అమరావతి (ప్రజా అమరావతి);
*సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి టూరిస్ట్ పోలీస్ స్టేషన్లను వర్చువల్‌గా ప్రారంభించిన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్*
*ఈ సందర్భంగా మాట్లాడిన హోంమంత్రి తానేటి వనిత ఏమన్నారంటే...ఆమె మాటల్లోనే*
*తానేటి వనిత, హోంమంత్రి*
ఈ రోజు మన పోలీస్ శాఖలో టూరిస్ట్‌లకు సహాయం చేయడం కోసం టూరిస్ట్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటుచేయడం సంతోషకరం, మన రాష్ట్రానికి ఇతర దేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి టూరిస్ట్‌లు వచ్చినప్పుడు వారికి ఎలాంటి ఇబ్బంది ఎదురైనా మేమున్నామంటూ మనం సహాయం చేయడం కోసం ఈ స్టేషన్లు ఏర్పాటు
చేయడం జరిగింది. ఈ కియోస్క్‌ల ద్వారా అవసరమైన సమాచారం ఇవ్వడం, వాహనాలు అందించడం, ఫస్ట్ ఎయిడ్ అవసరమైతే చేయడం, ఇంకా ఏమైనా అత్యవసరమైన సహాయం చేయడం కోసం ఇవి ఏర్పాటుచేయడం శుభపరిణామం. ఈ నిర్ణయం గర్వించదగినది, మహిళల భద్రత కోసం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు (సీఎం) తీసుకున్న నిర్ణయాలు చాలా గొప్పవి. దిశ యాప్, దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటుచేశారు, దిశ చట్టాన్ని కూడా తీసుకొచ్చారు, మహిళలు సీఎంగా ఉన్న రాష్ట్రాలలో కూడా ఇలాంటి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకోవడం లేదు, మహిళలకు మీరు చేస్తున్న కార్యక్రమాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉన్నాయి. మీ (సీఎం) ఆధ్వర్యంలో రాష్ట్రం మరింతగా అభివృద్ది పథంలో నడవాలని కోరుకుంటున్నాను, ధ్యాంక్యూ.
addComments
Post a Comment