*ప్రకాశం జిల్లా...* వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణ పనులు అక్టోబరు నెలాఖరు నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ అధికారులను ఆదేశించారు. దోర్నాల మండల కేంద్రంలోని వెలుగొండ ప్రాజెక్టు కార్యాలయంలో వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణ పనులు, ముంపు గ్రామాల్లో పునరావాసం, మౌలిక సదుపాయాలు, తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ వెలిగొండ ప్రాజెక్టు ఇంజినీర్లు, రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణ పనులు యుద్దప్రాతిక పై ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. కరోనా వైరస్ ప్రభావం వల్ల వెలిగొండ ప్రాజెక్టు పనులు మిషనరీ, లేబర్ అందుబాటులో లేని కారణంగా పనులు నిలిచిపోయాయన్నారు. వెలుగొండ ప్రాజెక్టు పనులు చేస్తున్న కాంట్రాక్టర్ల కు అవసరమైన లేబర్ ఇతర రాష్ట్రాల నుంచి తీసుకురావడానికి అనుమతి ఇస్తామని ఆయన అన్నారు. వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణం కోసం ప్రభుత్వం నిధులను మంజూరు చేయడం జరిగిందన్నారు. ప్రాజెక్టు నిర్మాణ పనుల చేపట్టిన కాంట్రాక్టర్లకు వెంటనే బిల్లులు చెల్లించడానికి బిల్లులు తయారు చేసి ప్రభత్వానికి పంపాలని కలెక్టర్ ఇంజినీర్ల ను ఆదేశించారు. ప్రాజెక్టు మొదటి సొరంగము పనులు రెండవ వైపు నుండి కూడా మొదలు పెట్టి సెప్టెంబర్ నాటికి పనులు పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. సుంకేసుల గ్యాప్ లో లిఫ్ట్ మరియు లైటింగ్ పనులు సెప్టెంబర్ నాటికి పూర్తి చేయాలని ఆయన అన్నారు. ప్రాజెక్టు పనులు పూర్తి అయిన తర్వాత ప్రాజెక్టు ప్రాంతాల్లో శుభ్రం చేయడానికి అవసరమైన ప్రతిపాదనలు తయారు చేసి ప్రభత్వానికి పంపాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన భూసేకరణ వెంటనే పూర్తి చేయాలని ఆయన అన్నారు. భూ సేకరణ కోసం అదనంగా సర్వేయర్ ను కేటాయిస్తామని ఆయన అన్నారు. ప్రాజెక్టు పనులు సకాలంలో పూర్తి చేయని కాంట్రాక్టర్ల కు నోటీసు లు ఇచ్చి రద్దు చేయాలని ఇంజినీర్ల ను కలెక్టర్ ఆదేశించారు. ప్రాజెక్టు ముంపు గ్రామాల్లో వాలoటీర్ల సహకారంతో బాధితుల జాబితాలను తయారు చేయాలని ఆయన అన్నారు. ముంపు గ్రామాల బాధితులకు వన్ టైం సెటిల్మెంట్ ప్రకారం 12.50 లక్షలు, లేదా 3.99 లక్షల రూపాయలతో పునరావాస కేంద్రంలో గృహాలు నిర్మించడము జరుగుతుoదని కలెక్టర్ తెలియజేశారు. ప్రాజెక్ట్ పునరావాస కేంద్రాలు తోకపల్లి, గోగులదిన్నె, ఇడుపూర్ 1, ఇడుపూర్ 2, ఇడుపూర్ 3 వేములకోట కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆయన అన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ జె. వెంకట మురళి, ప్రాజెక్టు భూసేకరణ ప్రత్యేక కలెక్టర్ గంగాధర్ గౌడ్, ఉప కలెక్టర్ చంద్రలీల, విజయ్ కుమార్, ప్రాజెక్టు ఇంజనీర్లు, గృహ నిర్మాణ శాఖ అధికారులు, శ్రీనివాస కన్స్ట్రక్షన్ ప్రతినిధి మల్లికార్జున, గాయత్రి కన్స్ట్రక్షన్ ప్రతినిధి ఆర్.వి.సుబ్బారావు, మార్కాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి ఎం.శేషి రెడ్డి, తహసీల్దార్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.


Comments