అచ్చెన్నాయుడు హత్యకు కుట్ర చేశారా?: ఆలపాటి రాజా అమరావతి (ప్రజాఅమరావతి): టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని హత్య చేయాలని కుట్ర చేశారా? అని ఆలపాటి రాజా ఫైర్ అయ్యారు. అచ్చెన్న డిశ్చార్జ్‌పై ఒత్తిళ్లు వస్తున్నాయని జీజీహెచ్‌ అధికారులు చెబుతున్నారన్నారు. అచ్చెన్నాయుడును జీజీహెచ్‌లోనే విచారించాలని కోర్టు ఆదేశించిందని రాజా పేర్కొన్నారు. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ డిశ్చార్జ్‌ చేయాలని చూశారన్నారు. అర్ధరాత్రి అచ్చెన్నాయుడును డిశ్చార్జ్‌ చేయించి.. అదుపులోకి తీసుకోవాలని ఏసీబీ ప్రయత్నించిందని ఆలపాటి రాజా ఆరోపించారు.


Comments