ఇళ్ల నిర్మాణం ముమ్మరం చేయాలి

 *ఇళ్ల నిర్మాణం ముమ్మరం చేయాలి


*


*: జిల్లా కలెక్టర్ పి.బసంత్ కుమార్*


*: చెన్నేకొత్తపల్లి మండలంలోని మేడాపురం వద్దనున్న జగనన్న హౌసింగ్ లేఔట్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్*


చెన్నేకొత్తపల్లి (శ్రీ సత్యసాయి జిల్లా), ఫిబ్రవరి 04 (ప్రజా అమరావతి):


ఇళ్ల నిర్మాణం మరింత ముమ్మరం చేయాలని జిల్లా కలెక్టర్ పి.బసంత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం చెన్నేకొత్తపల్లి మండలంలోని మేడాపురం వద్దనున్న జగనన్న హౌసింగ్ లేఔట్ లో ఇళ్ల నిర్మాణాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.


ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు కింద జగనన్న హౌసింగ్ లేఔట్లలో ఇళ్ల నిర్మాణం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగిందన్నారు. మేడాపురం జగనన్న హౌసింగ్ లేఔట్ లో 183 ఇళ్లు మంజూరుకాగా, అప్షన్ -1, 2 కింద ఇళ్ల నిర్మాణంలో మరింత వేగం పెంచాలని, సంబంధిత లబ్ధిదారులకు అవగాహన కల్పించాలన్నారు. ఇందులో 63 ఇళ్లు అప్షన్-3 కింద నిర్మాణం చేపట్టడం జరగగా, వాటి నిర్మాణం వేగవంతం చేయాలన్నారు. అప్షన్-3 కింద చేపట్టిన 63 ఇళ్లు రూఫ్ లెవెల్ కి రాగా, సంబంధిత ఏజెన్సీ తో మాట్లాడి త్వరితగతిన టాప్ వేసేలా చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అసిస్టెంట్ లను, అధికారులను ఆదేశించారు. లేఔట్ లో మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండడంతో ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఈఈ చంద్రశేఖర్, డిఈ శంకర్ లాల్, ఏఈ హరినాయక్, ఎంపిడిఓ అశోక్ నాయక్, ఇంజనీరింగ్ అసిస్టెంట్ లు, తదితరులు పాల్గొన్నారు.



Comments