*టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ 27వ వర్థంతి కార్యక్రమంలో పాల్గొన్న అధినేత నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, ఇతర సీనియర్ నేతలు*
*ఎన్టీఆర్ విగ్రహానికి పూలు వేసి నివాళులు అర్పించిన చంద్రబాబు నాయుడు*
*వర్ధంతి సభలో పార్టీ అధినేత చంద్రబాబు ప్రసంగం:-*
• తెలుగు ప్రజలు ఎల్లకాలం గుర్తుంచుకునే వ్యక్తి ఎన్టీఆర్.
• ఒక యుగపురుషునిగా, కారణ జన్ముడిగా ఉన్న వ్యక్తి ఎన్టీఆర్.
• తెలుగు వారి ఆస్తి, తెలుగు వారి వారసత్వం ఎన్టీఆర్.
• ఒక సాధారణ కుటుంబంలో పుట్టి...అసాధారణ విజయాలు సాధించిన వ్యక్తి ఎన్టీఆర్.
• ఒక వ్యక్తి ఒక రంగంలోనే రాణిస్తారు....కానీ ఎన్టీఆర్ అటు సినిమా రంగంలో..ఇటు రాజకీయ రంగంలో కూడా ఎంతో ఉన్నత స్థాయికి వెళ్లారు.
• ఎన్టీఆర్ సినిమా రంగంలో పోషించిన పాత్రలు ఎవరూ పోషించలేరు. ఎంతో ఠీవీ, హుందాతనంతో ఎన్టీఆర్ నటన ఉండేది.
• ఎన్టీఆర్ సినిమాలు అంటే వినోదమే కాదు...సందేశం కూడా ఉండేలా నిర్మించారు.
• నాడు నేను సినిమా ఇండస్ట్రీలో ఉన్న సమయంలో నేను సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నాను.
• అనురాగదేవత సినిమా షూటింగులో తొలిసారి ఎన్టీఆర్ ను కలిశాను.
• నా తొలి భేటీలోనే ఆయన ప్రజాసేవ గురించి వ్యాఖ్యానించారు.
• ఒక సినిమా నటుడిగా వచ్చి....తరువాత కాలంలో రాజకీయాలను సమూలంగా మార్చిన వ్యక్తి ఎన్టీఆర్.
• ఈ ఏడాది తెలుగుదేశం 40 ఏళ్లు పూర్తి చేసుకుంది.... ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం.
• ఎన్టీఆర్ స్ఫూర్తి భావితరాలకు కూడా ఆదర్శం. మీ పార్టీ సిద్దాంతం ఏమిటంటే సమాజమే దేవాలయం...ప్రజలే నా దేవుళ్లు అని చెప్పిన నాయకుడు ఎన్టీఆర్.
• సమాజంలో ప్రజల రూపంలో దేవుడిని చూసిన వ్యక్తి ఎన్టీఆర్.
• అతిపెద్ద సంస్కరణ వాది ఎన్టీఆర్. ఆడబిడ్డల విద్యను ప్రోత్సహించాలని పద్మావతి యూనివర్సిటీ పెట్టారు.
• మహిళలకు రాజకీయాల్లో రిజర్వేషన్లు తీసుకువచ్చింది కూడా ఆయనే. నేడు మహిళలు కూడా అన్ని రంగాల్లో రానిస్తున్నారు అంటే దానికి నాంది పలికి.. అమలు చేసింది ఎన్టీఆర్.
• రాజకీయాల్లో పెత్తందారులు కాదు...చదువుకున్న వారిని తీసుకొచ్చి సీట్లు ఇచ్చిన నేత ఎన్టీఆర్.
• బిసిలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం ఇవ్వడం కోసం 29 ఏళ్ల వయసులో యనమల రామకృష్ణుడు వంటి వారిని క్యాబినెట్ లోకి తీసుకున్నారు.
• బెస్ట్ అడ్మినిస్ట్రేటర్, బెస్ట్ క్రియేటర్ సిఎంలలో అగ్రస్థానంలో ఎన్టీఆర్ ఉంటారు. అయితే ఇప్పుడు అతి పెద్ద విధ్వంసకులైన సిఎం ఎవరైనా ఉన్నారంటే అది జగన్ రెడ్డే.
• సింగిల్ విండో విధానం, రెండు రూపాయలకే కేజీ బియ్యం వంటి పథకాలకు నాంది పలికింది ఎన్టీఆర్
• తెలుగు గంగ, ఎస్ఎల్బిసి, ఎస్ఆర్బిసి వంటి అనేక ఇరిగేషన్ పథకాలకు నాంది పలికిన నేత ఎన్టీఆర్.
• ఇరిగేషన్ కు తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడూ ప్రాధాన్యం ఇచ్చేది. 2014 నుంచి 2019 వరకు రూ.64 వేల కోట్లు ఇరిగేషన్ పై ఖర్చు చేశాం.
• 72 శాతం పూర్తి చేసిన పోలవరాన్ని నేటి ముఖ్యమంత్రి గోదావరిలో కలిపేశాడు.
• వ్యవసాయ రంగంతోనే భవిష్యత్ అని నాడు గుర్తించి ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం టిడిపి.
• తెలుగు ప్రజలకు ఎన్టీఆర్ ఆత్మగౌరవం ఇస్తే...తరువాత కాలంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లేలా నేను పనిచేశాను.
• సంస్కరణలతో ప్రజల జీవితాలు మార్చిన పాలన తెలుగుదేశం పాలన. నాడు ఇచ్చిన రెండు రూపాయల కిలో బియ్యం...ఇప్పుడు దేశంలో ఆహార భద్రత పథకం అయ్యింది. నాడు మహిళలకు ఇచ్చిన ఆస్థి హక్కు ఇప్పుడు దేశంలో చట్టం అయ్యింది.
• బడుగు వర్గాలకు దేశంలో తొలిసారి గురుకుల పాఠశాలలు పెట్టింది టిడిపి. ఇప్పుడు అవే హాస్టల్స్ గా మారిన పరిస్థితి.
• అయితే ఇప్పుడు స్కూళ్లకు రంగులు వేసిన ఈ ప్రభుత్వం విద్యా ప్రమాణాలు గురించి మాత్రం పట్టించుకోవడం లేదు
• ప్రభుత్వం తీసుకున్న పాఠశాలల విలీనం కారణంగా 4 లక్షల మంది విద్యార్థులు పాఠశాలలకు దూరం అయ్యారు.
• ఎన్టీఆర్ మనకు గట్టిగా ప్రశ్నించే విధానాన్ని, చైతన్యాన్ని అందించారు. ఇప్పుడు అదే స్ఫూర్తితో ఈ ప్రభుత్వాన్ని మనం ప్రశ్నించాలి.
• ఇప్పుడు మన పర్యటలను అడ్డుకుంటున్న ప్రభుత్వాన్ని మనం అంతే గట్టిగా ప్రశ్నించాలి. మనం మీటింగ్ లు పెట్టుకుంటే ఎందుకు పోలీసుల భద్రత ఇవ్వడం లేదు.?
• కందకూరులో అంత మంది జనం వస్తే పోలీసులు ఎందుకు బందోబస్తు ఇవ్వలేదు..?
• ప్రభుత్వంపై వ్యతిరేకతతో జనం మన సభలకు తరలివస్తున్నారు. అయితే ఇప్పుడు జీవో నెంబర్ 1 తెచ్చి మనల్ని అడ్డుకుంటున్నారు.
• మనకు ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ఉంది...దాన్ని అడ్డుకునే హక్కు ప్రభుత్వానికి ఎక్కడ ఉంది..?
• ఈ రోజు ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా పిలుపునిస్తున్నా...ప్రతి కుటుంబం నుంచి ఒకరు రాజకీయాల్లోకి రావాలని పిలుపు నిస్తున్నా.
• నాకెందుకు రాజకీయం అని ఎన్టీఆర్ నాడు అనుకుని ఉంటే ఏమయ్యేది..? ప్రజలు అంతా ఆలోచించాలి.
• పేదవర్గాలను అదుకునేందుకు ప్రభుత్వాలు ఎప్పుడూ ప్రత్యేక కార్యక్రమాలు తీసుకోవాలి.
• వైసిపి ప్రభుత్వం వచ్చిన తరువాత బిసిల సబ్ ప్లాన్ నిధులు ఏం చేస్తున్నారు.?వారి కోసం ఖర్చుచేయాల్సిన నిధులను మళ్లించారు.
• సంక్షేమం, అభివృద్ది, సామాజిక న్యాయం సమభాగంలో ఉంటేనే సుస్థిర అభివృద్ధి.
• తిరుమలలో నాడు భక్తులకు అన్నదాన కార్యక్రమం ప్రవేశపెట్టింది ఎన్టీఆర్...దానిని స్ఫూర్తిగా తీసుకుని నేను అన్నా క్యాంటీన్ పెట్టాను.
• పేదలకు అన్నా క్యాంటీన్ పెట్టడం తప్పా.? పేద విద్యార్థుకలు విదేశీ విద్య అవకాశాలు కల్పిస్తే తప్పా.? ఇవన్నీ ఈ ప్రభుత్వం ఎందుకు రద్దు చేసింది..?
సంక్షేమాన్ని పక్కన పెట్టి...ఈ ప్రభుత్వం బాదుడే బాదుడు...ప్రజలపై వీర బాదుడు బాదేస్తోంది.
• అవినీతిపై టిడిపి కఠినంగా ఉండేది....కానీ జగన్ వచ్చిన తరువాత అవినీతిని కేంద్రీకరణ చేశాడు.
• మద్యం, ఇసుక ఆదాయం అంతా జగన్ దగ్గరకే రావాలి. సాయంత్రం అయితే జగన్ అవినీతి సొమ్ము లెక్కించుకుంటున్నాడు.
• పేదల రక్తం తాగే జలగ ఈ జగన్ మోహన్ రెడ్డి...మద్యం అమ్మకాల్లో నీ సొంత బ్రాండ్లు ఎందుకు అని ప్రశ్నించాం...కానీ జగన్ మారలేదు.
• నాణ్యత లేని మద్యంతో ప్రజల ప్రాణాలు పోతున్నా జగన్ రెడ్డికి పట్టడం లేదు.
• పుంగనూరులో రౌడీ రాజకీయం చేస్తున్నారు. వైసిపి తప్పులను ప్రశ్నించిన టిడిపి వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారు.
• మొన్న జరిగిన ఘటనలో చదువుకుంటున్న విద్యార్థులపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపారు.
• మైనారిటీ యువకులను జైల్లో తీవ్రంగా హింసించారు. దెబ్బలు కనపడకుండా కొట్టి టిడిపి కార్యకర్తలను దారుణంగా హింసించారు.
• పోలీసులు ఇంత రాక్షసంగా వ్యవహరించడం ఎప్పుడూ చూడలేదు.తమ బిడ్డలపై జరిగిన హింసపై మైనారిటీ మహిళల బాధలు చూస్తే గుండె తరుక్కుపోయింది.
• రాష్ట్రంలో ఈ తరహా పోలీసు టార్చర్ ఎప్పుడూ లేదు. రాష్ట్రంలో ప్రభుత్వం ప్రేరేపిత ఉగ్రవాదం నడుస్తోంది.
• ఎన్టీఆర్ నాడు భయపడి ఉంటే రాజకీయ పార్టీ పెట్టేవారు కాదు. ఆయనపైనా నాడు కేసులు పెట్టారు. అయినా ఎదిరించి నిలబడ్డారు.
•రూ. 10 లక్షల కోట్లు అప్పులు చేసిన ఈ ప్రభుత్వం కనీసం జీతాలు కూడా ఇవ్వలేకపోతోంది.
• రాష్ట్రంలో రూ.500 నోట్లు కనిపించడం లేదు. ఆ నోట్లు అన్నీ జగన్ దాచేస్తున్నాడు
• డబ్బుతో ఎన్నికల్లో గెలవాలి అని జగన్ చూస్తున్నాడు కానీ డబ్బుతో జగన్ కు ఓట్లు వేసే పరిస్థితి లేదు.
• ఎన్టీఆర్ పేరుతో ఉన్న ఎన్టీఆర్ యూనివర్సిటీకి పేరును తొలగించిన సిఎం...వైఎస్ ఆర్ యూనివర్సిటీ అని పెట్టాడు.
• నాడు నేను అనుకుంటే కడపలో ఉన్న వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ పేరు తీసేసే వాడిని కదా. కానీ మేము అలా వ్యవహరించలేదు.
• ప్రజా వేదిక కూల్చినప్పుడే జగన్ ను ప్రజలు ప్రశ్నించి ఉంటే నేడు ఈ పరిస్థితి ఉండేది కాదు.
• ప్రజలు ప్రభుత్వ తప్పిదాలను పశ్నించాలి....కార్యకర్తలు పార్టీ కోసం పునరంకితం కావాలి.
• ఎక్కడ తెలుగు జాతి ఉంటే అక్కడ తెలుగుదేశం ఉంటుందనేది అంతా తెలుసుకోవాలి.
• ఎన్టీఆర్ ఆశించిన పేదరికం లేని సమాజాన్ని నిర్మించాలి. అందుకు కోసం సైకో పాలన పోవాలి...సైకిల్ పాలన కావాలి
• రేపు జరిగే ఎన్నికలు చాలా కీలకం....వచ్చే ఎన్నికల్లో జగన్ ఒక పక్క...5 కోట్ల ప్రజలు ఒక పక్క
• ఎన్టీఆర్ కు నిజమైన నివాళి అర్పించడం అంటే...ఆయన ఆశయ సాధనకు పనిచేయడమే.
• భువనేశ్వరి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు...బాలకృష్ణ క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా సేవ చేస్తున్నారు. ఎన్టీఆర్, బసవతారకం పేరున సేవ చేయడం అభినందనీయం.
addComments
Post a Comment