పిసి&పిఎన్డిటి యాక్ట్ ను కఠినంగా అమలు చేయాలి

 *పిసి&పిఎన్డిటి యాక్ట్ ను కఠినంగా అమలు చేయాలి


*


*: జిల్లా కలెక్టర్ పి.బసంత్ కుమార్*


పుట్టపర్తి (శ్రీ సత్యసాయి జిల్లా), ఫిబ్రవరి 04 (ప్రజా అమరావతి):


పిసి&పిఎన్డిటి యాక్ట్ ను కఠినంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ పి.బసంత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం పుట్టపర్తి కలెక్టరేట్లోని జిల్లా కలెక్టర్ చాంబర్లో జిల్లాస్థాయి మల్టీ మెంబర్ అథారిటీ మీటింగ్ (డిఎల్ఎంఎంఎఎ) నిర్వహించారు.


ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పిసి&పిఎన్డిటి యాక్ట్ ను కఠినంగా అమలు చేయాలని, ఎక్కడైనా లింగ నిర్ధారణ పరీక్షలు చేపడితే స్కాన్ సెంటర్లు, స్కానింగ్ సెంటర్ల యజమానులు, గైనిక్ డాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. లింగ నిర్ధారణ పరీక్షలను పూర్తి స్థాయిలో అదుపులోకి తేవాలని, స్కానింగ్ సెంటర్లపై నిఘా పెంచాలని, ఎప్పటికప్పుడు డెకాయ్ ఆపరేషన్లు నిర్వహించి లింగ నిర్ధారణ పరీక్షలు చేపట్టే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. స్కానింగ్ సెంటర్ లు, ల్యాబ్ లలో అన్ని రకాల వస్తువులు ఉన్నాయా లేదా అనేది పరిశీలించి వాటికి అనుమతులు మంజూరు చేయాలన్నారు. స్కానింగ్ సెంటర్ లు, ల్యాబ్ లపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలన్నారు. డిఎల్ఎంఎంఎఎ కమిటీ ముందుకు  స్కానింగ్, గైనిక్ ఆర్టిఫిషియల్ సంతాన సాఫల్య కేంద్రాల కోసం కొత్తవి మరియు రెన్యువల్ కోసం 26 దరఖాస్తులు రాగా వాటిని కమిటీ ముందు ఉంచడం జరుగగా, వాటిని పరిశీలన చేసి కమిటీ ఆమోదించడం జరిగింది.


ఈ సమావేశంలో హిందూపురం అడిషనల్ జిల్లా జడ్జి కె.శైలజ, డిఎస్పి టిడి. యశ్వంత్, డిఎంహెచ్ఓ డా. కృష్ణారెడ్డి, డిసిహెచ్ఎస్ తిప్పేంద్రనాయక్, అనంతపురం న్యాయ సలహాదారురాలు ఆశాలత, ఆర్డిటి హెల్త్ డైరెక్టర్ సిర్రప్ప, డెమో బాబా ఫక్రుద్దీన్, హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ రామలక్ష్మి, హెల్త్ ఎడ్యుకేటర్ రామచంద్ర పాల్గొన్నారు.



Comments