 ఎర్రచందనం అక్రమ రవాణా ను అరికట్టేందుకు సమాచార వ్యవస్థను పటిష్ట పరచుకొని  ముందస్తు సమాచారాన్ని సేకరించుకొని ఎర్రచందనం అక్రమ రవాణా ను అరికట్టాలని సూచించారు.

 

పోలీస్ స్టేషన్ కు సంబంధించిన రికార్డ్స్ ను వివిధ కేసులకు చెందినా ఫైళ్లను పరిశీలించారు, చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించాలని సూచనలు చేశారు.   


వివిద కేసులలో స్వాధీనం చేసుకొన్న వాహనాలను త్వరగా డిస్పోస్ చేయాలని అధికారులను ఆదేశించారు 


 జిల్లా ఎస్పీ  సిబ్బంది తో మాట్లాడి వారి సమస్యలు వుంటే వాటిని తన దృష్టికి తీసుకురావాలని, సమస్యలను పరిష్కరిస్తానని సూచించారు.    


 ఈ ఆకస్మిక తనిఖీలో ఎస్పీ గారితో పాటు రాజంపేట డి.ఎస్.పీ. శివ భాస్కర్ రెడ్డి  , సి.ఐ. పుల్లయ్య  , ఎస్.ఐ. మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Comments