డాక్టర్ గున్నం మధుమోహన్ ను రాష్ట్ర ఆరోగ్య వైద్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎం. టి. కృష్ణ బాబు అభినందించారు.




నెల్లూరు జనవరి 19 (ప్రజా అమరావతి);



జిల్లాలోని వింజమూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులుగా పనిచేస్తున్న డాక్టర్ గున్నం మధుమోహన్ ను రాష్ట్ర ఆరోగ్య వైద్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎం. టి. కృష్ణ బాబు అభినందించారు.




డాక్టర్ జి మధు మోహన్ మారుమూల ప్రాంతమైన వింజమూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో తన భార్య సుజాతను ఈనెల 11వ తేదీన చేర్పించి అక్కడి వైద్య సదుపాయాలను వినియోగించుకొని తన భార్యకు విజయవంతంగా కాన్పు నిర్వహించారు. ఆమె ఒక ఆడబిడ్డను ప్రసవించింది.

తల్లి బిడ్డ సురక్షితంగా ఉన్నారు


ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర ఆరోగ్య వైద్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి

ఈ మేరకు డాక్టర్ జి. మధుమోహన్ ను అభినందిస్తూ  గురువారం స్వయంగా లేఖ రాశారు.


ప్రభుత్వ వైద్య సంస్థల్లో మెరుగైన వైద్య సదుపాయాలు ఉన్నాయని సామాన్య ప్రజల్లో గొప్ప విశ్వాసాన్ని  నింపి స్ఫూర్తిదాయకంగా నిలిచారని ఆ లేఖలో ప్రధాన కార్యదర్శి పేర్కొన్నారు.


వారి సతీమణి కి శుభాకాంక్షలు తెలుపుతూ బిడ్డకు శుభాశీస్సులు అందిస్తున్నామని అందులో పేర్కొన్నారు.




ఈ సందర్భంగా  ప్రభుత్వ ఆసుపత్రుల సేవల జిల్లా సమన్వయకర్త డాక్టర్ రమేష్ నాథ్  మాట్లాడుతూ డాక్టర్ మధుమోహన్ను జిల్లా కలెక్టర్  శ్రీ కెవిఎన్ చక్రధర్ బాబు కూడా అభినందించారన్నారు. జిల్లా కలెక్టర్ ప్రోత్సాహంతో జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన వైద్య సేవలు అందించడానికి అవసరమైన అన్ని సదుపాయాలు సమకూర్చడం జరిగిందన్నారు.  అంతేకాకుండా జాతీయ రహదారి నుండి వింజమూరు గ్రామానికి సిమెంట్ రహదారి నిర్మాణం కోసం జిల్లా కలెక్టర్  జిల్లా గనుల నిధి నుండి 50 లక్షల రూపాయలు మంజూరు చేశారని ఆ నిధులతో నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. గతంలో ఇక్కడ కాన్పులు జరిగేవి కావని గత ఏప్రిల్ మాసం నుండి ఇప్పటివరకు ఇరవై ఒక్క కాన్పులు జరగడం గొప్ప విశేషం అన్నారు. ఈ కేంద్రంలో డాక్టర్ మధుమోహన్ తో పాటు బిల్లా శ్వేత విధులు నిర్వహిస్తున్నారని డాక్టర్ రమేష్ నాథ్ తెలిపారు. 



Comments