జిల్లాలో జగనన్న విదేశీ విద్యాదీవెన కింద ముగ్గురు విద్యార్థుల ఎంపిక

 *జగనన్న విదేశీ విద్యాదీవెన ప్రారంభం*


*: జిల్లాలో జగనన్న విదేశీ విద్యాదీవెన కింద ముగ్గురు విద్యార్థుల ఎంపిక


*


*: జిల్లా కలెక్టర్ పి.బసంత్ కుమార్*


పుట్టపర్తి (శ్రీ సత్యసాయి జిల్లా), ఫిబ్రవరి 03 (ప్రజా అమరావతి):


తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జగనన్న విదేశీ విద్యా దీవెన పథకాన్ని ప్రారంభించే కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు.


పుట్టపర్తి కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ పి.బసంత్ కుమార్, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ, ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ రమణారెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ ఇన్చార్జి డిడి శ్రీరాములు, బీసీ వెల్ఫేర్ అధికారి నిర్మలా జ్యోతి, ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ మోహన్ రామ్, పుట్టపర్తి ఎంపిపి రమణా రెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ సూపరింటెండెంట్ ఈరన్న, బిసి వెల్ఫేర్ సూపరింటెండెంట్ హరిత, విద్యార్థినీ విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.


జిల్లాలో జగనన్న విదేశీ విద్యాదీవెన కింద ముగ్గురు విద్యార్థుల ఎంపిక : జిల్లా కలెక్టర్ పి.బసంత్ కుమార్.


జిల్లాలో జగనన్న విదేశీ విద్యాదీవెన కింద ముగ్గురు విద్యార్థులు ఎంపిక కావడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి.బసంత్ కుమార్ పేర్కొన్నారు. జిల్లాలోని ఓడిచెరువు మండలం పగడలవారిపల్లి గ్రామానికి చెందిన ధర్మవరం అనిత D/o డి. గంగులప్ప, కొత్తచెరువు మండలం బసవన్నకట్ట స్ట్రీట్ లోని కె. రాజశేఖర్ రెడ్డి S/o కె. శివారెడ్డి, పెనుకొండ మండలం కొండంపల్లి గ్రామానికి చెందిన గుండపనేని భార్గవ్ సాయి S/o జి. శ్రీహరి అనే విద్యార్థులు జగనన్న విదేశీ విద్యాదీవెన పథకం కింద ఎంపిక కావడం జరిగిందన్నారు.


జిల్లాలో ఈ పథకం కింద ఏడు మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడం జరిగిందని, వచ్చిన దరఖాస్తులను పరిశీలించి స్టేట్ సెలక్షన్ కమిషన్ కి పంపగా, అందులో ప్రస్తుతానికి ముగ్గురు మాత్రమే ఎంపికయ్యారన్నారు. జిల్లాలోని పరిగి మండలం శ్రీరంగారాజుపల్లి గ్రామానికి చెందిన ముత్తాల మారుతీరెడ్డి S/o ఎం. గోవిందరెడ్డి, హిందూపురం పట్టణంలోని 10వ వార్డులో ఉంటున్న ఆర్. విష్ణు సాయిరాయలు S/o ఆర్. సుబ్రహ్మణ్యం దరఖాస్తులు సెలక్షన్ లో ఉన్నాయన్నారు. మరో ఇద్దరి దరఖాస్తులు వివిధ కారణాల చేత రిజెక్ట్ కావడం జరిగిందన్నారు.


జగనన్న విదేశీ విద్యాదీవెన పథకం కింద ప్రపంచంలో టాప్ 200 లోపు క్యూఎస్ వరల్డ్ ర్యాంకుల్లో ఉన్న విదేశీ విశ్వవిద్యాలయాలు / విద్యాసంస్థల్లో పీజీ, పీహెచ్డి, ఎంబిబిఎస్ అభ్యసించాలనుకునే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈ బీసీ, కాపు విద్యార్థులకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేయడం జరుగుతుందన్నారు. ప్రపంచంలో టాప్ 100 లోపు ర్యాంకు గల విశ్వవిద్యాలయాలు/ విద్యాసంస్థల్లో ప్రవేశం పొందితే ప్రభుత్వమే 100 శాతం ఫీజు చెల్లిస్తుందని, 101 నుంచి 200 ర్యాంక్ కలిగిన వాటిలో అడ్మిషన్ పొందితే రూ.50 లక్షలు లేదా 50 శాతం ఫీజుల్లో ఏది తక్కువ అయితే అది ప్రభుత్వం భరిస్తుందన్నారు. ఫీజును నాలుగు విడతలుగా మంజూరు చేయడం జరుగుతుందన్నారు. విదేశీ విద్యాదీవెన పథకం కింద ఎంపికైన విద్యార్థులు ఉన్నతంగా చదువుకొని ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.


ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ, ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ రమణారెడ్డిలు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణాలకు చెందిన పేద విద్యార్థులు ప్రపంచంలోనే టాప్ యూనివర్సిటీలలో ఉన్నత విద్యా కోర్సులను చదివేందుకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించడం కోసం జగనన్న విదేశీ విద్యాదీవెన పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు. జగనన్న ప్రభుత్వంలో అర్హులైన విద్యార్థులందరికీ సంతృప్తి స్థాయిలో జగనన్న విదేశీ విద్యాదీవెన కింద ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతోందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగనన్న విద్యకు పెద్దపీట వేస్తున్నారన్నారు. విదేశాలకు వెళ్లే విద్యార్థులు కోర్సు పూర్తి చేసుకునేలా వారు చదువులు ఒక్కో మెట్టు ఎక్కే కొద్ది నాలుగు వాయిదాలలో స్కాలర్ షిప్స్ మంజూరు చేస్తున్నారన్నారు. విద్యార్థులంతా బాగా ఉన్నత చదువులు చదువుకోవాలన్నారు.


అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులకు 27,17,009 రూపాయల మెగా చెక్కును జిల్లా కలెక్టర్, జడ్పీ చైర్పర్సన్, తదితరులు అందజేయడం జరిగింది.


Comments