సరైన ఆర్ధిక వ్యవహారమే మనల్ని కాపాడుతుంది

 

సరైన ఆర్ధిక వ్యవహారమే మనల్ని కాపాడుతుంది 


వినియోగ దారులకు పలు సూచనలు చేసిన ఆర్.బి.ఐ 

పోస్టర్లను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ సూర్య కుమారి 

విజయనగరం, ఫిబ్రవరి 13 (ప్రజా అమరావతి):   బ్యాంకు వినియోగదారులను అప్రమతం చేయడానికి రిజర్వ్  బ్యాంకు  అఫ్ ఇండియా పలు సూచనలు చేసింది.  ఇందుకు సంబంధించి ప్రజల్లో అవగాహన పెంచడానికి పోస్టర్లను ముద్రించింది. సరైన ఆర్ధిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది అనే నినాదం తో ముద్రించిన  ఈ  పోస్టర్లను స్పందన కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ సూర్య కుమారి. ఎల్.డి.ఎం శ్రీనివాసరావు, బ్యాంకు ఉన్నతాధికారులు ఆవిష్కరించారు.  

ఇప్పుడు పొడుపు చేయండి, భవిష్యతును సురక్షితం చేసుకోండి, పొదుపు చేసే అలవాటే మిమ్మల్ని ఆర్ధిక ఇబ్బందుల నుండి కాపాడగలదు అనే విషయాన్నీ ప్రజలు గమనించాలని ముద్రించారు.   ఓ.టి.పి, పాస్ వర్డ్స్ పిన్ లేదా బ్యాంకు ఖాతా వివరాలను ఇతర వ్యక్తిగత వివరాలను ఎవ్వరితోనూ పంచుకోకూడదని పోస్టర్ల ద్వారా చైతన్యం చేయడం జరుగుతుందని ఎల్.డి.ఎం తెలిపారు.  ఫోన్ లో గోప్యమైన సమాచారం  అనగా కాంటాక్ట్ మెసేజ్ లు, లొకేషన్, కెమెరా, గ్యాలరీ వంటి మొదలైన వాటిని ఎవరైనా వాడేందుకు అనుమతించే ముందు జాగ్రత్త వహించాలన్నారు. 

  కష్టబడి సంపాదించిన డబ్బు విలువైనదని, తెలివిగా ఖర్చు చేయాలనీ,  మందుగా బడ్జెట్  చేయు, తర్వాత ఖర్చు చేయు అనే అంశాలను పోస్టర్ నందు పొందుపరచారు.   రుణాలు పొందాలనుకునే వారు నియంత్రిత సంస్థల నుండే , అవసరం ఉన్నంతే రుణాలు తీసుకోవాలని ఆర్.బి.ఐ  అవగాహన కలిగిస్తోంది. .

Comments