*హైకోర్టుకు హాజరైన ఏపీ డీజీపీ* అమరావతి: ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాoగ్ హైకోర్టుకు హాజరయ్యారు. అక్రమ మద్యం రవాణాలో సీజ్ చేసిన వాహనాలను పోలీసులు తమకు అప్పగించడం లేదని పలువురు వాహనదారులు పెద్ద ఎత్తున హైకోర్టులో పిటిషన్లు వేశారు. కేసులు నమోదు చేస్తున్న వాహనాలను మేజిస్ట్రేట్ లేదా ఎక్సైజ్ డిప్యూటీ కమినర్ ముందు హాజరు పర్చాల్సి ఉంటుంది. అయితే పోలీసులు ఈ నిబంధనలు పాటించకుండా పోలీస్ స్టేషన్లలోనే ఉంచేస్తున్నారు. వాహనాలను చట్టబద్దంగా విడిపించుకునే ప్రయత్నం చేసినా దానికి పోలీసులు అంగీకరిచడంలేదని వాహనదారులు ఆరోపించారు. అక్రమ మద్యం రవాణాలో సీజ్ చేసిన వాహనాల విడుదలకు సంబంధించి దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ ముగిసింది. కోర్టు ఆదేశాల మేరకు విచారణకు డీజీపీ గౌతమ్ సవాoగ్ హాజరయ్యారు. సీజ్ చేసిన వాహనాల విషయంలో పోలీస్ అధికారులు నిబంధనలు పాటించలేదని, సుబార్డినెట్‌ల పనితీరు బాగాలేదని న్యాయస్థానం పేర్కొంది. వాహనాలు సీజ్ చేసిన మూడు రోజుల్లో డిప్యూటీ కమిషనర్ ఎక్సైజ్ ముందు ప్రవేశపెట్టాలని, వెంటనే వాహన దారులు ఎక్సైజ్ కమిషనర్ ముందు అప్లికేషన్ పెట్టుకోవచ్చుని కోర్టు పేర్కొంది. ఎక్సైజ్ కమిషనర్ మూడు రోజుల్లో సీజ్ చేసిన వాహనాలపై నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది.


Comments