రాష్ట్ర సృజనాత్మకత & సాంస్కృతిక సమితి క్రియేటివ్ హెడ్ గా బాధ్యతలు చేపట్టిన ఎల్.జోగినాయుడు.
అమరావతి, ఫిబ్రవరి 22 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మక మరియు సాంస్కృతిక సమితి క్రియేటివ్ హెడ్ గా సినీ నటుడు, దర్శకుడు మరియు వ్యాఖ్యాత ఎల్.జోగినాయుడు బుధవారం బాధ్యతలు చేపట్టారు. వెలగపూడి ఆంధ్రప్రదేశ్ సచివాలయం నాల్గో బ్లాక్ లోని రాష్ట్ర యువజనాభివృద్ది, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డా.రజత్ భార్గవ చాంబరులో ప్రమాణ స్వీకారం చేసి తదుపరి ఆయన ఈ బాధ్యతలను చేపట్టారు. రాష్ట్రంలో సాంస్కృతిక పురోగతి, తెలుగు భాషాభివృద్ది, పద్య మరియు ఆధునిక నాటక వికాసం, జానపద కళారూపాల అభివృద్ది మరియు ఆధునీకరణ తదతర కార్యక్రమాలను వ్యూహాత్మకంగా నిర్వహించేందుకై రాష్ట్ర సృజనాత్మక మరియు సాంస్కృతిక సమితి క్రియేటివ్ హెడ్ గా ఎల్.జోగినాయుడు ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జి.ఓ.ఆర్టి.నెం.46 ను ఈ నెల 17 న జారీచేసిన చేయడం జరిగింది. ఈ నియామక ఉత్తర్వులను అనుసరించి ఎల్.జోగినాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మక మరియు సాంస్కృతిక సమితి క్రియేటివ్ హెడ్ గా బాధ్యతలు చేపట్టడం జరిగింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బెవరేజస్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ డి. వాసుదేవరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
addComments
Post a Comment