రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి):
ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ కార్డు దారులకు నిత్యావసర సరుకుల పంపిణీ పై క్షేత్ర స్థాయి లో ప్రజల నుంచి అభిప్రాయాలు తెలుసుకోవడం జరిగింద
ని జిల్లా రెవెన్యూ అధికారి జీ. నరసింహులు తెలిపారు.
మంగళవారం ఉదయం రాజమహేంద్రవరం అర్బన్ మండలం లో గల చౌక ధరల దుకాణాలు 0481079, 0481097 లను ఆకస్మికంగా డి ఆర్ వో తనిఖీ చేసి, రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా డిఆర్వో జి. నరసింహులు మాట్లాడుతూ, రాష్ట్ర, కేంద్రం ప్రభుత్వాలు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అంద చేస్తున్న నిత్యావసర సరుకుల పంపిణీ ప్రక్రియను క్షేత్ర స్థాయి లో అమలు చేయడం పై వివరాలు తెలుసుకునే దిశలో చౌక ధరల దుకాణాలను తనిఖీ చేయడం జరిగిందన్నారు. " ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన " కింద కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న బియ్యం పంపిణీ వివరాలు తనిఖీ చేశామన్నారు. మొబైల్ డెలివరీ యూనిట్ వాహనాలు ద్వారా ఇంటింటికీ రేషన్ పంపిణీ చేయడం పై ప్రజల నుంచి స్పందన తెలుసుకున్నట్లు పేర్కొన్నారు. అజాదికా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ఈ తనిఖీలు నిర్వహించామన్నారు.
డి ఆర్వో వెంట రెవెన్యూ, పౌర సరఫరాల క్షేత్ర స్థాయి అధికారులు, సిబ్బంది, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు
addComments
Post a Comment