'ఇంత నీచ రాజకీయాలు ఎప్పుడు చూడలేదు' విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్‌ మాజీ ఎన్నికల ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌తో బీజేపీ నేతలు కామినేని శ్రీనివాస్‌, సుజనా చౌదరి రహస్యంగా భేటీ కావడంపై మంత్రి అవంతి శ్రీనివాస్‌ మండిపడ్డారు. మంగళవారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..' చంద్రబాబు అడుగడుగునా కుట్రలకు పాల్పడుతున్నారు. ఇంత నీచమైన రాజకీయాలు గతంలో ఎపుడూ చూడలేదు. మూడు రాజధానుల ప్రకటన తర్వాత భారీగా కుట్రలు పన్నుతున్నారు. నేరుగా మాతో యుద్దం చేసే ధైర్యం లేక దొడ్డిదారిన వస్తున్నారు. విశాఖలో భూ అక్రమాలు జరిగాయని నిరూపిస్తే రాజీనామా చేస్తానని సవాల్ విసిరినా నిరూపించలేక‌పోయారు. మీ‌ కుట్రలకి‌ ఇక చెల్లు. మీరెన్ని‌కుట్రలకు పాల్పడినా మేము రాష్ట్రాన్ని అభివృద్ది చేస్తాం. నిమ్మగడ్డ రమేష్ ప్రజలకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయన కుట్రలేంటో బయటపడాలి. మాకు తెలిసింది‌ ఒక్కటే ప్రజలకి సేవ చేయడం... ప్రజల‌ మెప్పు పొందడం...మళ్లీ ఎన్నికలకి వెళ్లడం.నీచ రాజకీయాలకి పాల్పడితే చూస్తూ ఊరుకోం.ఏడాది కాలంలో 90 శాతానికి పైగా హామీలు నెరవేర్చడంతో చంద్రబాబు ఓర్వలేకపోతున్నారు. చంద్రబాబు కుట్ర స్వభావాన్ని‌ మార్చుకోకుండా ప్రభుత్వంపై తప్పుడుగా బురద జల్లాలని చూస్తున్నారు.కుట్రలతో వ్యవస్ధలని అదుపులో పెట్టుకుని రాష్ట్రాభివృద్దిని అడ్డుకోవడం తగదు. గత ఏడాది కాలంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు ఎక్కడున్నారు. ఏడాదిగా బయటకి రాని వ్యక్తి ఇపుడు ఎందుకు వచ్చారు. తన అనుచరుడు‌ కిషోర్ను సిఐడి‌ పోలీసులు అరెస్ట్ చేస్తే ఎందుకు సిఐడి ఆఫీస్‌కి వచ్చావు. ఈ కేసులో తన పేరు ఎక్కడ బయటపడుతుందోననే భయంతోనే గంటా బయటకి వచ్చారే తప్ప కిషోర్ పై ప్రేమతో మాత్రం సిఐడి కార్యాలయానికి రాలేదు. కుట్రల‌ వెనుక ఎవరున్నా .. అన్ని సాక్ష్యాదారాలతోనే నిందితులను సిఐడి అధికారులు అరెస్ట్ చేశారు' అంటూ ధ్వజమెత్తారు


Comments