400 రోజులు, 4వేల కిలోమీటర్లు

 


*400 రోజులు, 4వేల కిలోమీటర్లు


.*

*యువగళం పేరుతో ప్రజలతో మమేకంకానున్న టీడీపీ యువనేతనారాలోకేశ్.*

     

యువగళం పోస్టర్లు, ప్రచారచిత్రాలు ఆవిష్కరించిన టీడీపీనేతలు.

లోకేశ్ గారి పాదయాత్రలో పాల్గొనాలనుకునే వారు *96862 96862* నంబర్ కి మిస్డ్ కాల్ ఇవ్వండి.  లేదా YUVAGALAM.COM పై  సైన్ అప్ చేయండి.

జగన్మోహన్ రెడ్డి మాదిరి సినిమా షూటింగులా, ముందస్తు ప్రణాళికతో పథకంప్రకారం లోకేశ్ పాదయాత్ర జరగదన్న నేతలు. 

బుగ్గలు నిమిరి, ముద్దులుపెట్టి, తలలపై చేతులుపెట్టే మోసకారీ చర్యలు లోకేశ్  పాదయాత్రలో ఉండవని స్పష్టీకరణ. 

ప్రజలకోసం ప్రజలగొంతుకై లోకేశ్ గర్జించబోతున్నాడన్న దేశంనేతలు.


*సైకో పాలనలో తీవ్ర నిరాశానిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్న యువతకు వెలుగురేఖ లోకేశ్ పాదయాత్ర : శ్రీ  కింజరాపు అచ్చెన్నాయుడు (టీడీపీ రాష్ట్రఅధ్యక్షులు)*


ఏ దేశంలో అయినా, ప్రాంతంలో అయినా అభివృద్ధి జరగాలంటే, స్థానిక మానవవనరుల సద్వినియోగంతోనే సాధ్యం.  మానవవనరుల్లో యువత శక్తిసామర్థ్యాలు, మేథాసంపత్తితో అద్భుతఫలితాలు సాధించవచ్చు. విజయసాధకుల్లో యువతదే అగ్రస్థానం. 

ఆంధ్రప్రదేశ్ లోని యువతకు లోకేశ్ గారు నాయకత్వం వహించడం, నిజంగా రాష్ట్రయువలోకం చేసుకున్న అదృష్టం. 

జగన్ రెడ్డి 3ఏళ్ల7నెలల పాలన అన్నివర్గాలకు నిరాశా, బాధ, మనస్తాపం, అంతులేని వేదననే మిగిల్చింది. 

ప్రభుత్వ విధ్వంసకర నిర్ణయాలతో రాష్ట్రంలోని పరిశ్రమలు తరలిపోయాయి. 

2014లో చంద్రబాబుగారు  ముఖ్యమంత్రి అయ్యాక దేశవిదేశాలు తిరిగి రాష్ట్రానికి పరిశ్రమల్ని ఆహ్వానించారు. 

2014-19 మధ్యన 17లక్షలకోట్ల పెట్టుబడులకు పారిశ్రామిక ఒప్పందాలు జరిగాయని, 6లక్షల మందికి ఉద్యోగావకాశాలు టీడీపీప్రభుత్వం కల్పించిందని మంత్రే శాసనమండలిలో చెప్పారు. 

పాదయాత్ర సమయంలో 3.50లక్షల ప్రభుత్వద్యోగాలు భర్తీచేయాల్సి ఉందని, చంద్రబాబు ఆపనిచేయడం లేదని జగన్ దుష్ప్రచారం చేశాడు. 

ఏటా డీఎస్సీ నిర్వహిస్తానని, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానని ఊదరగొట్టాడు.

మూడున్నరేళ్లపాలనలో జగన్ రెడ్డి ఒక్క ప్రభుత్వఉద్యోగం కూడా ఇవ్వలేదు. ఇటువంటి పరిస్థితుల్లో సైకో పాలనలో తీవ్ర నిరాశానిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్న యువతకు వెలుగురేఖ లోకేశ్ పాదయాత్ర. 

ప్రభుత్వ విధానాలతో విసిగిపోయిన యువత బలవన్మరణాలకు పాల్పడుతోంది. ప్రతి 4 రోజులకు ఒక యువకుడు చనిపోతున్నాడు. 

రాష్ట్రంలోని యువతులపై లైంగిక దాడులు ఎక్కువయ్యాయి.

వీటన్నింటికీ కారణం జగన్మోహన్ రెడ్డి పెంచిపోషిస్తున్న డ్రగ్ మాఫియా. 

ప్రపచంలో ఎక్కడ మాదకద్రవ్యాలు దొరికినా, వాటి మూలాలు ఏపీతో కనెక్ట్ అవుతున్నాయి.  ఇలాంటి దౌర్భాగ్యకర పరిస్థితుల్లో రాష్ట్రయువశక్తి నీరుగారిపోవడం దురదృష్టకరం.

  ప్రతిపక్షంలో ఉన్నాకూడా యువతహక్కులు, వారిసమస్యలపై పోరాడేందుకు తెలుగుదేశం సిద్ధమైంది.

యువతకు ఒక వేదిక ఇవ్వడానికి లోకేశ్ గారు ముందడుగు వేయడం నిజంగా శుభపరిణామం.

జనవరి 27న లోకేశ్ ప్రారంభిస్తున్న పాదయాత్ర 5కోట్ల మంది ప్రజల కోసమే.

రాష్ట్రచరిత్రలో ఇదివరకు ఎన్నోపాదయాత్రలు జరిగాయి. కానీ ఇప్పుడు జరగబోయే పాదయాత్ర నిజంగా సాహసోపేతమైంది. 

జగన్మోహన్ రెడ్డి మాదిరిలా సినిమా షూటింగులా, ముందస్తు ప్రణాళికతో లోకేశ్ పాదయాత్ర చేయడంలేదు. 

బుగ్గలు నిమిరి, ముద్దులుపెట్టి, తలలపై చేతులుపెట్టే మోసకారీ చర్యలు లోకేశ్ గారి పాదయాత్రలో ఉండవు. 

   ప్రతి ఒక్కరు వారి గుండెల్లోని బాధ, వేదనను లోకేశ్ గారితో చెప్పుకునే అవకాశం కల్పిస్తున్నాం. 

యువత ఆశలు, ఆశయాలు నిజం చేసే శక్తి, సత్తా లోకేశ్ గారికే ఉన్నాయనే వాస్తవాన్ని యువతీయువకులు గమనించాలి.

విద్యార్థుల ప్రాణాలు పణంగాపెట్టి, కరోనా వేళ పరీక్షలనిర్వహించాలని జగన్ రెడ్డి భావిస్తే, వాటిని వాయిదా వేసేంతవరకు లోకేశ్ గారు పోరాడారు. రాష్ట్రంలో యువతకు ఏ ఇబ్బంది, సమస్య వచ్చినా లోకేశ్ ముందుంటున్నారు. 

టీడీపీ ఇప్పటికే అనేకకార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లింది. బాదుడేబాదుడు, ఇదేంఖర్మ-మనరాష్ట్రానికి కార్యక్రమాలకు ప్రజలనుంచి అనూహ్యస్పందన లభిస్తోంది.  త్వరలో ఆరంభయ్యే లోకేశ్ గారి యువగళం కార్యక్రమం అంతకు వందరెట్లు విజయ వంతం అవుతుందని గర్వంగా చెబుతున్నాం.

పోలీస్ ఉద్యోగాలకు వయోపరిమితి పెంచాలని ఈ ప్రభుత్వాన్ని పదేపదే కోరాము. లోకేశ్ గారు లేఖల ద్వారా ముఖ్యమంత్రిపై ఒత్తిడితెచ్చి, వయోపరిమితి పెంచాలని, దానివల్ల యువతకు మేలు జరుగుతుందని డిమాండ్ చేశారు. 5ఏళ్ల వయోపరిమితి ఇవ్వాలని కోరితే,  ఈప్రభుత్వం కేవలం కానిస్టేబుల్ అభ్యర్థులకు మాత్రమే రెండేళ్ల వయోపరిమితి కల్పించింది. 

రాష్ట్రంలో 1కోటి50లక్షల మంది నిరుద్యోగులున్నారు, వారంతా ఒక్కటైతేనే ఈప్రభుత్వం దిగివస్తుంది. పార్టీలు, కులాలు, మతాలు,ప్రాంతాలకు అతీతంగా ‘యువకులం’గా ఏర్పడి పాలకుల మెడలువంచాలి. 

లోకేశ్ గారి పాదయాత్రను ఈ ప్రభుత్వం అడ్డుకోవాలని చూస్తే, కొరివితో తలగోక్కోవడమే అవుతుంది.. 400రోజులు, 4,000 కిలోమీటర్ల పాటు లోకేశ్ గారి పాదయాత్ర నిరాంటకంగా సాగేలా సహకరిస్తేనే ఈ ప్రభుత్వానికి మంచిదని హితవు పలుకుతున్నాం. 

4వేలకిలోమీటర్ల పాటు అప్రతిహతంగా సాగే లోకేశ్ పాదయాత్రలో, రాష్ట్రంలోని ప్రతి యువతి యువకుడు అడుగులో అడుగేయాలని కోరుతున్నాం. 

*ముఖ్యమంత్రి అబద్ధాలకు అంతేలేదు. ఆఖరికి కలెక్టర్లు కూడా అబద్ధాలు చెప్పాల్సిందే అంటున్నాడు  : అచ్చెన్నాయుడు*

ముఖ్యమంత్రి అబద్ధాలకు అంతేలేదు. తానే ఈ రాష్ట్రానికి తొలిముఖ్యమంత్రి అయినట్టు, అంతకుముందు ప్రజలకు అసలు సంక్షేమమే తెలియదన్నట్లు మాట్లాడుతున్నాడు. అసలు ఆంధ్రప్రదేశ్ లో తొలిసారి సామాజిక పింఛన్ తీసుకొచ్చింది స్వర్గీయ ఎన్టీఆర్ గారు. తొలుత రూ.30లతో ఎన్టీఆర్ పింఛన్ పథకానికి శ్రీకారం చుట్టారు. చంద్రబాబుగారు అధికారంలోకి వచ్చాక దాన్ని రూ.75కి పెంచారు. రాజశేఖర్ రెడ్డి హాయాంలో రూ.75ల పింఛన్ రూ.200లు అయ్యింది.  మరలా చంద్రబాబుగారి హయాంలో రూ.200ల పింఛన్ రూ.2వేలు అయ్యింది. జగన్మోహన్ రెడ్డి ఎన్నిలకు ముందు రూ.3వేలు ఇస్తానని నమ్మించి, తీరా ఇప్పుడు రూ.250, రూ.250 పెంచుకుంటూ వచ్చి, మూడున్నరేళ్ల తర్వాత చచ్చీచెడి రూ.2,750కి పరిమితం చేశాడు. తండ్రీకొడుకులు ఇద్దరూకలిసి పెంచిన సామాజికపింఛన్ కేవలం రూ.875 మాత్రమే. ఎన్టీఆర్, చంద్రబాబు గారు కలిసి ఇచ్చింది రూ.1875లు. ఇదేవాస్తవం.. ఇవేవీ తెలియవన్నట్టు జగన్ రెడ్డి అబద్ధాలే చెప్పాలంటున్నాడు. ఆఖరికి కలెక్టర్లుకూడా అబద్ధాలేచెప్పాలని, తిట్టాలని హుకుం జారీచేస్తున్నా డు. చంద్రబాబుగారు దిగిపోయేనాటికి  రాష్ట్రంలో 54లక్షలమందికి పింఛన్లు ఇచ్చాము. ట్రాన్స్ జెండర్లకు, మత్స్యకారులకు పింఛన్లు ఇచ్చింది చంద్రబాబు.  సామాజిక పింఛన్ రూ.2వేలు చేసింది చంద్రబాబే నని ఈ  ప్రభుత్వంలోని అధికారులకు తెలియదా?  

*సంక్షేమం ఎవరిహాయాంలో బాగుందో జగన్ రెడ్డితో చర్చకు నేను సిద్ధం.* 

 టీడీపీ హయాంలో సంక్షేమం బాగుందో, ఇప్పుడు బాగుందో జగన్ రెడ్డితో చర్చించడానికి తానుసిద్ధం. ఎప్పుడు, ఎక్కడికి రమ్మన్నా వెళ్లి, మీడియా, ప్రజలసాక్షిగా ముఖ్యమం త్రి అబద్ధాలను నిరూపిస్తాను. ఫేక్ ముఖ్యమంత్రి ఫేక్ ప్రచారాన్ని ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత కలెక్టర్లపైనే ఉంది.  


*యువచైతన్యంతోనే జగన్ రెడ్డిని గద్దె దించగలం :  టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీమంత్రి నక్కా ఆనంద్ బాబు*

 

ఈ ప్రభుత్వచేతగానితనం, అసమర్థత, అవినీతి, దోపిడీతో రాష్ట్ర యువశక్తి కుదేలైంది.

మద్యపాననిషేధం హామీతో అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి, రాష్ట్రంలో కల్తీమద్యాన్ని ఏరులై పారిస్తున్నాడు.

డిస్టిలరీలు, మద్యందుకాణాలు అన్నీ ప్రభుత్వఅధీనంలోనే ఉన్నాయి.  

కల్తీమద్యం అమ్మకాలతో వేలకోట్లు పోగేసుకుంటున్నదని  చాలక, గంజాయి ఇతర మాదకద్రవ్యాల అమ్మకాల్లో ప్రభుత్వం మునిగితేలుతోంది. గంజాయి వాసన తెలియని పల్లెల్లు కూడా మత్తులో తేలేలాచేశారు.  

ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన యువశక్తిని జగన్ రెడ్డి మత్తులో జోగేలా చేస్తున్నాడు.

దేశంలో ఏ నాయకుడు చేయనివిధంగా జగన్ రెడ్డి తనదోపిడీకోసం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి, యువశక్తిని నిర్వీర్యంచేశాడు.  

యువత చైతన్యంతోనే జగన్ రెడ్డిని గద్దె దించగలం. 

లోకేశ్ గారు జనవరి 27న ప్రారంభించే పాదయాత్ర నిజంగా యువతకు ఒక ఆశాకిరణం.  యువత ఆయన వెన్నంటి నడవడానికి సిద్ధంగా ఉంది. 

2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డినే నమ్మిన యువత, నిలువునా మోసపోయింది.

అసత్యాలు, అబద్ధాలతో తనను నమ్మిన యువత ఆశల్ని, ఆశయాల్ని  జగన్ కూకటివేళ్లతో సహా పెకిలించాడు.

జగన్ రెడ్డి మోసానికి బలైన యువత, నేడు లోకేశ్ వెంట నడిచి, సైకో  ప్రభుత్వాన్ని రాష్ట్రంనుంచి తరిమికొడుతుందని చెప్పడానికి గర్వపడుతున్నాం.


 *యువగళం పాదయాత్రలో లోకేశ్ అన్నివర్గాల సమస్యలు తెలుసుకుంటారు :  టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీమంత్రి శ్రీ కాలవ శ్రీనివాసులు*


యువగళం పేరుతో టీడీపీ జాతీయప్రధాన కార్యదర్శి చేపట్టే పాదయాత్ర, జగన్ ని నమ్మి మోసపోయిన లక్షలాదియువత ఆక్రోశం, ఆవేదనలకు ప్రతిరూపం. 

ఉద్యోగ, ఉపాధిలేక ఇతరవృత్తులు, వ్యవసాయాన్ని నమ్ముకున్న యువకులు కూడా జగన్ ప్రభుత్వ మోసాలతో నిరాశా,నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్నారు. 

జగన్మోహన్ రెడ్డి మూడున్నరేళ్లపాలనలో అన్నివర్గాల యువత నిర్వీర్యమైంది. 

తీవ్ర నిరాశా, నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్రయువతకు భరోసా కల్పించి, వారి ఆశలు నిజంచేసేలా లోకేశ్ యువగళం యాత్ర సాగుతుంది. 

పంచాయతీరాజ్, ఐటీ శాఖామంత్రిగా లోకేశ్ గారు ఇప్పటికే యువత ఆలోచనలతో ఎలాంటి గొప్ప ఫలితాలు సాధించవచ్చో ఆచరణలో చూపించారు. 

అలాంటి వ్యక్తి రాష్ట్ర భవిష్యత్ నిర్మాణంలో యువతను భాగస్వాముల్ని చేయడానికి ముందడుగు వేస్తున్నారు. 

లోకేశ్ యువగళం పాదయాత్రలో అన్నిరంగాల సమస్యలు అధ్యయనం చేస్తారు. 

ప్రజలంతా పెద్దసంఖ్యలో ఈ పాదయాత్రలో పాల్గొని భావినాయకుడిని ఆశ్వీర్వదించాలని కోరుతున్నాం.



*జగన్ రెడ్డికి బుద్ధిచెప్పడానికి ప్రతిమహిళా, ప్రతిబిడ్డా లోకేశ్ ను ఆదరించాలి* : *టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యురాలు, తెలుగుమహిళ రాష్ట్రఅధ్యక్షురాలు శ్రీమతి వంగలపూడి అనిత.*


మూడున్నరేళ్ల జగన్ రెడ్డి పాలన కీచకపాలన. రాష్ట్రంలో సాగుతోంది కీచక పాలనే అనడానికి మహిళలు, చిన్నారులపై జరుగుతున్న దారుణాలే నిదర్శనం. జగన్ రెడ్డి పాలనలో మహిళల మనుగడే ప్రశ్నార్థకంగా మారింది.

నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ నివేదిక ప్రకారం రాష్ట్రంలో ప్రతిరోజూ 5, 6 సంఘటనలు జరుగుతున్నాయి. ప్రతి 8 గంటలకు ఒక అత్యాచారం జరుగుతోంది.

పాదయాత్ర సమయంలో జగన్ రెడ్డి మహిళల్ని ఎమోషనల్ గా  బ్లాక్ మెయిల్ చేసి, వారి ఓట్లుదండుకోవడానికి అన్నా అనే పిలుపుతో  వారిని మోసగించాడు.  

రక్షణ విషయంలో రాష్ట్రంలో పసికందు మొదలు న్యాయమూర్తులుగా ఉన్న  మహిళలవరకు ఎవరూ ప్రశాంతంగా లేరు.

వాలంటీర్ మొదలు మంత్రివరకు అందరూ మహిళల్ని కించపరిచేవారే.

సంపూర్ణ మద్యపాన నిషేధం పేరుతో జగన్ రెడ్డి మహిళల్ని మోసగించాడు.

సొంత ఖజానా నింపుకోవడానికి, కల్తీమద్యం అమ్ముతూ, మహిళల తాళిబొట్లు తెంచుతున్నాడు. 

మహిళల మానప్రాణాలు రక్షించడానికి, కీచకపాలనకు ముగింపుపలకడానికి లోకేశ్ గారు సిద్ధమవ్వడం సంతోషకరం.

400 రోజులు, 4వేల కిలోమీటర్లు సాగే లోకేశ్ పాదయాత్ర జగన్ రెడ్డి చేసిన బూటకపు పాదయాత్ర కాదు, ముద్దులపాదయాత్ర కాదు. 

తన అన్న, తనబిడ్డ తమకోసం వచ్చాడని ప్రతిమహిళ భావించేలా లోకేశ్ ఆడబిడ్డల ఆవేదనను తెలుసుకుంటాడు.   

కల్తీమద్యంతో ప్రాణాలు పోతున్నా, స్వాతంత్ర్యం రోజున నడిరోడ్డుపై యువతిని పొడిచి చంపినా ముఖ్యమంత్రి స్పందించడు. జగన్ రెడ్డికి బుద్ధిచెప్పడానికి ప్రతిమహిళా, ప్రతిఆడబిడ్డా లోకేశ్ ను ఆదరించాలి. 

చంద్రబాబుగారి హయాంలో మహిళలే స్వయంసమృద్ధి సాధించి, లక్షలు సంపాదించారు. 

జగన్ రెడ్డి వచ్చాక యువకులు మద్యం, మాంసం దుకాణాల ముందు క్యూకట్టే పరిస్థితి. 

151 సీట్లు పొంది మహిళల్ని రక్షించలేని చేతగాని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి. 

దిశాచట్టం పేరుతో ఆడబిడ్డల్ని వంచిస్తున్న దగాకోరు జగన్ రెడ్డి.

లోకేశ్ గారి పాదయాత్ర అడ్డుకోవాలని చూస్తే మహిళలే తగిన బుద్ధి చెబుతారని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.


*ఐటీశాఖ మంత్రిగా ఉన్నప్పుడే లోకేశ్ యువత ఆశల్ని నిజం చేశారు : టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు,  మాజీమంత్రి శ్రీ నిమ్మకాయల చినరాజప్ప గారు :*

* యువగళం పేరుతో 400 రోజులు, 4వేల కిలోమీటర్లు సాగే లోకేశ్ గారి పాదయాత్ర భారీగా విజయవంతం అవుతుంది.  లోకేశ్ ఎప్పుడూ యువతగురించే ఆలోచిస్తారు. ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా ఆయన వారిని ప్రోత్సహిస్తుంటారు.

ఐటీ శాఖమంత్రిగా ఉన్నప్పుడు లోకేశ్ గారు యువత ఆశల్ని, ఆశయాల్ని నిజంచేశారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనతో ప్రజలు విసిగిపోయారు అనడానికి చంద్రబాబు గారి సభలకు వస్తున్న జనాదరణే నిదర్శనం.

బాదుడేబాదుడు, ఇదేంఖర్మ-మనరాష్ట్రానికి కార్యక్రమాలు విజయవంతం కావడానికి జగన్మోహన్ రెడ్డి దిక్కుమాలిన పాలనే కారణం. యువత, పెద్దలు, మహిళల ఆదరాభిమానాలతో లోకేశ్ పాదయాత్ర బ్రహ్మండంగా కొనసాగుతుంది.


    *ఎన్టీఆర్ లోని ధైర్యసాహసాలు, చంద్రబాబులోని సహనం, పనితనం లోకేశ్ లో ఉన్నాయి : శాసనమండలి మాజీ ఛైర్మన్, టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు  శ్రీ షరీఫ్ గారు :* 

తెలుగుదేశం పార్టీ  వ్యవస్థాపక అధ్యక్షులు, స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి ధైర్యసాహసాలను, చంద్రబాబులోని సహనం, పనితనాన్ని లోకేశ్ పుణికిపుచ్చుకున్నాడు. 

లోకేశ్ చేయబోతున్న పాదయాత్ర నిజంగా సాహసోపేతమైందే. నాయకుడే ప్రజలవద్దకు వెళ్తే, అన్నిప్రాంతాలు, అన్నివర్గాలు ఆయనతో మమేకమవుతాయి. 

నిక్కచ్చి, నిజాయితీ గల నేతగా లోకేశ్ ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామి కావడం సంతోషకరం. యువతకు నిజమైన భవిష్యత్ కల్పించింది తెలుగుదేశంపార్టీనే. 

రాజకీయా

సాధారణ కుటుంబాలు కూడా ఐటీఫలాలు అనుభవిస్తూ సంతృప్తికరంగా జీవిస్తున్నాయి అంటే అందుకు కారకులు చంద్రబాబుగారే.

2014-19 మధ్యన చంద్రబాబు గారు ప్రారంభించిన ప్రాజెక్టులు అన్నీ  పూర్తై ఉంటే, రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలిచేది. 

ఒక్కఛాన్స్ అని నమ్మి మోసపోయిన ప్రజలు ఇప్పుడు ఈసురోమంటూ విలపిస్తున్నారు. ఎప్పుడు ఈ పీడను వదిలించుకుందామా అని ఎదురుచూస్తున్నారు.



*తెలుగుదేశం పార్టీ గ్రామాల్లోకి వెళ్తుంటే యువతే ఎదురొస్తుంది : శ్రీ కిమిడి నాగార్జున (విజయనగరం పార్లమెంట్ అధ్యక్షులు)* 

రాష్ట్రం ఎలాంటి దీనస్థితిలో ఉందో అందరం చూస్తున్నాం.

తెలుగుదేశంపార్టీ తరుపున తాము గ్రామాల్లోకి వెళ్తున్నప్పుడు, మాకు ముందు ఎదురొస్తుంది యువతీయువకులే.

పింఛన్లు రావడంలేదని, ధాన్యంకొనుగోళ్లు జరగడంలేదని, వీధిలైట్లు, రోడ్ల వంటిసమస్యలపై యువత స్పందిస్తోంది. 

బీసీ, ఎస్సీఎస్టీ సబ్ ప్లాన్ నిధుల్ని తీసేయడంపై  యువత ఆగ్రహంతో ఉన్నారు. 

ఎన్ని ఇబ్బందులున్నా, యువతలో చైతన్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.

యువగళం పేరుతో లోకేశ్ గారు చేపట్టే పాదయాత్రకు యువత బ్రహ్మరథం పట్టడం ఖాయం. తెలుగుదేశంపార్టీ అధికారంలోకి వస్తేనే యువత ఆత్మాభిమానంతో గర్వంగా బతకగలరు. 


*జగన్ పాదయాత్రలో ప్రజలసొమ్ము ఎలా కొల్లగొట్టాలి.. ప్రతిపక్షాలను ఎలా అణచివేయాలో నేర్చుకున్నాడు : శ్రీ నిమ్మల కిష్టప్ప (మాజీఎంపీ)*

 జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో  ఏ విధంగా ప్రజలసొమ్ము కొల్లగొట్టాలి..ఏవిధంగా ప్రతిపక్షాలను అణచివేయాలనేదే ఎక్కువగా నేర్చుకున్నాడు.

రైతులు, యువత, మహిళల సమస్యలు వినే పరిస్థితిలో ముఖ్యమంత్రి లేడు.

నారాలోకేశ్ పాదయాత్రలో యువతే ముందుండాలని, వారి భవిష్యత్ కోసం టీడీపీ యువనేత చేపట్టిన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం. 


*లోకేశ్ పాదయాత్రలో ప్రజలే  జగన్మోహన్ రెడ్డి దోపిడీని బహిర్గతపరుస్తారు : నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి (టీడీపీ జాతీయప్రధాన కార్యదర్శి)*

ముఖ్యమంత్రి అబద్ధాలకు అంతేలేకుండా పోయింది. 

చంద్రబాబుగారి హాయాంలోనే సామాజిక పింఛన్ రూ.2వేలు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డేమో రూ.1000లు ఉండే పింఛన్ ని రూ.2,750కి పెంచానని నిస్సిగ్గుగా అబద్ధాలాడుతున్నాడు.

 ముఖ్యమంత్రి స్థానంలో ఉండి, ప్రజలసమక్షంలో పచ్చిగా అబద్ధాలు చెప్పడం జగన్ కే చెల్లింది. లోకేశ్  పాదయాత్రలో ప్రజలే జగన్మోహన్ రెడ్డి దోపిడీని బహిర్గతపరుస్తారు.

లోకేశ్  పాదయాత్ర 400రోజులు, 4వేల కిలోమీటర్లకే పరిమితమవుతుందని నేను అనుకోవడం లేదు. ప్రజలస్పందన నానాటికీ పెరుగుతుంది కాబట్టి, అది ఎంతకాలమైనా సాగవచ్చు.



  




ల్లో కూడా యువతకు సముచిత భాగస్వామ్యం కల్పించింది ఎన్టీఆర్, చంద్రబాబులే. 

ప్రాథమికవిద్య నుంచే సాంకేతికంగా యువత ముందుండాలనే సత్సంకల్పంతో చంద్రబాబు గారు ఐటీ రంగాన్ని ప్రోత్సహించారు.

Comments