ఆకట్టుకున్న రంగవల్లుల పోటీ
నేడు శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు
విజయనగరం, జనవరి 12 (ప్రజా అమరావతి) ః
సంక్రాంతి సంబరాల్లో భాగంగా, స్థానిక శిల్పారామంలో జిల్లా యంత్రాంగం గురువారం ఏర్పాటు చేసిన రంగవల్లుల పోటీలు ఆకట్టుకున్నాయి. పెద్ద సంఖ్యలో మహిళలు, బాలికలు హాజరై పోటీలో పాల్గొని, పోటాపోటీగా రంగవల్లులను తీర్చిదిద్దారు. ఉత్తమ రంగవల్లులను ఎంపిక చేసి, శుక్రవారం జరిగే సంక్రాంతి సంబరాల్లో బహుమతులు అందజేయనున్నారు. జిల్లా స్త్రీ శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీలను ఆర్‌డిఓ ఎంవి సూర్యకళ, డిఆర్‌డిఏ పిడి ఎ.కల్యాణచక్రవర్తి, ఎపిడి సావిత్రి, మెప్మా పిడి సుధాకరరావు, జిల్లా పర్యాటకాధికారి పిఎన్‌వి లక్ష్మీనారాయణ, ఐఅండ్‌పిఆర్ ఎడి డి.రమేష్, ఇతర అధికారులు పర్యవేక్షించారు.
*నేడు శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు*
సంక్రాంతి సంబరాలను శుక్రవారం శిల్పారామంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 10 గంటలకు హరిదాసు కీర్తనలతో సంక్రాంతి సంబరాలు ప్రారంభమవుతాయి. దీనిలో భాగంగా సంప్రదాయ పిండివంటల ప్రదర్శన, గంగిరెద్దులు, గాలిపటాల ప్రదర్శన, కోలాటం, చెక్క భజన తదితర సాంస్కృతిక కార్యక్రామలు జరుగుతాయి.
సాయంత్రం 4 గంటల నుంచి సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన, సంప్రదాయ వస్త్రధారణ పోటీలు ఉంటాయి. ఈ కార్యక్రమాల్లో జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులతో పాటు, వివిధ సాంస్కృతిక సంస్థలు పాల్గొంటాయి. ఈ కార్యక్రమాల్లో పెద్ద ప్రజలంతా ఎత్తున పాల్గొని, విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఏ.సూర్యకుమారి ఒక ప్రకటనలో కోరారు.
addComments
Post a Comment