హైదరాబాద్ (ప్రజా అమరావతి): తెదేపా వ్యవస్థాపకుడు, దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ శత జయంత్యుత్సవాల వేళ కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఎన్టీఆర్ బొమ్మతో రూ.100 వెండినాణెం ముద్రణకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు హైదరాబాద్‌లో ఎన్టీఆర్ కుమార్తె, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి నుంచి మింట్ అధికారులు సలహాలు, సూచనలను స్వీకరించారు.
ఎన్టీఆర్ పేరిట నాణెం తీసుకురావాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ను కోరానని ఈ సందర్భంగా పురందేశ్వరి చెప్పారు. నిర్మలా సీతారామన్ వ్యక్తిగతంగా చొరవ తీసుకున్న నేపథ్యంలో మింట్ నుంచి ఆమోదం వచ్చిందని.. సంబంధిత అధికారులు 3 ఫొటోలను పరిశీలించారని తెలిపారు. నాణెం రూపకల్పన ప్రొసీజర్‌కు నెలరోజుల సమయం పడుతుందని.. ఆ తర్వాతే విడుదల చేస్తారని ఆమె వివరించారు. తన తండ్రి ఆశీర్వాదం వల్లే ఇది సాధ్యమైందని.. దీన్ని అదృష్టంగా భావిస్తున్నట్లు పురందేశ్వరి చెప్పారు.
addComments
Post a Comment