రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి);
నూతనంగా నిర్మాణం చేపట్టిన లాలా చెరువు రైతు బజారులో వ్యాపార నిర్వహణ కోసం అద్దె ప్రాతిపదికన షాపులు కేటాయించడం జరుగుతుంద
ని, దరఖాస్తు కి చివరి తేదీ 15.2.23 అని జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ బుధవారం ఒక ప్రకటన లో తెలిపారు.
కొత్తగా నిర్మాణదశను పూర్తి చేసుకొని ప్రారంభించుటకు సిద్ధముగా ఉన్న హౌసింగ్ బోర్డు కాలని, లాలాచెరువు రైతుబజారు నందు మొత్తం 6(ఆరు) స్టాల్స్ వాణిజ్య ప్రయోజనార్ధం అద్దె ప్రాతిపదికన కేటాయించుటకు నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు. వీటిలో స్వయం సహాయక సంఘాలకు అద్దె ప్రాతిపదికన 5(ఐదు) కొట్లు, దివ్యాంగుల కోటాలో రైతు సంఘం వారికి 1 (ఒకటి) స్టాల్ కోసం దరఖాస్తు కోసం దరఖాస్తులను ఆహ్వానించడమైనది.
ఆసక్తి ఉన్న వారు జిల్లా వ్యవసాయ వాణిజ్య & మార్కెటింగ్ అధికారి, కోరుకొండ రోడ్, రాజమహేంద్రవరం మామిడిపళ్ళ మార్కెట్ నందు వారి కార్యాలయములో కార్యాలయ పని వేళల యందు ఉ.10.30 గం.ల నుంచి సా. 05.00 గం. ల లోపుగా దరఖాస్తు చేసుకోగలరు. దరఖాస్తు రుసుము రూ.100/-లు చెల్లించి తీసుకున్న దరఖాస్తులు అందచేయుటకు చివరి ఫిబ్రవరి 15 వ తేదీ అని తెలియచేశారు.
addComments
Post a Comment