*మండలిలో లోకేష్ ఫొటోలు తీశారు.. అది క్రైమ్: మంత్రి కన్నబాబు* అమరావతి: సభ జరుగుతుంటే లోకేష్ ఫొటోలు తీశారని మంత్రి కన్నబాబు అన్నారు. వెలంపల్లి, తానూ లోకేశ్ వద్దకు వెళ్లి వద్దని చెప్పామని ఆయన తెలిపారు. రెచ్చగొట్టొద్దంటూ వెలంపల్లి చెబితే బీదా రవిచంద్ర.. మరికొందరు ఎమ్మెల్సీలు దాడి చేశారని తెలిపారు. రూల్స్ అమలు కావన్నట్టుగా యనమల మాట్లాడారన్నారు. ‘‘రూల్ 90 వర్తించదు. 24 గంటల ముందు నోటీసులివ్వాలి. నాడు ఛైర్మన్ షరీఫ్.. నేడు మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రమణ్యం ఒకే విధంగా ప్రవర్తించారు. మూడాఫ్ ద ఫ్లోర్ కూడా తీసుకోలేదు. మిగిలిన పార్టీల అభిప్రాయం తీసుకోవాల్సిన అవసరం లేదా..?. వికేంద్రీకరణ అంటేనే టీడీపీకి ఇష్టం లేదు. లోకేష్ సభలో ఫొటోలు తీసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది క్రైమ్.. చట్ట ప్రకారం లోకేష్‌పై చర్యలు తీసుకోవాలి.’’ అని మంత్రి కన్నబాబు అన్నారు.


Comments