జగన్ పాలనలో మైక్రో ఇరిగేషన్, డ్రిప్ ఇరిగేషన్, హంద్రీనీవా, పౌల్ట్రీ రంగం కుదేలు

 *హార్టీకల్చర్, సెరీకల్చర్ రైతులతో యువనేత ముఖాముఖి*

కుప్పం (ప్రజా అమరావతి);

జగన్ పాలనలో మైక్రో ఇరిగేషన్, డ్రిప్ ఇరిగేషన్, హంద్రీనీవా, పౌల్ట్రీ రంగం కుదేలు


.

గతంలో సజ్జలు, సామలు, రాగులు పండించే వారు. చంద్రబాబు వచ్చాక హార్టీకల్చర్, అగ్రికల్చర్ చేయాలని ప్రోత్సహించారు.

కూరగాయలు, పండ్లు పండించేలా అనేక సౌకర్యాలు, వసతులు తీసుకొచ్చారు.

వ్యవసాయరంగంలో రైతులకు గిట్టుబాటుకాని పరిస్థితుల్లో పాడిరంగాన్ని తెచ్చి చంద్రబాబు ఆదుకున్నారు.

మేం పండించే పంటలకు గిట్టుబాటు ధరలు రావడం లేదు. తమిళనాడు వెళ్లి పంటలు అమ్ముకోవాల్సి వస్తోంది.

సబ్సిడీలు పెంచితే రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

టమోటా ప్రాసెసింగ్ సెంటర్ తెస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఖచ్చితంగా కావాలి.

950టన్నుల కోల్డ్ స్టోరేజి కి అనుమతి వచ్చింది. 250టన్నులదే ప్రారంభిస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది.

మాకు పెద్ద కోల్డ్ స్టోరేజ్ కావాలి

*విజయ్ కుమార్, పౌల్ట్రీ రైతు:*

వి.కోట పరిధిలో 450 పౌల్ట్రీ షెడ్లు ఉన్నాయి.

కంపెనీలన్నీ కుమ్మక్కై రైతులను కుదేలు చేస్తున్నాయి. గ్రేడింగ్ చార్జీలు తగ్గించేశారు.

పక్క రాష్ట్రాల్లో లోన్లు, సబ్సిడీలు ఇస్తున్నారు. మన రాష్ట్రంలో ఇవ్వడం లేదు.

పౌల్ట్రీ కి ఇచ్చే కరెంట్ ను కమర్షియల్ చేశారు..డొమెస్టిక్ చేసి ఆదుకోవాలి.

కంపెనీలన్నింటినీ అదుపు చేసి, క్రోడీకరించి గ్రేడింగ్ చార్జీలు పెంచేలా చర్యలు తీసుకోవాలి.

విద్యుత్ చార్జీలు 8-9రూ. ఉంది. గత పాలనలో 4-6రూ. ఉండేది.

శ్లాబ్ దాటితే 14-15రూ. పడుతోంది.

పౌల్ట్రీ రైతులను తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక ఆదుకోవాలి.

*నాగభూషణం, ఆనంద్ సెరీకల్చర్ రైతులు:*

కుప్పంలో సెరీకల్చర్ అధికంగా ఉంది.

చంద్రబాబు పాలనలో సెరీకల్చర్ లో రూ.6లక్షల నుండి రూ.10లక్షలు షెడ్లకు సబ్సిడీ ఇచ్చారు.

ఈ పాలనలో షెడ్లు ఇవ్వలేదు...సబ్సిడీలు అసలే లేవు.

మల్బరీ ఆకును ఇజ్రాయెల్ టెక్నాలజీ ద్వారా చంద్రబాబు తెచ్చారు.

కరెంటు చార్జీలు పెంచడం వల్ల సెరీకల్చర్ నష్టాల్లో కూరుకుపోయింది.

సెరీకల్చర్ ను అభివృద్ధి చేస్తే రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది.

ఏపీలో మార్కెట్ సరిగా లేక కర్నాటకలో అమ్ముకుంటున్నాం.

భూసర్వే చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. దీనివల్ల మేం భూములు కోల్పోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. మీరే మమ్మల్ని ఆదుకోవాలి.

చంద్రబాబు పాలనలో తప్ప...వైసీపీ పాలనలో సెరీ కల్చర్ రైతులకు చేసిందేమీ లేదు.

రైతులకు పథకాలు అందించడంలోనూ పార్టీ బేధాలు చూపించి వేధిస్తున్నారు.


*చిన్నికృష్ణ:* జగన్ టమాటా ప్రాసెసింగ్ సెంటర్ పెడతామని చెప్పారు. చేయలేదు.

పూలు మంచి ధర పలుకుతున్నాయి. దాన్ని మరింత అభివృద్ధి చేస్తే రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది.

హార్టీకల్చర్ పంటలను ఎగుమతి చేసేందుకు విమానాల్లో రవాణాకు సౌకర్యం తెస్తే రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది.

చదువుకున్నవాళ్లు నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. వాళ్లకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలి.

*సాంబశివ, మామిడి రైతు*

కోతులు, అడవి పందులు పంటను నాశనం చేస్తున్నాయి.

సోలార్ ఫెన్సింగ్ సదుపాయాన్ని సబ్సిడీ మీద ఇస్తే మాకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

డ్రిప్ ఇరిగేషన్ లో 90శాతం చంద్రబాబు సబ్సిడీలు ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం నిలిపేసింది.

మార్కెట్ సదుపాయం కల్పిస్తే రైతులకు బ్రహ్మాండంగా లాభాలు వస్తాయి.

అశోక్ కుమార్, దానిమ్మ రైతు:

1999లో ఈ పంటలు వేయడం ప్రారంభించాను.

చంద్రబాబు డ్రిప్ సదుపాయం తెచ్చాక మేం పంటలు వేయడం ప్రారంభించాం.

2002, 2003లో గ్రీన్ హౌస్ లు ఇచ్చారు.

చంద్రబాబు పాలనలో అధికారులు మాకు శిక్షణ ఇచ్చి పంటలు వేయించేవారు. దాని వల్ల మేం లక్షల రూపాయలు సంపాదించడం ప్రారంభించాం. ఈ ఘనత చంద్రబాబుదే.

చంద్రబాబు చేసిన సాయం వల్లే మా పిల్లల్ని చదివించుకుని గొప్పవాళ్లను చేసుకున్నాం.


 *ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు*

హంద్రీనీవా ప్రాజెక్టు సందర్శనకు వెళుతుంటే వైసీపీ నాయకులు మాపై దాడి చేశారు. పోలీసులు మమ్మల్నే అరెస్టు చేశారు. వచ్చేది ఎన్నికల సమయం కాబట్టి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 4ప్రొక్లెయినర్లు ప్రాజెక్టు వద్ద పెట్టి ఏదేదో చేస్తున్నట్లు హడావుడి చేస్తున్నాడు. మనం అధికారంలోకి వచ్చాక హంద్రీనీవాను పూర్తిచేసి రైతులకు అండగా నిలవాలి. రైతులకు ఎంత చేసినా తక్కువే. రైతుకు మేలు జరిగితే మనల్ని గుండెల్లో పెట్టుకుంటారు.


*యువనేత నారా లోకేష్*

చిన్న,సన్నకారు రైతులకు లోన్లు రావడం చాలా కష్టతరమైంది.

ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి కోర్టులో దొంగతనం చేసిన వ్యక్తి.

ఇలాంటి దొంగలకు, దొంగ ప్రభుత్వానికి రైతుల కష్టాలు ఏం తెలుస్తాయి?

రైతాంగం సంక్షోభంలో కూరుకుపోయింది.

గత పాలనలో రైతు రాజ్యం ఏపీ అనేవారు...నేడు జగన్ ఏపీని రైతులేని రాజ్యంగా మారుస్తున్నాడు.

ఈ రైతులే జగన్ ను రాష్ట్రం నుండి తరమి తరిమి కొడతారు.

ప్రపంచమంతా వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తుంది. సబ్సిడీలు ఇస్తూ ప్రోత్సహిస్తారు.

జగన్ రెడ్డి రైతులకు అన్నదాత సుఖీభవ, రైతు భరోసా, రైతుభరోసా కేంద్రాలంటూ జాదూ మంత్రాలతో మోసం చేస్తున్నాడు.

జగన్ అధికారంలోకి రాగానే రైతులకు ఉపయోగపడే డ్రిప్ ఇరిగేషన్, పాడి పరిశ్రమ, సెరీకల్చర్, హార్టీ కల్చర్, ఫ్లోరీ కల్చర్, వ్యవసాయాలకు సబ్సిడీలు ఎగ్గొట్టాడు.

భూసార పరీక్షలు నిర్వహించడానికి ప్రతి నియోజకవర్గంలో పరీక్షా కేంద్రాలు పెడతామని చెప్పాడు. ఇంత వరకు అవి ఎక్కడున్నాయో కనిపించని పరిస్థితి.

జగన్ పాలనలో రైతులకు దెబ్బమీద దెబ్బ తగులుతూనే ఉంది.

రాయలసీమే కాదు ఉభయ గోదావరి జిల్లాల్లో క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితిని జగన్ తీసుకొచ్చారు. రాష్ట్ర చరిత్రలో ఇది ఎన్నడూ జరగలేదు.

ఉభయగోదావరిజిల్లాల్లో ఫిషరీస్ ను చంద్రబాబు తెచ్చి ఆదుకున్నారు.

రైతులకు జగన్ రెడ్డి మోటార్లకు మీటర్లతో ఉరితాళ్లు బిగిస్తున్నాడు.

చిన్న, సన్నకారు రైతులు మీటర్లతో తీవ్రంగా నష్టపోతారు.

చంద్రబాబు పాలన అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యాన పంటలను బలోపేతం చేస్తాం.

హంద్రీనీవాను పూర్తిచేసి ప్రతి ఎకరాకు నీళ్లిస్తాం.

సబ్సిడీలు, సంక్షేమ పథకాలు అందిస్తాం.

చిన్న, సన్నకారు రైతులకు సబ్సిడీ లోన్లు కూడా అందించి ప్రోత్సహిస్తాం.

గతంలో చంద్రబాబు అందించిన ప్రతిసౌకర్యం అధికారంలోకి తీసుకొచ్చిన వెంటనే తీసుకొస్తాం.

డ్రిప్ ఇరిగేషన్ ను ఉపాధిహామీ పథకానికి అనుసంధానం చేసి ఆదుకుంటాం.

Comments